కొండా లక్ష్మణ్ బాపూజీ..
ఎగసి పడే కెరటం..
నిలువెల్లా మండే అగ్నిశిఖ..
కారుచీకట్లో వెలుగురేఖ..
తెలుగుతల్లి సిగలో ఎప్పటికీ
వసివాడని పువ్వు…!
పదవులు తృణప్రాయమై..
పోరాటాలే ప్రియమై..
అక్రమాలు హేయమై..
నిజాములపై
తిరగబడ్డ తెలుగుబిడ్డ..
తెల్లోడినీ ఎదిరించిన ఆవేశం
రాజీ పడొద్దన్న అంతరంగం..
ఎప్పటికప్పుడు
ప్రదర్శించింది వీరంగం..!
న్యాయవాదం వృత్తి..
నమ్మిన సిద్ధాంతాలపై
పిడివాదమే ప్రవృత్తి…
ఉద్యమమే మాధ్యమమై
సాగిన జీవితం..
తొమ్మిది దశాబ్దాల పొద్దు
ప్రజాసేవకే అంకితం..!
చెదరని దృక్పథం..
బెదరని నైజం..
పోరాటమే ఇజం..
అదిరిపడలేదా నైజాం..!
(సురేష్..7995666286
9948546286)