Suryaa.co.in

Andhra Pradesh

బాబు దొంగ మాటలు..రామోజీ దొంగ రాతలు

– దున్నపోతు ఈనిందని బాబు చెబితే.. రామోజీ దూడను కట్టేయడానికి వెళుతున్నాడు
– నిత్యావసర సరుకుల ధరలపై బాబు, రామోజీ కలిసి ఆడిన డ్రామా ఏంటో ఈనాడులోనే బట్టబయలైంది
– ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలను పూర్తిగా నిషేధిస్తూ వైయస్ఆర్సీపీ ఆదేశాలు
– జగన్ సంకల్పించిన ఈ మహాయజ్ఞాన్ని చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు అడ్డుకోలేరు
– బాబుకు జీవితకాలం టైం ఇస్తూ సవాల్ విసురుతున్నా… జగన్ని దించి బాబు కుర్చీ ఎక్కగలిగితే రాష్ట్రం వదిలిపెట్టిపోతాను.
– మరి దించలేకపోతే, బాబు హైదరాబాద్ లోనో, తన సొంత ఊర్లోనో ఉండిపోతాడా..?
– హైదరాబాద్ ఎయిర్ పోర్టు బాబు కట్టలేదని ఛాలెంజ్ చేస్తున్నా.. వైయస్ఆర్ సీఎం అయ్యాక కట్టారు
– హైదరాబాద్ ఎయిర్ పోర్టు, రింగురోడ్డు బాబు కట్టినట్టు నిరూపిస్తే.. నేను రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను.
– బాబు-రామోజీ చెప్పిన ధరల కన్నా హెరిటేజ్ లో, బహిరంగ మార్కెట్ లో ధరలు తక్కువ ఉన్నాయి
– పచ్చళ్ళు బయట రూ. 200 ఉంటే రామోజీ ప్రియా పచ్చళ్ళు రూ. 280 అమ్ముతున్నాడు
– సిమెంటు బయట రూ. 350 ఉంటే.. పేదల ఇళ్ళు, నాడు-నేడు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 230 మించి అమ్మటానికి వీల్లేదని నిబంధన పెట్టింది జగన్ గారే.
– బాబుకు బాకా ఊదుతున్న కుల ప్రతినిధులు, కుల పత్రికలు, కుల మీడియా ఎంత అరిచిగీపెట్టినా జగన్ ని ఏం చేయలేరు
– రూ. 10 కోట్లతో పెట్టిన హెరిటేజ్ రూ. 10 వేల కోట్లకు ఎలా వెళ్ళింది..?
– పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ప్రెస్ మీట్

చంద్రబాబు చెప్పే దొంగ మాటలను.. సిగ్గు, శరం లేకుండా ఈనాడు రామోజీరావు దొంగ రాతలు రాస్తూ, దాన్నే పట్టుకుని ఆ కుల పత్రికలు, కుల మీడయా, కుల ప్రతినిధులంతా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ గారిపైనా పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు చెబితే.. దూడను కట్టేయడానికి బయల్దేరినట్టుగా ఈనాడు రామోజీ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలపై చంద్రబాబు చెప్పాడని, ఈనాడు రెండు రోజులు రెండు రకాల ధరలను అచ్చేసి అడ్డంగా దొరికిపోయిందని, ఆ ధరలకు సంబంధించిన ఈనాడు ప్రచురించిన జనవరి 4, జనవరి 5 తేదీల పత్రికలను సాక్ష్యాలుగా చూపిస్తూ కొడాలి నాని వారి కుట్రలను మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. బాబు-రామోజీ చెప్పిన ధరల కన్నా హెరిటేజ్ లో, బహిరంగ మార్కెట్ లో కూడా ధరలు తక్కువ ఉన్నాయని హెరిటేజ్ బిల్లులు, ఇతర ఆధారాలతో సహా మీడియా ముందు ప్రదర్శించారు.

ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైన నిత్యం విషం చిమ్ముతూ, అబద్ధాలను, అసత్యాలను పోగేసి దుష్ప్రచారం చేస్తున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 ఛానళ్ళను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా బహిష్కరించాలని మంత్రి పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని

అభివృద్ధి-సంక్షేమాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పాన్నిగానీ, ఆ దిశగా సాగిస్తున్న మహాయజ్ఞాన్నిగానీ.. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు అడ్డుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. బాటిల్ పచ్చళ్ళు బయట రూ. 200 ఉంటే రామోజీ సంస్థలో ప్రియా పచ్చళ్ళ ధర రూ. 280 అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇలా, బాబు, రామోజీ సిగ్గు, శరం వదిలేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్ పరిపాలన 30 ఏళ్ళపాటు ఉంటుందని… అధికారంలోకి వస్తానని బాబు పగటి కలలు కంటున్నాడని మంత్రి కొడాలి నాని అన్నారు. “బాబుకు జీవితకాలం టైం ఇస్తూ సవాల్ విసురుతున్నా… జగన్ ని దించి బాబు కుర్చీ ఎక్కగలిగితే రాష్ట్రం వదిలిపెట్టిపోతాను ” అని అన్నారు. మరి దించలేకపోతే, బాబు హైదరాబాద్ లోనో, తన సొంత ఊర్లోనో ఉండిపోతాడా.. అని నిలదీశారు. అలానే పదే పదే హైదరాబాద్ నేనే కట్టానని అబద్ధాలు ప్రచారం చేస్తున్న బాబుకు మంత్రి కొడాలి నాని మరో సవాల్ విసిరారు. “హైదరాబాద్ ఎయిర్ పోర్టు బాబు కట్టలేదని ఛాలెంజ్ చేస్తున్నా.. వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఎయిర్ పోర్టు, రింగు రోడ్డు నిర్మించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు, రింగురోడ్డు బాబు కట్టినట్టు నిరూపిస్తే.. నేను రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను” అని అన్నారు. బాబుకు బాకా ఊదుతున్న కుల ప్రతినిధులు, కుల పత్రికలు, కుల మీడియా ఎంత అరిచిగీపెట్టినా జగన్ గారిని ఏం చేయలేరు అని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్, శని, దరిద్రం బాబేనని.. రాష్ట్రానికి పట్టిన అదృష్టం జగన్ అని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని, అందుకే ఉప ఎన్నిక నుంచి స్థానిక సంస్థల వరకు ఏ ఎన్నిక వచ్చినా జగన్ మోహన్ రెడ్డి గారికి అఖండమైన విజయాన్ని ఇచ్చి ఆదరిస్తున్నారని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

బాబు ఏది చెబితే.. అదే రాసేద్దాం
గత రెండు రోజులు నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు లిస్టులు ఇచ్చారు. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే’ సామెత పెద్దలు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో దున్నపోతు ఈనిందని చంద్రబాబు చెబితే… దూడను కట్టేయడానికి రామోజీరావు బయల్దేరి వెళుతున్నాడు. 40 ఏళ్ల నాడు పేపర్‌ పెట్టాం. మా పేపర్‌కు విశ్వసనీయత ఉంటుందన్న ఈనాడు దినపత్రికలో జనవరి 4వ తేదీన చంద్రబాబు నాయుడు చెప్పాడని కొన్ని నిత్యవసర వస్తువుల ధరలు ప్రకటించారు.

మొన్న ఒక రేటు… నిన్న ఒక రేటు
ఈనాడు పత్రికలో ప్రచురించిన ధరలుః
సరుకు (కిలో). 4వ తేదీ ధర. 5వ తేదీ ధర
పెసరపప్పు 144 110
కందిపప్పు 147 118
చింతపండు 275 354
వేరేశనగపప్పు 162 140
వేరుశనగనూనె 177 185

