Suryaa.co.in

Political News

కూసాలు తెగిపోవాలి

భారత్ తో వెయ్యేళ్ళు యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ దేశాన్ని రెండు ముక్కలుగా విభజన చేసి బంగ్లాదేశ్ ఆవిర్భావం గావించిన , దేశం లో నే కాకుండా ప్రపంచ వ్యాపితంగా దుర్గామాతగా వెలిగిపోయిన ఇందిరా గాంధీ గొప్ప నాయకురాలా? లేక అన్ని వ్యవస్థలను గుప్పిటలో పెట్టుకొని, మాతృ దేశ ప్రజలను ప్రాంతాల వారిగా, మతాల వారీగా, కులాల వారిగా, వర్గాల వారీగా విభజన చేస్తున్న నరేంద్ర మోడీ గొప్ప నాయకుడా?

సరే ! ఇక ఆనాడు అంతటి శక్తవంతమైన , మహా నాయకురా లైన ఇందిరను ఢీ కొట్టి ..దారికి తెచ్చిన వ్యక్తి ఎవరో తెలుసునా ? అపుడు ఆయన వయసు ఎంతో తెలుసునా ? అసలు ఆయనది ఏ రాష్ట్ర మో తెలుసునా ? 1974 _ 75 సం. ల లో గుజరాత్ లో విద్యార్ధులు రేపిన ‘ గుజరాత్ నవ ని ర్మాన్ ‘ ఆందోళన లో పాలు పంచుకొని అవినీతి ,ఆశ్రిత పక్ష పాతా లతో పరి పాలిస్తున్న చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరుపమంటూ, 78 సం. ల వయసులో మొరార్జీ దేశాయి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు.

దీంతో విద్యార్థుల ఆందోళన ఆలంకాలంకై గుజరాత్ రాష్ట్రాన్ని చుట్టు ముట్టట మే కాకుండా.. ఉ త్త రాదీ రాష్ట్రాలైన యూ పి ,బీహార్ ల కు శర వేగంగా విస్తరించటం తో ఇందిర అప్రమత్తమై ,దారి లేక దిగి వచ్చి గుజరాత్ లో ప్రభుత్వాన్ని మార్చి , 75 లో రద్దు చేసి జూన్ లో ఎన్నికలు నిర్వహించింది . అయిదు పార్టీలు కలిసి చేసిన సంయుక్త పోరాటం విజయ భేరి మ్రోగిం చింది . ఇందిర కాంగ్రెస్ కు నూకలు చెల్లి పోయాయి .. సమయం ,సందర్భం చూసుకొని దెబ్బ కొట్టాడు …ఎవరు ? 78 సం. ల మొరార్జీ దేశాయి!

రాజకీయ ప్రతిఘటన అంటే అది ! ఢీ కొట్టిన తీరు అంటే అది !! ..అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని గౌర వించిన ఇందిర విజ్ఞతను ఎవరూ విస్మరిం చ రాదు ! అయితే అదే నెలలో రాజ నారాయణ్ వేసిన ఎన్నికల దావాలో , ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం తో , ఇందిర దేశం లో ఎమర్జెన్సీ ని ప్రకటించి జయ ప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయి, వాజ్ పాయ్ ,అద్వానీ , జార్జిఫెర్ నాండే జ్ లాంటి మహాను భావు లను ,ప్రజాస్వామిక వాదు లను దేశ వ్యాపితంగా జైళ్లలో కుక్కటం తో రాజ కీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.

ఇకపోతే ప్రస్తుత ఢిల్లీ పాలకుడు పవన్ కళ్యాణ్ లాంటి వారిని అడ్డం పెట్టుకున్నా ,ఆంధ్ర రాష్ట్రంలో నేరుగా బిజేపికి పట్టు దొరకక పోవటంతో , చంద్రబాబును పిలిపించుకొని చేసిన సీట్ల బేరం ఫలించక పోవటంతో భంగపాటుకు గురై, ఇక బాబుకు చెరసాల బ్రతుకు చూపిస్తే గానీ దారికి రాడన్న దుర్బ్రమతో, తన చేతికి మట్టి అంటకుండా ,కేసుల భయం తో మెడలు వంచేసుకున్న ఆంధ్ర కీలు బొమ్మ ముఖ్య మంత్రితో, తప్పుడు కేసులు పెట్టించి బాబును బొక్కలో వేయించాడు . రాజకీయాల్లో హత్యలు వుండవు …ఆత్మహత్యలే !

ఇక కధ ఇక్కడ నుంచే మొదలవుతాంది …మొదలయింది! ఎమర్జన్సీని ప్రకటించి తన పతనం తానే తెచ్చు కున్న ఇందిరలా, బాబును అరెస్ట్ చేయించి మోడీ తన పతనం తానే తెచ్చు కుండ టమే కాకుండా, తెలుగు రాష్ట్రాల కీలు బొమ్మ, దోపిడీ ముఖ్య మంత్రుల పతనానానికి శ్రీకారం చుట్టాడు శ్రీమాన్ మోడీ మహారాజ్ ! జై భారత్ .! జై జై భారత్ ! ! India …i.e .,Bharath !!

భారత్ ప్రజలు ఇంతవరకు దేశ స్వాతంత్య్రం కోసం ,భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ,అవినీతి ప్రభుత్వాల రద్దు కోసం రోడ్లు ఎక్కి అనేక సార్లు ఆందోళనలు చేపట్టారు. కానీ ఒక అభ్యుదయవాది, దార్శనికుడు, నిరంతర ప్రగతి కాముకుడైన ఓ వ్యక్తి కోసం ఆయన స్వంత రాష్ట్రంలో కాకుండా, ఇతర రాష్ట్రాలలో, ఖండ ఖండాంతర దేశాలలో రోడ్లు ఎక్కి నిరసన ప్రదర్శనలు చేయటం చరిత్రలో ఇదే ప్రథమం !

ఔ రౌ రా ….భారత్ లో ఇదేమి విలువల పతనం అంటూ పాకిస్తాన్ లోనే కాదు …ప్రపంచ వ్యాపితంగా రాజకీయ విశ్లేషణలు జరుగు తూండటం తో మోడీ పటాలం లో భయం గంటలు గణ గణ మ్రోగుతున్నయి. ఇక సమయం, సందర్భంలను చంద్రబాబు వదులుకోరాదు. బెయిల్ వచ్చినా… రాక పోయినా, చావోరేవ, విజయమో వీర స్వర్గమో ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి!

జగన్ నే కాదు ….నిన్న గాక మొన్న తెలంగాణ వచ్చి చౌక బారు ప్రసంగాలు చేసిన మోడీ నే ఢీ కొట్టాలి. 78 సం. ల లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ,81 సం ల లో ప్రధాన మంత్రి అయిన మొరార్జీలా ఇందిరను ఇంటికి పంపిన తీరులో, చంద్ర బాబు మోడీ ని సాగ నంపాలి .మోడీ ,జగన్ , కే సీ ఆర్ ల కూసాలు మూల మట్టానికి తెగి పోవాలి!

దాగుడుమూతల రాజకీయాలకు పోతే బాబు , టిడీపీలు దండకారణ్యంకు పోవటమే కాదు… ఆంధ్రావనికే అంధకారం తెచ్చి పెట్టడమే కాగలదు. కావున అసలు ఆంధ్రావనిలోని సకల ప్రజాస్వామిక, ప్రగతి శీలురంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలి ! జాగ్రత్త !!

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ 

LEAVE A RESPONSE