-ఇప్పుడు ఆయన, ఆయన కొడుకు కించపరుస్తున్నారు
-మీరు కిచపరుస్తుంది వ్యక్తిని కాదు ప్రజాస్వామ్యాన్ని
-భారత దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచపటం మీద నిలబెట్టిన వ్యక్తి మోదీ
-బీజేపీలో చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారు
-BRS ఉన్నంతకాలం పార్టీ అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రి మీ కుటుంబసభ్యులు కాక వేరే వారు అవుతారా ?
-TSPSC లీకేజీకి పూర్తి బాధ్యత కెసిఆర్ వహించాలి
-కవిత .. ఒక మహిళ లిక్కర్ స్కాం లో ఉండొచ్చా?
-కెసిఆర్ .. ఆరోపణరాగానే నన్ను భర్తరఫ్ చేశారు.. మీ బిడ్డ అయితే కాపడతారా ? బిడ్డ బాధ తెలంగాణ బాధ అయ్యిందా ?
-కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినా ఒక్కటే
-కెసిఆర్ తో నిలిచి కొట్లాడే పార్టీ బీజేపీ ఒక్కటే
-భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్
జిల్లా మాజీ అధ్యక్షులకు సన్మానం
భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే పార్టీకి ఒక అడ్రస్ ఉండాలని.. పార్టీ ఆఫీస్ ఒక భరోసా కేంద్రంగా ఉండాలి కిరాయి బిల్డింగ్ ఉండవద్దు, ప్రజలకు విశ్వాసం కల్పించే కేంద్రంగా ఉండాలి అనే గొప్ప భావనతో రాజ్‌నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని, దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు వరంగల్‌లో ప్రారంభించుకోవడం సంతోషం.
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ అసెంబ్లీలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ప్రధానమంత్రిగా వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు గాక కానీ వారు వ్యక్తులు కాదు వ్యవస్థకు ప్రతిరూపం అని చెప్పారు కేసీఆర్. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ వేదికగా ప్రధానమంత్రిని పట్టుకొని అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు ఇదేమి సంస్కారం అని కేసిఆర్ నిలవరించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం ఆయన కాళ్ల దగ్గర ఉండే మంత్రులు ప్రధానమంత్రి అని తూలనాడుతున్నారు. వారు కించపరిచేది నరేంద్ర మోడీ గారిని కాదు.. వారు ఇన్సల్ట్ చేస్తుంది దేశ ప్రజాస్వామ్యాన్ని. వారు తూలనాడుతుంది దేశ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తులను కాదు.
భారతదేశమంటే పేద దేశమని, అడుక్కునే దేశమని, ఇతర దేశాల మెప్పుతో బ్రతికే దేశమని చిన్నప్పటి నుంచి ఒక అభిప్రాయం ఉండేది. కానీ భారతదేశం ఆత్మన్యూనతతో బ్రతికే దేశం కాదు..ఆత్మగౌరవంతో బ్రతికి దేశమని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. చాయి అమ్ముకునే సామాన్య వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రిగా ఎదగడానికి అవకాశం ఉందని నిరూపించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది ఇంకో పార్టీలో అవకాశం లేదు. కేసీఆర్ గారిని అడుగుతున్నాను.. టిఆర్ఎస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వ్యక్తి దేశ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడుగుతున్నాను. మూడో మాట రేపు నీ పార్టీ అధికారంలోకి వస్తే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అధికారం చెలాయిస్తారు తప్ప మరో వ్యక్తికి అవకాశం ఉందా? టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినన్ని రోజులు వేరే వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అంటే లేదు లేదు లేదు… అందుకే మీ దాంట్లో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఒక దళిత బిడ్డ ఈ పార్టీకి అద్యక్షుడు అయ్యే అవకాశం లేదు. ఉద్యమం కోసం పుట్టిన పార్టీని కుటుంబపరం చేసుకున్నావు. అది పతనమవడం ఖాయం.
కేసీఆర్ ది ప్రజా కంటక ప్రభుత్వం. దానికి సజీవ సాక్ష్యం అక్రమ అరెస్టులు. కాకతీయవిశ్వవిద్యాలయం లోపల ఏళ్ల తెరపడి చదువుకున్నాం ఉద్యోగాలు కావాలి అని అడిగితే అరెస్టులు చేస్తున్నారు. మా అమ్మ కూరగాయలమ్మి, నాన్న ఆటో నడిపి, నాటువేసి..కలుపుతీసి.. సంపాదించి పంపిన డబ్బులు 20 ఏళ్లుగా చదువుకున్నాము. మా అమ్మ ఆశపడింది నేను ఉద్యోగం చేస్తే చూసి మురవాలని. కానీ 10 ఏళ్లకు కూడా నోటిఫికేషన్లు రావు. 2011లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడితే మళ్లీ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు అదీ కూడా రద్దు చేశారు. బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం అనుకుంటాం కానీ బీహార్‌లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయో అన్ని ఉద్యోగాలు నింపుతున్నతత్వం బీహార్‌లో ఉంది.. కానీ తెలంగాణలో అది లేదు.
తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామాల కోసం. నేను అడుగుతున్న కేసీఆర్ గారు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు1 లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు నింపుతామని మొదటి బడ్జెట్ సమావేశంలో సమాధానం ఇచ్చారు. మొత్తం మీరు ఇచ్చిన ఉద్యోగాలు,కాంట్రాక్ట్ వారిని పర్మినెంట్ చేసిన అన్ని కలిపితే కూడా లక్ష ఉద్యోగాలు దాటలేదు. కొట్లాడిన విద్యార్థులకు ఆశాభంగం కలిగింది తప్ప ఉద్యోగాలు రాలేదు. 12 పేపర్లు లీకు అయ్యాయి. 30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తి కెసిఆర్. దీనిమీద మాట్లాడితే పరువు నష్టం వేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇన్ని పేపర్లు లీకైన తర్వాత కూడా సిగ్గు లేకుండా కుర్చిమీద కూర్చుంటున్న వ్యక్తి కెసిఆర్. దీనికి సంపూర్ణ బాధ్యత కేసిఆర్ మాత్రమే వహించాలి. ట్రైన్ ఆక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మంత్రులు ఉన్న వ్యవస్థ మనది. నీకు ఏమాత్రం నిజాయితీ ఉన్న బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాము.
మీరు ఏం సాంప్రదాయం తెచ్చారు. విద్యార్థులకు చదువుకుంటే మాత్రమే ఉద్యోగాలు వస్తాయని..పైరవీలు నడవమని మేము చెప్తుంటే.. మీరు ఉద్యోగాలకు వెలకట్టే పరిస్థితి తీసుకొచ్చారు. పైసలు ఇస్తే తప్ప నౌకరి రాదని, పైరవీ చేస్తేనే నౌకరి వస్తదని, కలిగిన వారికి, అధికారంలో ఉన్నవారికి మాత్రమే ఉద్యోగం వస్తుందని తేల్చి చెప్పిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అందుకే విద్యార్థులు తమ ఆక్రోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిని కూడా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. చదువుకున్నవాడి జీవిత ఆశయం నౌకరి పొందడం. అంతగా అలమటిస్తున్న వారి జీవితాల్లో మట్టి కొట్టి, ఆశలు ఓమ్ము చేసిన ముఖ్యమంత్రి ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఉస్మానియా విద్యార్థులను, బీజేవైఎం నాయకులను, కాకతీయ విశ్వవిద్యాలయ నాయకులను జైలుకు పంపిస్తూ ఉండవచ్చు కేసులు పెట్టొచ్చు. కానీ ఖబర్దార్ ముఖ్యమంత్రి మా పిల్లల్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే, మా పిల్లల మీద పోలీసుల దుర్మార్గం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు తాత్కాలికంగా విజయం సాధించవద్దు కానీ అంతిమ విజయం ధర్మానదే. తెలంగాణ ఉద్యమంలో నిరంకుషితం మీద పోరాటం ఎలా చేయాలో తెలుసుకున్నాం. అదే పోరాటం చేసి నిన్ను గద్దె దింపుతాము.
హైదరాబాద్ నుండి వస్తుంటే నస్కల్ గ్రామంలో నన్ను ఆపారు. 62 ఎకరాలు ఎప్పుడో దళితుల కోసమని మాకు ఇచ్చారు.. ఆ భూమి కేసీఆర్ లాక్కుంటున్నాడు. కేసీఆర్ మోసపు మాటలు ఇంకా ప్రజానాకానికి పోవాల్సి ఉంది అది పోనంతవరకు ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా చలామణి అవుతూనే ఉంటారు. నస్కల్ భూమి ఎకరాకు 50 లక్షలు ఉండొచ్చు.. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కో ఎకరం 10 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల విలువైన భూములు 5800 ఎకరాల భూములను వేలకోట్ల రూపాయల దళిత భూములను రియల్ ఎస్టేట్ కోసం లాక్కొని. ఎకరం తీసుకొని 300 గజాలు ఇస్తున్నారు. మూడు ఎకరాల భూమి దేవుడు ఎరుగు, దళితుల భూములు గుంజుకుంటున్నారు. సంగారెడ్డి లో 20 గుంటల భూమిని లాక్కుంటే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పేదల భూములు గుంజుకున్న ప్రతిచోట పోరాటం చేస్తుంది. దూబకుంట రోశమ్మ మధ్య వ్యతిరేక పోరాటం చేస్తే మధ్య నిషేధం ఏర్పాటు చేశారు. ఈనాటికి కూడా ఆ శాఖ పేరు మధ్య నిషేధ శాఖ. ఏ మహిళ అయినా తాకుడికి వ్యతిరేకంగా ఉంటారు. బిఆర్ఎస్ పార్టీని పెట్టి ఏం వారసత్వం అందిస్తానని కేసీఆర్ అంటున్నారు.. నాలుగు కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రంలో 45 వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయం ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో 24 కోట్ల జనాభా ఉంటే మద్యం ఆదాయం 30 వేల కోట్ల రూపాయలు. ఎక్కడ యూపీ ఎక్కడ తెలంగాణ. ఇదే సంస్కృతిని భారతదేశానికి అందించాలని చూస్తున్నారా?