పెసరపప్పు కేజీ రూ.144 అని నాలుగో తేదీన వేశారు. 5వ తేదీన అదే పేపర్‌లో పెసరపప్పు రూ.110 అంటూ చంద్రబాబు చెప్పడాని రాస్తారు. కేజీ కందిపప్పు విషయానికి వస్తే 4వ తేదీన మార్కెట్‌లో రూ.147 ఉందని రాస్తారు. అదే రామోజీరావు 5వ తేదీన కందిపప్పు రూ.118 రేటు అని మళ్లీ వేస్తారు. చింతపండు రూ.275అని మొన్న, నిన్నటి పేపర్‌లో రూ.354 చేశారు. వేరుశెనగపప్పు రూ.162 అని మొన్న పేపర్‌లో రాసి, నిన్న రూ.140కి తీసుకువచ్చారు. అదేవిధంగా వేరుశెనగ నూనె రూ.177అని మొన్న పేపర్‌లో రాసి, నిన్న రూ.185 అని రాశారు. ఇవన్నీ ప్రచురించింది రామోజీరావు ఈనాడు పేపరులోనే. మొన్న ఒక రేటు. నిన్న ఒక రేటు. ఇదంతా చంద్రబాబు చెప్పారని రాస్తూ… ఇవన్నీ ప్రచురించింది ఈనాడు దినపత్రికలోనే. కనీసం అబద్ధాలు ఆడుతున్నప్పుడు నోటికి ఏది వస్తే అది బాబు చెబితే.. రాయటానికి ఈనాడు రామోజీకి అయినా సిగ్గు ఉండనక్కర్లేదా.. ? బాబు ఏది చెబితే మనం అది రాసేద్దాం అని సిగ్గులేకుండా రాసేస్తున్నారు. మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోకుండా, కనీస ఇంగితజ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు, రామోజీరావు కలిసి ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం.

రామోజీరావు ఈనాడు పేపర్‌లో నిన్న, మొన్న ప్రచురించిన నిత్యావసర వస్తువుల ధరలకు, రాష్ట్రంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో, కర్ణాటకలో తక్కువుంది, ఇక్కడ ఎక్కువ ఉందని చంద్రబాబు దొంగ మాటలు చెబితే… సిగ్గు,శరం లేకుండా రామోజీరావు దొంగ రాతలు రాస్తాడు.

హెరిటేజ్‌లోనే ఈ వస్తువులను కొని బిల్లులు తీసుకువచ్చాం. చంద్రబాబు, రామోజీరావు ఏ ధరలు అయితే ఈనాడు పత్రికలో ప్రచురించారో…ఆ రేటు కన్నా హెరిటేజ్‌లో తక్కువగా ఉంది. హెరిటేజ్‌లో కన్నా బహిరంగ మర్కెట్‌లో ఆ వస్తువుల ధరలు ఇంకా తక్కువగా ఉన్నాయి. అంటే కనీసం దుకణాల్లో వస్తువులు ఎంతకు అమ్ముతున్నారో కూడా తెలుసుకోకుండా పనికిమాలిన చంద్రబాబు చెప్పగానే ఈనాడులో ప్రచురించడం అంటే రామోజీరావు ఎంతగా దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

హెరిటేజ్‌లో ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ రూ. 137 ఉంటే, బయట మార్కెట్‌లో రూ.130 ఉంది. హెరిటేజ్‌లో రూ.7 ఎక్కువ తీసుకుంటున్నారు. అదే ఈనాడులో రూ.170 అని ప్రచురిస్తారు. అలాగే ఆశీర్వాద్‌ హెరిటేజ్‌లో రూ.59 ఉంటే, బయట మార్కెట్‌లో రూ.52 ఉంది. బయట ఆ ధర ఎక్కువ ఉందని ఈనాడులో తప్పుడు రాతలు రాస్తారు. అదేవిధంగా కేజీ పెసరపప్పు రూ.145 హెరిటేజ్‌ లో ఉంటే బయట మార్కెట్‌లో రూ.105 ఉంది. అదే చంద్రబాబు పెసరపప్పు ధర రూ.144 అని చెబుతాడు. దాన్ని రామోజీరావు ప్రింట్‌ చేస్తాడు.

