-ఖమ్మం, రామాయంపేట యువకుల ఆత్మహత్యలకు సీఎం, మంత్రి పువ్వాడ, టీఆర్ఎస్ నేతలే కారణం
-సీఎం, మంత్రులు బలుపెక్కి కండకావరంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు
-టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదు…
-కేసీఆర్ ఫాంహౌజ్ లో వాడే కరెంట్ తో 10 గ్రామాలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయొచ్చు
-కేసీఆర్ ను గద్దె దించేదాకా నా పోరు ఆగదు…
-ఆసుపత్రి, కాలేజీ కూడా కట్టించలేని దద్దమ్మ కేసీఆర్
-కేసీఆర్ చేతగానితనంవల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు
-ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్…
‘‘ఈ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ లకు బలుపెక్కి కండకావరంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ యువకుల చావుకు కారణమవుతున్నరు. ఖమ్మంలో మంత్రి అరాచకాలు, టీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు సాయి గణేష్ అనే బీజేపీ కార్యకర్తపై ఏకంగా 16 కేసులు పెట్టిండ్రు. రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని చూసిండ్రు. ఇయాళ మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన గంగం సంతోష్, అతని తల్లి స్థానిక మున్సిపల్ ఛైర్మన్ వేధింపులు భరించలేక చచ్చిపోతున్నామంటూ వీడియో పెట్టి లాడ్జిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నరు. ఈ రెండు చావులకు ముమ్మాటికీ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలదే’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, సీఎం అంతు చూసేదాకా బీజేపీ పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 3వ రోజు కంచుపాడు నుండి పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం వరకు తక్కశిల వరకు నడిచారు. సంజయ్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కదిలించిన సమస్యల ఏకరవు పెట్టారు. వారందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. తక్కశిల వద్ద గ్రామస్తులతో ‘ప్రజల గోస- బీజేపీ భరోసా‘ పేరిట రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…..
మోదీ వాక్సిన్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి.. ఈరోజు మనం మాస్కులు లేకుండా తిరగగలుగుతున్నామంటే మోదీ వల్లే..కేసీఆర్ వాక్సిన్ అంతా… తాగాలే..ఊగాలే..పండాలే.. ఈ ఊళ్లో బెల్టు షాపులున్నాయా? (15 బెల్టు షాపులున్నాయని అక్కడున్న వాళ్ల సమాధానం). వామ్మో… కేసీఆర్ అందరినీ తాగి ఊగిస్తున్నడా?
తెలంగాణలో అరాచకాలు ఎక్కవైనయ్… ఖమ్మంలో మంత్రికి, సీఎంకు బలుపెక్కి కండకావరమెక్కి సాయి గణేష్ బీజేపీ కార్యకర్తను మీద 16 కేసులు పెట్టిండు. అతను చేసిన పాపం ఏందంటే… సోషల్ మీడియాలో మంత్రి అక్రమాలు, ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించడమే…
పోలీసులు ఆ యువకుడిపై రౌడీషీట్ చేస్తామని బెదిరించే సరికి భయపడి సూసైడ్ చేసుకున్నడు. మంత్రి, పోలీసుల వేధింపులవల్ల చనిపోతున్నానని వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్నడు.
ఇది పోలీసులు, స్థానిక మంత్రి కలిసి చేసిన కుట్ర. ఈ సూసైడ్ కు వాళ్లే కారణం. సీఎం… బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అంతు చూసేదాకా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతాం. నిన్న గద్దె దిగే వరకు మా పోరాటం ఆగదు….
ఇప్పుడో ఇంకో సంఘటన… రామాయంపేట గంగం సంతోష్, ఆయన తల్లి పద్మతో కలిసి కామారెడ్డిలో లాడ్జిలో సూసైడ్ చేసుకున్నడు. టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నడు. ఈ ప్రాంతంలో బస్టాండ్ సరిగా లేదు. చదువుకోవడానికి కాలేజీ లేదు. ఆరోగ్య సమస్య వస్తే ఆసుపత్రి లేకపాయే… మరి యాడికి పోవాలి? తెలంగాణ సాధించుకుంది ఎందుకు?మన రాష్ట్రంలో ఆసుపత్రి కూడా కట్టలేని దద్దమ్మ కేసీఆర్. ఆయన చేతగానితనంవల్లే రోగమొస్తే పక్క రాష్ట్రానికి పోయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణ సాధించుకుంటే మీ కేసీఆర్ చేసిందేమిటని… పక్కనున్న రాష్ట్రం వాళ్లు ప్రశ్నిస్తున్నరు. మనం సిగ్గుపడాలి…
ఈ సీఎం మతి భ్రమించింది. అరాచకంగా వ్యవహరిస్తున్నరు. తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి.ఎవరి ఏది అడిగినా… మీ వద్దకు వస్తా… కుర్చీ ఏసుకుని కూర్చుని సమస్య పరిష్కరిస్తానని మాయ మాటలు చెప్పడం ఓట్లు దండుకుని మళ్లా పోయి ఫాంహౌజ్ లో పడుకుంటున్నడు…. అందుకే బీజేపీ కేసీఆర్ ను నిలదీస్తోంది.
