Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి లోకేష్ చేతులమీదుగా రేపు కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభం

  • ఉమ్మడి చిత్తూరులో యువగళం తొలి మైలురాయి హామీకి కార్యరూపం
  • అపోహలు వద్దు… ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతామని యువనేత స్పష్టీకరణ

అమరావతి: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా 3-2-2023న బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ… ఆనాడు శిలాఫలకం ఆవిష్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం బంగారుపాళ్యంలో రూ.3 కోట్ల వ్యయంతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 10మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించే అవకాశం ఉంది.

భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఈ యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ యూనిట్ ను శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా యువగళం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 కి.మీ. కి ఒకటి చొప్పున 5 మైలురాళ్ళను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. మిగిలిన హామీల అమలుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. హామీలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా యువగళం హామీల అమలుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.

LEAVE A RESPONSE