Suryaa.co.in

Telangana

కేసీఆర్ చేస్తున్న అభివృద్ధినే ..మరోసారి ఆయన్నుగెలిపిస్తుంది

– తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు
– వందకు పైగా సీట్లు తెచ్చిపెడుతుంది
– బిజెపి , కాంగ్రెస్ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు
– నేడు దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్‌ఎస్‌ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదు
– సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్‌ , ఏప్రిల్ 25: హైదరాబాద్ జిల్లాలో వాడవాడనా బీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ..ఇంతింతై వటుడింతై అన్నట్లు పదిమంది తో మొదలైన బిఆర్ఎస్ పార్టీ నేడు దేశ వ్యాప్తంగా వ్యాపించబడుతుంది. దీనికి ఉదాహరణే నిన్న ఔరంగాబాద్‌లో జరిగిన సభ. కేసీఆర్ హామీల గురించి , కేసీఆర్ ఏమాట్లాడతారో వినేందుకు లక్షల మంది సభకు హాజరై, బిఆర్ఎస్ పార్టీ కి మద్దతు పలికారు.

తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని, తెలంగాణలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నారని.. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు గర్వపడాలన్నారు. 22 ఏండ్ల క్రితం హైదరాబాద్‌ జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌గా పార్టీ ఆవిర్భవించిందని ..నేడు దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్‌ఎస్‌ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ నమ్మారని.. అర్ధబలం, అంగబలం లేకున్నా తెలంగాణ కోసం బయలుదేరారని శ్రవణ్ గుర్తు చేసారు.

దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందామని శ్రవణ్ గారు వెల్లడించారు. కేసీఆర్ చేసిన అభివృద్దే మరోసారి ఆయన్ను గెలిపిస్తుందని, వందకు పైగా సీట్లు సాదిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ మూడు సభలు పెడితే లక్షల మంది వచ్చారని గుర్తు చేసారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ నినదించారని తెలిపారు. రాబోయే ఏడు ,ఎనిమిది నెలల్లో యుద్ధం రాబోతుంది. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ , మరోపక్క భాజపా పార్టీలు మిడతల్లా మనపై దాడి చేస్తున్నాయి. సీబీఐ , ఈడీ , ఐటీ ఇలా అనేక రకాలుగా కేసులు పెట్టి మన నాయకత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తుంది. మనల్ని అయోమయానికి గురి చేస్తుంది. కానీ వారు ఎన్ని చేసిన కేసీఆర్ ముందు పప్పులు ఉడకవని శ్రవణ్ ఎద్దేవా చేసారు.

ఇక క్రియాశీలక కార్యకర్తల్లాగా , క్రియాశీలక నాయకులుగా మనం కేసీఆర్ కోసం పనిచేద్దాం..ఓ గంట పాటు కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి , అభివృద్ధి గురించి అలాగే కాంగ్రెస్ , బిజెపి చేస్తున్న మోసపూరిత హామీల గురించి , అబద్దాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బిజెపి కులం పేరుతో , మతం పేరుతో రాజకీయం చేస్తూ మనమధ్య విభేదాలు సృష్టించాలని చూస్తుంది. మైనారిటీల నుండి రద్దు చేసిన రిజర్వేషన్లను OBC లకు ఇస్తామని అమిత్ షా చెప్పడాన్ని డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎగతాళి చేశారు. ఇది కేవలం ముస్లిం రిజర్వేషన్లను విధ్వంసం చేయడానికి దారి మళ్లించే వ్యూహమని ఆయన అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి వెనుక ఉన్న హేతుబద్ధతను దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రిజర్వేషన్ల వల్లనే తరతరాలుగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని, కడు పేదరికంలో, నిర్లక్ష్యానికి గురవుతున్న ముస్లింలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ముస్లిం రిజర్వేషన్లు అని దాసోజు శ్రవణ్ అన్నారు. అలాంటి బిజెపి నుండి సమాజాన్ని కాపాడుకోవాలి..మన బిఆర్ఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికీ తప్పక న్యాయం జరుగుతుంది. గౌరవం దక్కుతుందని ఈ సందర్బంగా శ్రవణ్ గుర్తు చేసారు.

LEAVE A RESPONSE