ఫాంహౌజ్ నుండి ప్రగతి భవన్ కు, ధర్నా చౌక్ కు గుంజుకొచ్చినం..ఇప్పుడు కేసీఆర్ … బీజేపీని ఓడిస్తడట… మోదీని గద్దె దించుతడట… సిగ్గుండాలి. కేసీఆర్ ఏమీ పీకలేరు. కేసీఆర్ డబ్బుల సంచులు తీసుకుని పోయి పక్క రాష్రాల నేతలకు ఇచ్చినా ఎన్నికలకు ఆయనను పిలవలేదు. ఇక కేసీఆర్ మాట నమ్మేదెవరు? చెన్నయ్ పోయి గ్రామాల్లో అకాల వానలు, తెగులు పట్టి పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతుంటే ఏనాడూ నష్ట పరిహారం ఇవ్వని కేసీఆర్ … దేశంలో ఏదో ఉద్దరిస్తానంటూ పక్క రాష్ట్రాలు తిరుగుతూ డ్రామాలాడుతున్నడు.
రైతులు వరి వేయొద్దంటడు… కేంద్రం కొనడం లేదని చెప్పిన కేసీఆర్ ఆయన ఫాంహౌజ్ లో మాత్రం వరి పంట ఎందుకు వేసిండు. పండించిన ఆ వరి పంటను ఏం చేస్తడు?ఈ ప్రాంతంలో అన్నీ సమస్యలే… రోడ్ల సమస్య, ఇండ్ల సమస్య తీవ్రంగా ఉంది. కేసీఆర్ చేసిందేమిటి?
తెలంగాణకు 1.40 లక్షల ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం కేటాయించింది. పేదలకు ఇండ్లు కట్టివ్వాలని చెబితే… ఆ డబ్బును దారి మళ్లించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఆ ఇండ్లు పూర్తి చేస్తే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఇదంతా చేస్తున్నాడు. నేను సవాల్ విసిరిన… ఆ ఇండ్లను పూర్తి చేస్తే.. మరో లక్ష ఇండ్లు కేంద్రం ద్వారా మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పిన. కానీ సీఎం స్పందించడం లేదు.
దళితులకు మూడెకరాలు ఇస్తానన్నడు. ఆ పని చేస్తే ఇయాళ దళితులు కోటీశ్వరులు అయ్యేవాళ్లు. కానీ కేసీఆర్ ఇవ్వకుండా దళితులను మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగమిస్తానని యువకులకు ఆశచూపిండు. ఉద్యోగాలియ్యకుంటే నీ సంగతి చూస్తా… మిలియన్ మార్చ్ నిర్వహిస్తానని చెబితే భయపడి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైండు.
గ్రామ పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీ, రైతు వేదికలు, టాయిలెట్లు, బియ్యం, పల్లెప్రగతి, ప్రక్రుతి వనాలతోసహా అన్నీ అభివ్రుద్ధి పనులకూ నిధులిస్తోంది కేంద్రమే. కానీ టీఆర్ఎస్ చేస్తుందని అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుంటుండు.
ఇగ కరెంట్ బిల్లులు వచ్చేనెలలో షాక్ కొట్టబోతున్నయ్. ఫస్ట్ నాడు చేతికొచ్చే బిల్లును చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి. ఇప్పటికే రూ.60 వేల కోట్ల బకాయిలు డిస్కంలకు బాకీ.కేసీఆర్ ఫాంహౌజ్ లో అడ్డగోలుగా కరెంట్ వాడుకున్నడు. ఒక్క ఫాంహౌజ్ కు ఇచ్చే కరెంట్ వినియోగంతో 10 గ్రామాలకు ఫ్రీగా కరెంట్ సరఫరా చేయొచ్చు. టీఆర్ఎస్ నేతల ఫాంహౌజ్ ల్లో ఖర్చయ్యే కరెంట్ తో వందలాది గ్రామాలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయొచ్చు.
మాట్లాడితే పెట్రోలు ధరలు పెరుగుతున్నాయన్నడు… ఒక్కో లీటర్ పెట్రోలుపై రూ.33లు దొబ్బుకుతింటున్న సీఎం కేసీఆర్… కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటు. వ్యాట్ పేరుతో పెట్రోలు, డీజిల్ పై ఏటా వేల కోట్లు దోచుకుతింటున్నడు.కేసీఆర్ అక్రమాలు, అవినీతిపై బీజేపీ ఉద్యమిస్తుంటే… కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేస్తుండు. కేసులు పెడుతుండు. జైలుకు పంపుతుండు. అయినా బెదిరేది లేదు.. కేసీఆర్ అంతు చూస్తాం. గద్దె దించేదాకా పోరాడతాం…
ప్రజల సమస్యలు తెలుసుకుని రావాలని నరేంద్ర మోదీ చెబితేనే నేను ఇక్కడికి వచ్చిన. కేంద్రం పథకాలను వివరిస్తున్నా…మీరు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీసహా అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు. ఈసారి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.మోదీగారికి అవకాశమిచ్చారు. దేశంలో అభివ్రుద్ధి చేసి చూపిస్తున్నడు. తెలంగాణలోనూ అవకాశమిస్తే… అభివ్రుద్ధి చేసి చూపిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నా….