పల్లీలు హెరిటేజ్‌లో రూ.175 ఉంటే, బయట మార్కెట్‌లో రూ.135 ఉంటే మీరు మాత్రం దాదాపు రూ.200 అని రాస్తారు. కందిపప్పు కేజీ రూ.124 హెరిటేజ్‌లో ఉంటే, బయట మార్కెట్‌లో వంద రూపాయలు. శెనగ గుళ్లు రూ.135 హెరిటేజ్‌లో ఉంటే, రూ. 110 మార్కెట్‌లో ఉంది. . గోధుమ పిండి మార్కెట్‌లో ముప్పై అయిదు నుంచి నలభై ఐదు రూపాయలు ఉంటే హెరిటేజ్‌లో రూ.70 ఉంది. దాన్ని పేపర్‌లో రూ.85 ఉందని రాస్తారు. పచ్చి శెనగపప్పు రూ.89 హెరిటేజ్‌లో, రూ.70 మార్కెట్‌లో ఉంటే పేపర్‌లో మాత్రం వందరూపాయలు ఉందంటారు. ఇవన్నీ దొంగ రాతలే. చంద్రబాబు నాయుడు అంటే సిగ్గు, శరం వదిలేసిన నాయకుడు అని ప్రజలు భావిస్తున్నారు. ఈనాడు కూడా అదే బాటలో పయనిస్తోంది. చంద్రబాబు ఏంచెబితే అది ప్రచురించడానికి రాష్ట్ర ప్రజల్ని ఏదోరకంగా మభ్యపెట్టి, మోసం చేసి ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి దొంగ ఆలోచనతో, అడ్డగోలు రాతలు రాస్తున్న రామోజీరావు పత్రికా విలువలను పూర్తిగా మరిచిపోయారు.

బ్లాక్ మార్కెట్ ను పెంచి పోషిస్తున్నది పాలు, పచ్చళ్ళు అమ్ముకునే ఆ ఇద్దరే
ఈనాడు రామోజీరావు నీతులు ఎలా ఉన్నాయంటే.. ప్రియా పచ్చళ్ల ధరలను చూసి తెలుసుకోవచ్చు. అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ప్రియా పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్మే టమోట పచ్చడి బాటిల్ ధర రూ.280 ఉంటే… అదే విజయవాడలో స్వగృహలోనో, స్థానికంగా దొరికే పచ్చళ్ళో కేజీ రూ.200 ఉంది. టమోటా నుంచి మామిడి వరకు ఏ ప్రియా పచ్చడి అయినా సరే కేజీ రూ.280 నుంచి రూ. 310 వరకు ఉంది. అలానే, హెరిటేజ్‌లో పాలు నుంచి పెరుగు వరకూ అన్నీ దొంగరేట్లే. 30 నుంచి 40 శాతం ఎక్కువ ధరలకు అమ్ముకునే వీళ్లు… పేద ప్రజలమీద మమకారం ఉన్నట్లు పైకి మాట్లాడుతున్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్న దొంగలే వీళ్లు. ఈ దొంగలే మళ్లీ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయాయి, వాటిని అరికట్టాలేకపోతున్నారని అంటారు. ఒకవేళ అరికడితే నువ్వెవడివి అరికట్టడానికి అని ప్రశ్నిస్తున్నారు.
పాలు అమ్ముకునేవాడు ఒకడు, పచ్చళ్లు అమ్ముకునేవాడు ఒకడు.. వీళ్లు ఇద్దరూ కలిసి బ్లాక్‌ మార్కెట్‌ను పెంచి పోషిస్తున్నారు. ఇదేదో జగన్‌ మోహన్‌ రెడ్డి పెంచి పోషిస్తున్నట్లు… రామోజీరావును రూ. 280కి పచ్చళ్లు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నట్లు, హెరిటేజ్‌లో జగన్‌గారే రేట్లు ఫిక్స్‌ చేసి ఎక్కువ ధరలకు అమ్మాలని చెప్పినట్లు.. వీళ్ళు ఇద్దరూ దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకరికి 70, మరొకరికి 80 ఏళ్లు వయసు వచ్చింది కానీ.. కనీస ఇంగిత జ్ఞానం అయినా ఉండాలి కదా?

సిమెంటు రూ. 230కి మించి అమ్మటానికి వీల్లేదని చెప్పింది జగన్ ..
సిమెంట్‌ ధరలు పెరిగాయంటారు..? 2లక్షల 70వేల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా, స్కూళ్లను, ఆస్పత్రులను ఆధునీకరణ చేయడానికి, సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి, ప్రజల అవసరాలకు దేనికైనా కూడా సిమెంట్‌ ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడి బయట మార్కెట్‌లో బస్తా సిమెంట్‌ ధర రూ.350 ఉంటే, దానిని రూ.230కి మించి అమ్మడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనకు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉన్నా, మిగతా సిమెంట్‌ ఫ్యాక్టరీలకు కూడా రూ.230 కన్నా ఎక్కువగా అమ్మడానికి వీల్లేదని నిబంధనలు పెట్టి 2లక్షల 70వేల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను పేదవారికి, ప్రజల కోసం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే. అలాంటి సీఎం గురించి మాట్లాడే స్థాయి, నైతిక అర్హత చంద్రబాబు, రామోజీరావుకి ఉందా అని అడుగుతున్నాం. మీరు ప్రజలను దోచుకునే వ్యక్తులు.

మరోవైపు పండించే పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు బాధపడుతుంటే… షాపులకు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నామని, పేదవాళ్లు ఒకపూట తింటే మరోపూట పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని సామాన్య ప్రజలు అంటున్నారు. ఇందుకు కారణం.. చంద్రబాబు, రామోజీరావులు దళారులుగా తయారై, రైతు దగ్గర నుంచి తక్కువకు కొని, వియోగదారుడికి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా వేల, లక్షల కోట్లు లూటీ చేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళే లూటీ చేస్తూ.. పైకి శ్రీరంగనీతులు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడే అబద్ధాలను సిగ్గులేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురిస్తే, ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ చానల్స్‌ ప్రసారం చేస్తాయి. కనీసం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడా? వాస్తవాలు చెబుతున్నాడా అని తెలుసుకునే ఇంగితజ్ఞానం ఈ పత్రికలు, టీవీలకు లేకుండా పోయింది.

ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతిలను పూర్తిగా నిషేధిస్తున్నాం
ఈరోజు నుంచి మంత్రులు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ కార్యాలయాల్లో గానీ, వారు పాల్గొన్న కార్యక్రమాల్లో గానీ ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. వాళ్లతో మాట్లాడటం కానీ, వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, మీడియా సమావేశాలకు పిలవవద్దని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిన్న, మొన్న, ఇవాళ కుప్పంలో రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నాడు. జగన్‌ని బలంగా ఢీకొట్టాలని చెబుతాడు. మరోవైపు “మీ తండ్రి రాజశేఖర్‌ రెడ్డి నన్ను ఏం చేయలేకపోయారు. ఆయన్నే నేను అల్లాడించేశాను. జగన్‌ మోహన్‌ రెడ్డి అరాచక పాలన చేస్తున్నారంటూ” నోటికి ఎంతవస్తే అంత అవాకులు, చెవాకులు పేలుతున్నాడు.

తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలంగా చేసుకోవాలంటే.. ఎవడో ఎక్కడో ఓడిపోతే, వాడిని పీకుతానని బాబు అంటున్నాడు. మరి కుప్పంలో పంచాయతీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన నిన్నే ముందుగా పక్కకు తీసి పడేయాలి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏ టూ జెడ్‌ ఓడిపోయిన పనికిమాలిన నాయకుడు చంద్రబాబే. అటువంటి అసమర్థుడైన చంద్రబాబు లాంటి వ్యక్తి నడిపే పార్టీ టీడీపీ. మరి పార్టీలో అలాంటి వారు కాకుండా ఎవరు ఉంటాడు?

30 ఏళ్ళపాటు జగన్ పరిపాలన
రాష్ట్రంలో జగన్‌ గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ ప్రజల కష్టసుఖాల్లో ఒక అన్నలా, ఒక తమ్ముడులా, ఒక కుటుంబసభ్యుడిగా ఉంటూ రాష్ట్రంలో ప్రతివ్యక్తి ఆర్థికంగా బాగుండాలనే యోచనతో అడుగులు ముందుకు వేస్తున్న ముఖ్యమంత్రి. ఇలాంటి రామోజీరావులు – డ్రామోజీరావులు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు, టీవీ5 బీఆర్‌ నాయుడులు, చంద్రబాబులాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంకల్పాన్ని, ఆయన నిర్ణయించుకున్న, తలపెట్టిన అభివృద్ధి- సంక్షేమాంధ్రప్రదేశ్ అనే మహాయజ్ఞాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జగన్‌పాలన ఈ రాష్ట్రంలో 30 ఏళ్లు ఉంటుంది.

