– జనం కేసీఆర్ ఇంట్లో పీజులు పీకేశారు
– 8 లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదా?
– కేసీఆర్ , ఆయన అల్లుడు నాగార్జున సాగర్ , శ్రీశైలం లో బండ కట్టుకుని దూకినా ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేస్తాం
– ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది
– కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు
– దేవరకొండలో జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాలకు 6 కోట్ల నిధులు ఇస్తా
– దేవరకొండ కు నర్సింగ్ కాలేజీ మంజూరు
– దేవరకొండ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీ లు, ఎంఎల్ ఏ లు,ఎంఎల్సీలు
దేవరకొండ: రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా మార్చి పదేళ్లు తెలంగాణ ను పట్టి పీడించిన నాయకుల గడీలను ఓటు అనే ఆయుధంతో కుప్పకూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ కి అడ్డా అని కార్యకర్తలు నిరూపించారు. నల్గొండ జిల్లాకు చైతన్యం ఉంది.. ఇక్కడి గాలికి, నీరు కు పోరాట పౌరుషం ఉంది. నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూమి కోసం ,భుక్తి కోసం,విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి తరిమికొట్టిన ప్రాంతం ఇది. సోనియా గాంధీ త్యాగం , అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితో తెలంగాణ రాస్ట్రానికి ఏర్పాటు చేసకున్నాం. ప్రజా పాలనతో సంక్షేమం, అభివ్రుద్ది ని రెండు కళ్లతో ముందుకు వెళ్తున్నాం.
10 యేళ్లలో పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. దేవరకొండలో నే 14 వేల రేషన్ కార్డులు మంజూరు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని బర్ల పెట్టే వారు. రేషన్ దుకాణం దగ్గరే అమ్ముకునే వారు. ప్రజా ప్రభుత్వంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలు సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు. పేదవాడికి న్యాయం జరగాలన్నదే ఇందిరమ్మ రాజ్యం ఆకాంక్ష.
దేశంలో నరేంద్ర మోదీ పాలిత గుజరాత్ తో సహా బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు. తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. 2004 నుంచి 14 వరకు వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. తెలంగాణ వస్తే డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఒకాయన నమ్మబలికాడు. డబుల్ బెడ్రూం ఇచ్చిన ఊరిలో మీరు ఓటు అడగాలి. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊర్లో మేం ఓటు అడుగుతామని ఎన్నికల సమయంలో సవాల్ విసిరాం. ఆ నాటి పాలకులకు పేదల పట్ల ఏ మాత్రం అభిమానం లేదు. 2000 కోట్లు ఖర్చు పెట్టి పదెకరాల లో 150 గదుల గడీని నిర్మించుకున్నాడు.
ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 22 వేల కోట్లతో రాష్ట్రం లో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉంటే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే వాళ్లం. చెంచులు,గిరిజనుల ఉన్న ప్రాంతంలో అదనంగా 25 వేల ఇళ్లు ఇచ్చాం. ఆదివాసీ,లంబాడీలు, గిరిజనులది ఈ ప్రభుత్వం. లంబాడీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. లంబాడీలను ఎస్టీల్లో చేర్చడానికి జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. 25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు 20 వేల కోట్ల రుణమాపీ చేశాం. వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించాం.
కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు. రైతు బంధు రాదని కేసీఆర్ అన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉచిత కరెంటు ఫైల్ పైన సంతకం చేశారు. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. రైతులకు కాదు కేసీఆర్ ఇంట్లో కరెంటు లేదు. జనం పీజులు పీకేశారు. కాని రాష్ట్రంలో రైతుల కు మాత్రం కరెంటు ఉంది. ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్ల ను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారు. మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ కు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. కొడుకు, బిడ్డ, అల్లుడు తెలంగాణ ను నాలుగు వైపుల నుంచి పీక్కు తిన్నారు. 8 లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం పోయింది. పార్లమెంటు లో గుండు సున్నా వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకలేదు.
జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోరబండ దగ్గర బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారు. కేసీఆర్ …నీ కొడుకే నీకు గుది బండ. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. మంచి పాలనలో ప్రజలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం, రేషన్ కార్డు ఇలా ఎన్నో సంక్షేమాలు వచ్చాయి. తెలంగాణలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్ ఎల్ బీసీ కోసం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ఎస్ ఎల్ బీసీ ను పగపట్టి , నల్గొండ ప్రజలపై కక్ష కట్టి పడావు పెట్టారు. ఎస్ ఎల్ బీసీ లో ప్రమాదవశాత్తు 8 మంది చనిపోతే మామ అల్లుళ్లు పైశాచిక ఆనందంతో డ్యాన్స్ లు చేశారు. కేసీఆర్ , ఆయన అల్లుడు నాగార్జున సాగర్ , శ్రీశైలం లో బండ కట్టుకుని దూకినా ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేస్తాం.
దేవరకొండ రైతుల కోసం డిండి ప్రాజెక్టు పూర్తి చేశాం. దేవర కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మా ప్రభుత్వానిదే. దేవరకొండలో జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాలకు 6 కోట్ల నిధులు ఇస్తా. వెంకటేశ్వరస్వామి టెంపుల్ ను పూర్తి చేసే బాధ్యత నాదే. దేవరకొండ కు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. రాబోయే 10 యేళ్లు అధికారంలో ఉంటాం.. దైర్యంగా ఉండాలి. అభివృద్ధి పథంలో నడిపిస్తాం.దేవరకొండ లో రోడ్ల నిర్మాణం పైన ద్రుష్టి సారిస్తాం.. ఈ నెలాఖరు లోపు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ , సీతక్క ను పంపిస్తా. మద్దిమడుగు లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తాం. పుణ్యక్షేత్రం గా మద్దిమడుగు ను అభివృద్ధి చేస్తాం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తాం. వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేశాం. గంజాయి నిర్మూలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేశాం. విద్య, వైద్యంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. దేశంలో నే తెలంగాణ మోడల్ ను ప్రకటించి నెంబర్ 1 గా నిలబెడతాం. గ్రామాల్లో సర్పంచ్ ను మంచి వాళ్లను ఎన్నుకోవాలి. తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణి చేస్తాం.