Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు కొడాలి నాని పది రోజులు డెడ్ లైన్

– నిరూపించలేకపోతే చంద్రబాబు పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి సిద్ధమా..?
– బాబు హయాంలో నియోజకవర్గానికో క్లబ్.. లోకేష్ ద్వారా కోట్ల రూపాయలు వసూళ్ళు చేసింది వాస్తవం కాదా..?
– అమ్మాయిల పిచ్చోడని ఎన్టీఆర్ పైనే ముద్ర వేసిన బాబుకి మిగతావారు ఒక లెక్కా..?
– హెరిటేజ్ ఫ్రెష్ లపై నేను ఆరోపణలు చేసి, కమిటీ పంపిస్తే నిజనిర్థారణకు బాబు అనుమతిస్తాడా..?
– కులమీడియాలో అబద్ధపు రాతలు రాసుకుని, మీరే కమిటీలు వేసుకుని ఏం నిజ నిర్థారణ చేస్తారు?
– మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
గుడివాడలో కేసినోలు, జూదాలు జరిగాయని చంద్రబాబు కుల మీడియాలో అబద్ధపు వార్తలు రాస్తే… దానిపై నిజనిర్థారణ కమిటీ వేసి, బోండా ఉమాను పంపిస్తే.. అక్కడి ప్రజలే తిరగబడి వారికి ఏ శాస్తి చేశారో అనుభవపూర్వకంగా చూశారు. నా కళ్యాణ మండపంలో కేసినోలు జరిగాయని ఆరోపణలు చేసింది బాబు కుల మీడియా, కమిటీ వేసింది చంద్రబాబు. బోండా ఉమాకు ఏం సంబంధం.. మా కులానికి, మా కుల మీడియాకు వ్యతిరేకంగా చంద్రబాబును కాదని, జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్నానని వీళ్ళంతా ఏకమై నా మీద నిందలు వేస్తున్నారు.

ఎక్కడో తీసిన విజువల్స్, ఫోటోలను తీసుకొచ్చి నా కళ్యాణ మండపంలో జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను చేసిన సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.. నా కళ్యాణ మండపంలో అటువంటివి జరగలేదు.. జరిగాయని నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను… నిరూపించలేకపోతే చంద్రబాబు పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారా…?

చంద్రబాబు నిర్ణయం కోసం నేను పది రోజులు వెయిట్ చేస్తా.. అప్పటిలోపల చంద్రబాబు నిరూపించలేకపోతే, అక్కడ ఎటువంటి కేసినోలు జరగలేదని చంద్రబాబు అంగీకరించినట్టే. నా కళ్యాణ మండపంలో అటువంటివి జరగలేదని నేనే నిరూపిస్తా. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ను నేనే మీడియాకు విడుదల చేస్తాను. చంద్రబాబు, ఆయన కుల మీడియా నాపైన ఎన్ని కుట్రలు చేసినా.. ఏం చేయలేరు.

చేతనైతే ఆరోపణలు చేసిన చంద్రబాబు నిరూపించాలి. లేకపోతే.. అబద్ధాలు ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయన కుల మీడియా క్షమాపణలు చెప్పాలి. సంక్రాంతి నాడే కాదు, చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా ఈరోజుల్లో చాలా మంది సినిమా హీరోల పాటలు పెట్టుకుని, రికార్డింగ్ డ్యాన్సులు వేయిస్తున్నారు. టీడీపీ మీటింగుల్లో కూడా చంద్రబాబు పాటలు పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారు. మరి వాటన్నింటినీ చంద్రబాబు ఆపేయిస్తాడా, అడ్డుకుంటాడా..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆయన ఎన్ని బ్రోకర్ పనులు అయినా చేయవచ్చు. వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ములను కొల్లగొట్టవచ్చు. ఆడవాళ్ళను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ బతికుండగానే, ఆయన అమ్మాయిల పిచ్చోడు అని ఆయనపై లేనిపోని నిందలు మోపి, ఆయన పార్టీని, అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు… ఈరోజు గుడివాడలో పుట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద, గుడివాడ మీద ప్రేమ కార్చేస్తున్నారు. మహానుభావుడు అయితే, ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు ఎందుకు దొంగలించాడు, ఎందుకు అంతటి మహానుభావుడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..? అందుకే, పుట్టకతోనే 420 చంద్రబాబు అని అంటున్నాం. చంద్రబాబు కుటిల రాజకీయాలకు మోస పోవడానికి ఇక్కడ ఎన్టీఆర్ లు ఎవరూ లేరు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో క్లబ్ లు నడిపిన వ్యక్తి. ఆ క్లబ్బులను ఎమ్మెల్యేలకు అప్పగించి, తన కొడుకు లోకేష్ ద్వారా డబ్బులు వసూలు చేసి బతికిన వ్యక్తి చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. క్లబ్ లన్నింటినీ మూసేశారు. అటువంటి చంద్రబాబు, ఆయన తాబేదారులు, ఆయన కుల మీడియా కేసినోల గురించి, జూదాల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోయి ఇక్కడకు పారిపోయి వచ్చిన దొంగ బాబే. అటువంటి పనులు ఆయన తప్ప మరెవరూ చేయరు.

గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పేకాట శిబిరాలు, వ్యభిచార వృత్తులు నడిపే వేల కోట్లు సంపాదించాడు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ ఫ్రెష్ ల్లో వ్యభిచారం జరుగుతుందని నేను ఆరోపిస్తే.. పది మందితో నేను ఒక నిజ నిర్థారణ కమిటీ వేస్తే, హెరిటేజ్ ఫ్రెష్ లలో ఏం జరుగుతుందో చంద్రబాబు చూపిస్తాడా…?, హెరిటేజ్ ఫ్రెష్ లలో తిరగేందుకు అనుమతించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడా…?
ఎవరింట్లోకి వచ్చి నిర్థారణ చేస్తారు. మీ కుల మీడియాలో మీరే అడ్డగోలు రాతలు రాసుకుని, మీరే కమిటీలు వేసుకుని, మీరే వచ్చి నిజ నిర్థారణ చేస్తారా.. ? బోండా ఉమ, వర్ల రామయ్యలకు ఏం హక్కు ఉంది..?

LEAVE A RESPONSE