అధికారంలోకి వస్తాం.. లెక్కలు రాసుకుంటున్నామంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు. 2024లో అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తానంటున్నాడు. బాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నా. జగన్‌ మోహన్‌ రెడ్డిని అధికారం నుంచి దించి, మీరు కుర్చీలో కూర్చోగలిగితే, నేను ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతా. అదే చేయలేకపోతే, మీరు హైదరాబాద్‌లోనో, లేక మీ సొంతూరులోనూ శాశ్వతంగా ఉండిపోతారా..?

చంద్రబాబుకు ఛాలెంజ్
హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు తానే వేశానని, శంషాబాద్‌ విమానాశ్రయం తానే కట్టానని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నాడు. నేను చంద్రబాబుకు ఛాలెంజ్‌ విసురుతున్నా.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మీరు కట్టలేదు. వైయస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ విమానాశ్రయానికి సోనియాగాంధీ, ఆయన కలిసి శంకుస్థాపన చేశారు. ఆ విమానాశ్రయంతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కు వేసిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు శంకుస్థాపన చేస్తే.. రోశయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. ఇందులో కూడా బాబు ప్రమేయం ఏమీ లేదు. అయనా వాటిని తానే కట్టినట్లు పదేపదే చెబుతుంటాడు. ఎయిర్‌పోర్టుకానీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకానీ మీరే కట్టానని నిరూపిస్తే… నేను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా.

ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ బాబు.. అదృష్టం జగన్
సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఎవరో చేసిన దానిని తాను చేశానని, ఎంగిలి మెతుకులకు ఆశపడటానికి సిగ్గు లేదా..? అని అడుగుతున్నాం. చంద్రబాబు డ్రామాలు, అబద్ధాలు అన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు డ్రామాలు చూసి, మాడు పగులగొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. బాబు ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్, శని, దరిద్రుడు అని చెప్పి ప్రజలు పక్కన పెట్టినా.. మీకున్న కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియా, కుల ప్రతినిధులతో కలిసి జగన్ పైన నిత్యం విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు.

పొద్దున లేచిన దగ్గర నుంచీ రోజూ చంద్రబాబుకు బాకా ఊదుతున్న కుల పత్రికలు, కుల మీడియా, కుల ప్రతినిధులే.. ఈ రాష్ట్రానికి పట్టిన శని, జగన్ మోహన్ రెడ్డిగారు ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం.
గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడుగానీ, రాష్ట్ర విభజన తర్వాతగానీ, కనీసం రాజధాని లేకుండా, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి రాష్ట్రం రావడానికి కారణం చంద్రబాబు పాలన కాదా..?

బాబు పోటుగాడు, నీటుగాడు అని ఊదరకొట్టినా జనం నమ్మరు
చంద్రబాబు పోటు గాడు.. చంద్రబాబు నీటు గాడు.. తోపు గాడు అని ఆయనకు బాకా ఊదే మీడియాలో ఎన్నిసార్లు చెప్పుకున్నా.. చివరికి కంఠశోషే అవుతుంది తప్పితే బాబును జనం నమ్మరుగాక నమ్మరు అన్నది ఇప్పటికైనా వారు గుర్తెరగాలి.

ఇటువంటి ప్రచారాలు ఎన్ని చేసినా.. మళ్ళీ 2024 ఎన్నికలలో చంద్రబాబు చిన్న మెదడు చితికేటట్టు ప్రజలు మాడు పగులగొడతారు. కనీసం ఇప్పటికైనా 80 ఏళ్ళ వయసు వచ్చిన రామోజీ బుద్ధి తెచ్చుకుని, చంద్రబాబు ట్రాప్ లో పడకుండా, మీడియా విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని హితవు పలుకుతున్నాను. చంద్రబాబుది, మీది ఒకటే సామాజికవర్గం అని, బాబే దేవుడు అని, ఇక్కడే జనాన్ని పీక్కు తినాలనుకుంటే.. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రజలు చావు దెబ్బ కొడుతూనే ఉంటారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు.

తమిళనాడు ప్రతిపక్షాన్ని చూసైనా నేర్చుకోవాలి
తమిళనాడులో ఉన్న ప్రతిపక్ష నాయకులను చూసి అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రతిపక్ష నాయకులు అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా గౌరవిస్తున్నారు, అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో బాబు తెలుసుకోవాలి. కుప్పంను వదిలి.. తమిళనాడు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.

