– భారతీయ జనతా పార్టీ నేత డా దాసోజు శ్రవణ్
‘నారాయణ, చైతన్య లతో పాటు అనేక కార్పోరేట్ కాలేజీలు ఇష్టా రాజ్యంగా ఫీజులు దోపిడీకి పాల్పడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడుతున్నట్లు.. కనీసం ఫీజులు నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేయకపోగా.. ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేస్తున్న కాలేజీలకు టీఆర్ఎస్ పెద్దలు కొమ్ముకాస్తు ఈ దోపిడీ వ్యాపారంలో భాగస్వాములై తెలంగాణ విద్యార్ధులు, తల్లితండ్రుల పట్ల శాపంగా మారారు” అని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నేత డా దాసోజు శ్రవణ్. రామంతాపూర్ నారాయణ కాలేజీ లో జరిగిన దారుణం పై ఆవేదన వ్యక్తం దాసోజు శ్రవణ్.
ఈ దారుణ ఘటనపై దాసోజు మాట్లాడుతూ.. రామంతాపూర్ కి చెందిన సాయినాథ్ స్థానిక నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి టీసీ ఇవ్వమని కోరితే 16వేల రూపాయల ఫీజు కట్టనిదె టీసీ ఇవ్వమని యాజమాన్యం జులుం చూపిస్తుంటే, ఓయూ విద్యార్ధి సంఘం నాయకులు వెంకటచారి సందీప్ ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాదనికి వెళితే .. జరిగిన దారుణమైన ఘటనలో పెట్రోల్ మంటల్లో గాయపడిన వెంకటచారి సందీప్ చావు బతుకుల మధ్య డీఆర్ డీవో అపోలో లో ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి.
తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పోరేట్ కాలేజీల ఫీజులు అరికడతాం, అసలు కార్పోరేట్ కాలేజీలే ఎత్తేస్తామని నినాదం ఇచ్చాం. కార్పోరేట్ కాలేజీల ఎత్తివేత మాట అటుస్తే.. ఫీజుల దోపిడీ రెట్టింపై ఒక దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. రాంకులు, ఏసీ క్యాంపస్, ఐఐటీ కోచింగ్ సెంటర్లు , ఫుల్ టైం కోచింగ్ సెంటర్లు పేర్లతో ఇష్టా రాజ్యంగా దోపిడీకి పాల్పడుతుంటే దున్నపోతు మీద వాన పడుతున్నట్లు కనీసం ఫీజులు నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు.
ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేస్తున్న కాలేజీలకు టీఆర్ఎస్ పెద్దలు కొమ్ముకాస్తు ఈ దోపిడీ వ్యాపారంలో భాగస్వాములై తెలంగాణ విద్యార్ధులు, తల్లితండ్రుల పట్ల శాపంగా మారారు” అని ధ్వజమెత్తారు దాసోజు.
ఫీజు నియంత్రణ కమిటీ ఎందుకు వేయడం లేదు ? పేదవాడు తెలంగాణలో చదువుకునే అవకాశం లేదా ? ఫీజు కట్టనిదే టీసీ ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేసే ధైర్యం కాలేజీలకు ఎవరిచ్చారు ? ఎవరి అండ చూసి ఇలా వ్యవహరిస్తున్నారు ?
టీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోని పెద్దల దుర్మార్గమైన వ్యవహారం వలన నారాయణ, చైతన్య మొదలైన కార్పోరేట్ కాలేజీలు ఈ దోపిడీకి పాల్పడుతున్నాయి. దోపిడీ చేసింది చాలు. ఇకనైనా మానవత్వంతో తెలంగాణలోని మధ్యతరగతి పేదింటి బిడ్డలు చదువుకునే విధంగా కార్పోరేట్ కాలేజీలు చేస్తున్న ఫీజ్ జులుం పై వెంటనే చర్యలు తీసుకుకోవాలి. విద్యార్ధులని టీసీలు ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
సందీప్ వెంకటచారి చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుంటే ప్రభుత్వం నుండి ఒకరుకూడా పరామర్శ చేసిన పాపానికి పోలేదు. మానవత్వం లేదా ? వెంటనే హాస్పిటల్ కు ఆదేశాలు ఇచ్చి వారి ప్రాణాలని ఎలాగైనా కాపాడుకోవాలని కేసీఆర్, కేటీఆర్ చెప్పాలి. వారికి ఏమైనా జరిగితే టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చేల్లిచుకోవాల్సి వస్తోంది.” హెచ్చరించారు.