Suryaa.co.in

Andhra Pradesh Crime News

గూడూరులో కిడ్నాప్ కలకలం..

-నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు

కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్‌ తీవ్ర కలకలం రేపింది. అయితే సినీఫక్కీలో కిడ్నాపర్లను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న దుకాణాలు అద్దెకు కావాలంటూ కారులో యజమాని వెంకటేష్ ను  తీసుకెళ్లారు. అయితే, వెంకటేష్‌ అక్కడ దుకాణం చూయిస్తుండగా దాడి చేసి కారులో తీసుకెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును పోలీసులు వెంబడించారు. పోలీసులను చూసి వాహనం స్పీడ్‌ను మరింత పెంచారు కిడ్నాపర్లు. దీంతో ఆ కారును పోలీసులు తమ వాహనంలో వెంబడించారు. చనుగొండ్ల ఎల్ఎల్సీ కాలువపై కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసుల వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో టైర్ బరస్ట్ కావడంతో వాహనం నుంచి దూకి ఇద్దరు కిడ్నాపర్లు తప్పించుకున్నారు.  కారులో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించారు. కిడ్నాప్ కు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.

LEAVE A RESPONSE