-యువనేత డాక్టర్ కోడెల శివరాం హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సమయంలో మంజూరైన అభివృద్ధి పనులను రాజకీయ కక్ష సాధింపు చేస్తూ నిలుపుదల చేసి అభివృద్ధిని మరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం హెచ్చరించారు.నియోజకవర్గంలోని ముప్పాల మండలం చాగంటి వారి పాలెం గ్రామంలో యువ నేత డాక్టర్ కోడెల శివరాం మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలతో, పార్టీ నాయకులతో యువనేత శివరాం సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను గూర్చి యువనేత డాక్టర్ కోడెల శివరాం దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభాపతిగా ఉన్న సమయంలో చాగంటి వారి పాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాక నిధులను కూడా మంజూరు చేయించారన్నారు .
కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి కోడెల గారి హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో నిలుపుదల చేయడం హేయమైన చర్య అని కోడెల శివరాం ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు దీనిపై దృష్టి సారించి కళ్యాణ మండప నిర్మాణం పనులు త్వరితగతను పూర్తి చేయాలని లేకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు .అదేవిధంగా నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి పనులు మధ్యలో నిలుపుదల చేయడం రాజకీయ కక్ష సాధింపుకు నిదర్శనమని కోడెల శివరాం ఎద్దేవా చేశారు.
రాబోయే రోజుల్లో ప్రజలంతా ఓటు హక్కుతో అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడం ఖాయమని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం కూడా అంతే సత్యమని కోడెల శివరాం అన్నారు.కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి, ముప్పాళ్ళ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.