కవిత గారు మహిళలు లిక్కర్ వ్యాపారం చేయవచ్చా? ఎక్కడన్నా చేస్తున్నారా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తెలంగాణ చాలదన్నట్టు, తెలంగాణ డబ్బులు సరిపోవు అన్నట్టు ఎక్కడో ఢిల్లీకి పోతున్నారు. 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నవారు జైల్లో మగ్గుతున్నారు. వారికి వీళ్లు ధైర్యం ఇచ్చి మేమున్నామని ఇక్కడ స్కాంలో ఇన్వాల్వ్ చేస్తే వారందరూ తీహారు జైల్లో మగ్గుతున్నారు. తన బిడ్డ ఏం చేసింది వందకోట్ల రూపాయలకే పెద్ద విషయమా? ఆదాని ఎంత పెద్ద స్కామ్ చేశారు అని మాట్లాడుతున్నారు. 100 కోట్ల 200 కోట్ల పక్కన పెట్టండి మహిళ మద్యం వ్యాపారం చేయొచ్చా? వీళ్ళందర్నీ జైలుకు పోవడానికి కారణం కావచ్చా? కేసీఆర్ గారు వారసత్వంగా ఇదేనా ఇచ్చేవి. భూములు ఎలా గుంజుకోవాలి.. లిక్కర్ ఎలా అమ్ముకోవచ్చు. పుస్తెలు ఎలా తెంపొచ్చు. అనేది దేశానికి పరిచయం చేస్తారా? నా కొడుకు అయినా, కూతురైన తప్పు చేస్తే సమానమే అని అసెంబ్లీ వేదికగా చెప్పిన కేసీఆర్.. మీకు నిజాయితీ ఉంటే మీ బిడ్డ మీద చర్యలు తీసుకునే దమ్ము ఉందా? నీ కుటుంబం బాధ తెలంగాణ ప్రజల బాధ అయిపోయిందా? నీ బిడ్డ బాధ మొత్తం మంత్రులు ఎమ్మెల్యేల బాధ అయిపోయింది. టికెట్లు కొనిపించి ఢిల్లీకి పంపిస్తున్నారు. చిన్న తప్పు చేసినానే నన్ను బర్తరఫ్ చేసావు కదా.. నీకు నిజాయితీ ఉందా? నీ కూతురు తప్పు చేసింది అని ఆరోపణ వస్తే బహిష్కరించాల్సింది పోయి.. భర్తరఫ్ చేయాల్సింది పోయి.. కూతురు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేనంత దద్దమ్మలు కాదు.
లిక్కర్ స్కాం పార్టీల వ్యవహారం కాదు. దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగితే తప్పులు ఇన్వాల్వ్ అయితే జైలుకు పోవాల్సిందే. తీహార్‌లో మగ్గాల్సింది తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణలో చైతన్యవంతమైన గడ్డ వరంగల్, కరీంనగర్. పోరాట కేక మొదలు ఇక్కడ వినిపిస్తుంది. సమ్మక్క సారక్కలకు వారసులు. 1983 మనకు సజీవ సాక్ష్యం. తెలంగాణ ప్రజలందరూ ఒక నిర్ణయించుకున్నారు. కేసీఆర్ ను ఓడగొట్టకపోతే మనకు మోక్షం లేదు అని. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గెలిచిన తర్వాత మళ్ళీ వారు మళ్లీ టిఆర్ఎస్కే పోతారు. కెసిఆర్ కి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందర్నీ తీసుకున్న వ్యక్తి కెసిఆర్. 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయింది కేసీఆర్. ఆయనే రాహుల్ గాంధీ గురించి వకాల్తా పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అంతరించిపోతున్న పార్టీ. 2018 లో అధికారం వచ్చిన తర్వాత ప్రజలు అంటే కేసీఆర్ కి లెక్కలేకుండా పోయింది. పంటే పామోజులో లేదంటే ప్రగతిభవన్‌లో తప్ప.. ప్రజల గురించి ఆలోచన లేదు. మోడీ అండదండలతో కేసీఆర్ మీద బరి గీసి కొట్లాడే పార్టీ బిజెపి. నాయకులను తీసుకొని వచ్చి పెట్టుకొని వారి ప్రజలు గెలిపిస్తారు. గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోతుంది. బిజెపి మెట్లు ఎక్కే పార్టీ కాదు.. రాకెట్ వేగంతో దూసుకుపోయే పార్టీ. సామాన్యుడే కథానాయకుడు ఆ బాధ్యత నెత్తిమీద ఎత్తుకొని కేసీఆర్‌ని ఓడిస్తారు. ప్రజలు దుష్టులకు దూరంగా ఉండవలెను అని అనుకుంటున్నారు.. నేను బయటకి చెప్తే పెన్షన్ పోతుందేమో, రైతుబంధు కట్ చేస్తారేమో అని చూస్తున్నారు. ఇవన్నీ భరిస్తున్నారు. ఇంకొక మూడు నెలలు అయ్యాక నువ్వు చేసేది ఏమీ లేదు పొమ్మని చెప్తారు.. ఆ రోజు దగ్గర్లో ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు.