– తెలంగాణ ద్రోహి కేసీఆర్
– తెలంగాణ కు ఏం పీకడానికి రాహుల్ గాంధీ వస్తున్నాడు
– ఎంఐఎం వాడికి గ్రూప్ 1 ఉద్యోగాలను తాకట్టు పెట్టారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
పాలమూరు అంటేనే జోష్… అందుకే ఈ గడ్డ నుంచే 2వ విడత పాదయాత్ర చేపట్టాం. తెలంగాణ లో వచ్చేది బీజేపీ నే అని మధ్యాహ్నం మీటింగ్ లో జేపీ నడ్డా అన్నారు. నేటితో పాదయాత్ర 22 రోజుల మైలురాయి పూర్తిచేసుకుంది. అశేషంగా, విశేషంగా తరలివచ్చిన పాలమూరు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మవారిని దర్శించుకున్నా… స్వామివారి ని దర్శించుకోలేకపోయా… బీజేపీ అధికారంలోకి రాగానే వస్తానని మొక్కుకున్నా.
మన్యంకొండ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయం లా అభివృద్ధి చేస్తాం. పాలమూరు ప్రజల్లో కసి ఉంది.ప్రజల కోసమే ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తున్నాం.అలంపూర్ నుంచి మహబూబ్నగర్ వరకు ఎక్కడ చూసినా…. ఎడారి మాత్రమే కనిపించింది.
పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టాడు. RDS హామీ ఏమైంది కేసీఆర్? RDS ఆధునీకరణ ఎందుకు చేయడం లేదు? RDS సమస్యను నువ్వు సహకరిస్తే… 6 నెలల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం నెరవేరుస్తుంది. 69 జీవో ను అమలు చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
1400 కోట్లు ఖర్చు చేస్తే…ఇక్కడి ప్రాజెక్టు లు పూర్తి అవుతాయి. 70,000 కోట్ల అంచనాతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టి, పూర్తి చేయలేదు. బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టు లను పూర్తి చేయడు. ఎడారిగా మారిన పాలమూరు లో రైతులు చనిపోతున్నారు.
వరి కొంటా అంటాడు… మళ్లీ కొన అని అంటారు.సీఎం నిర్వాకంతో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు.తెలంగాణ ద్రోహి కేసీఆర్. కృష్ణా జలాల్లో 575 TMC ల నీటి వాటా తెలంగాణ కు రావాల్సి ఉండగా…. చంద్రబాబు కి అమ్మాడుపోయి 299TMC లకు ఒప్పుకుని, ప్రజలను మోసం చేసిన ద్రోహి కేసీఆర్.
పాలమూరులో వలసలు ఉన్నాయని నేను నిరూపిస్తా కేసీఆర్ఒకవేళ నేను నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ చేస్తే…. తోకముడిచి పోయిండు కేసీఆర్.కళ్ళు దొబ్బినై కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి.
తెలంగాణ కు ఏం పీకడానికి రాహుల్ గాంధీ వస్తున్నాడు? 1400 మంది అమరులయ్యాక తెలంగాణ ఇచ్చినందుకా?1400 మంది అమరులను బలి తీసుకున్నందుకు కాంగ్రెస్ కు తెలంగాణ లో చోటు లేదు.నేను నోరు తెరిస్తే…ఇక్కడి మంత్రి బతుకు ఏమవుతుందో ఆలోచించాలి. మీరు రౌడీయిజం చేస్తే…మేము పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం రౌడీయిజం చేస్తాం.గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఉర్దూ ని చేర్చారు. ఎంఐఎం వాడికి గ్రూప్ 1 ఉద్యోగాలను తాకట్టు పెట్టారు. ఉర్దూ ద్వారా గ్రూప్ 1 లో ఉద్యోగాలు పొందితే… బీజేపీ ప్రభుత్వం రాగానే వారిని తొలగిస్తాం.
పాలమూరు జిల్లాను పాలమూరు జిల్లానే చేస్తాం… మహబూబ్నగర్ జిల్లా కాదు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు.సరూర్ నగర్ లో దళిత బిడ్డ నాగరాజు అతి దారుణంగా హత్య చేశారు.రంగురంగుల జెండాకు చోటు లేదు.పాలమూరు లో ఎగిరేది కాషాయ జెండానే. కాంగ్రెస్, టీడీపీ, trs కి అవకాశం ఇచ్చారు… ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.