Suryaa.co.in

Telangana

కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు

-బీసీ బంధు, మైనారిటీ బంధు ఇచ్చే వరకు బీఆరెస్ నాయకులు గ్రామాలకు రానివ్వకండి
-రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు,బీసీ బంధు మైనారిటీ బంధుకు ఎందుకు?
-కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు
-పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పడావు పడింది?
-కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం
-ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

కల్వకుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుంది.బీఆరెస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు… రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే.. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పడావు పడింది?కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా… ఈంప్రాంతానికి చేసిందేం లేదు.కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు.ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయిన్రు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం.

ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు. బీజేపీ, బీఆరెస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తున్నాయి. అయినా సరే…కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుంది. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు,బీసీ బంధు మైనారిటీ బంధుకు ఎందుకు?ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిస్తున్నా. దళితబందు, బీసీ బంధు, మైనారిటీ బంధు ఇచ్చే వరకు బీఆరెస్ నాయకులు గ్రామాలకు రానివ్వకండి. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే…

LEAVE A RESPONSE