– ప్రశ్నించిన వారిని నిర్బంధించడమేనా ఇందిరమ్మ పాలనా..?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కొణతం దిలీప్ అరెస్ట్ దుర్మార్గమని మాజి మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిని అణిచివేయడం ప్రజా పాలనా అంటూ ఆయన నిలదీశారు. విచారణ పేరు మీద పిలిచి అక్రమంగా అరెస్టు చేయడం హేయనీయమైన చర్య అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొనతం దిలీప్ తెలంగాణ ఉద్యమ కారుడని,ఉద్యమ కారులకు కేసులు,అరెస్టులు కొత్త కాదు అని గుర్తు చేశారు. ప్రభుత్వ అక్రమ నిర్బంధాల తీరును ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.