-భగవంత్‌మాన్ ఆయనకు పైలెట్‌గా మారారు
-1న జైలుకు కేజ్రివాల్, 6న విదేశాలకు రాహుల్
-కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
పంజాబ్: పంజాబ్‌ను కేజ్రివాల్ అవినీతికి ఏటీఎంగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రివాల్‌కు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పైలెట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పంజాబ్‌ను డ్రగ్స్ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1వ కేజ్రివాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళతారని లూథియానా జరిగిన ప్రచార ర్యాలీలో వ్యాఖ్యానించారు.