ఇదే చంద్రబాబు నాయుడు 2004-09 వరకు రాజశేఖరరెడ్డి పరిపాలనపైనా చాలా ఆరోపణలు చేశాడు. జలయజ్ఞం- ధనయజ్ఞం అని మాట్లాడారు. ఆ తర్వాత కమ్యూనిస్టులతో కూటమి పెడితే.. బాబుతో పాటు మిగతా అన్ని పార్టీలకూ ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పది మందిని పోగేసి.. నాలుగు పార్టీలతో జత కట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే.. చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా ప్రజలు మాడు పగలగొట్టడానికి సిద్ధం గా ఉన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కనీసం పోటీ చేయకుండా పారిపోయే పరిస్థితి. ఉప ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు అంతా వన్ సైడ్ విక్టరీ. ఆఖరికి కుప్పంలో కూడా బాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. దాంతో ఇప్పుడు హడావుడిగా చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు కుప్పం అందుకే వెళ్ళాడు. మొన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే కదా..

చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయింది
చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రచారం చేయడానికి కుల మీడియా ఉంది. అదే ప్రపంచం అన్నట్టుగా వారు బతుకుతున్నారు, వారివి అన్నీ పగటి కలలే, 2024లో తీర్పు ఎలా ఉంటుందో మీరే చూస్తారు. టీడీపీకి చంద్రబాబే శని, అది విరగడ అయితేనే కొంత బెటర్ గా ఉంటుందేమో..

చంద్రబాబే ఉంటే.. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో.. ఏపీలోనూ అదే పరిస్థితి పడుతుంది. చంద్రబాబుకు మించిన వేస్ట్ నాయకుడు మరొకడు లేడు. ఈరోజు కూడా కుప్పం వెళ్ళి వెయ్యి, రెండు వేలకు ప్రజలు అమ్ముడుపోయారు అని మాట్లాడుతున్నాడు. ప్రజలు అమ్ముడు పోలేదని తెలిసినా.. అలా మాట్లాడటం వల్ల, ప్రజలపై నిందలు మోపడం వల్ల 2024లో కూడా మరోసారి మాడుపగులగొడతారు.

చంద్రబాబు రౌడీయిజం చేయడం అంటే.. గుక్క పెట్టి ఏడవటం కాదు. మామకు వెన్నుపోటు పొడిచి.. అధికారాన్ని, పార్టీని లాక్కోవడం, దొంగలించడం అసలే కాదు. భార్యను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేయడం కాదు. చంద్రబాబు వెయ్యి జన్మలెత్తినా పులి కాలేడు. అందితే కాళ్ళు.. అందకపోతే జుట్టు పట్టుకునే రకం. ఆయనో అసమర్థుడు.

ఇప్పుడిప్పుడే జగన్ గురించి తెలుసుకుంటున్నారు
రాం గోపాల్ వర్మకు కొడాలి నాని తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందని, ఆ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు. నేను తెలియాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అప్పుడు కచ్చితంగా తెలుసుకుంటారు.

ఒకవైపు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు అని రైతులు ఇబ్బంది పడుతుంటే.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతగా ముందుకు వచ్చి రూ. 5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకుంటుంది. మరోవైపు వినియోగదారుడు పెరిగిన నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ దళారులు, అడ్డగోలుగా పెంచుతున్న ధరలపై ముఖ్యమంత్రికి సాక్ష్యాధారాలతో సహా ఇస్తాను. అలానే హెరిటేజ్ ఉత్పత్తులు, ప్రియా పచ్చళ్ళు రేట్లు ఎలా ఉన్నాయో కూడా బిల్లులతో సహా ఇస్తున్నాను. బయట మార్కెట్ లో పచ్చళ్ళు బాటిల్ రూ. 200 ఉంటే.. ప్రియా పచ్చళ్ళు రూ. 280 అమ్ముతున్నారు. అదే హెరిటేజ్ రూ. 10 కోట్లతో ప్రారంభించి ఈరోజు రూ. 10 వేల కోట్లకు చేరింది. వీళ్ళకు ఇన్ని వేల, లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఈ దళారీ వ్యవస్థమీద ఒక కన్ను వేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు ఎలా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

LEAVE A RESPONSE