Suryaa.co.in

Andhra Pradesh

నేడు కోటప్పకొండ త్రికోటేశ్వరునికి ఆరుద్రోత్సవం…

మహిమాన్విత క్షేత్రం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామికి ఈరోజు రాత్రి 12 గంటలకు మహన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహించబడునని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పంచదార సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ విభూది గంధం తైలం అన్నాభిషేకం అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించడం జరుగుతుందన్నారు.

మాల విరమణ చేయు భక్తులకు అన్నసంతర్పణం ఏర్పాటు
9 .12. 2022 అనగా ఈరోజు మేధా దక్షిణామూర్తి మాల విరమణ చేయు భక్తులకు ఈరోజు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రసాదము, అన్నసంతర్పణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వేమూరి గోపి తెలిపారు. ఈరోజు జరుగు అన్నసంతర్ప సంతర్పణ కార్యక్రమానికి నరసరావుపేట పట్టణానికి చెందిన స్వాతి మెడికల్ ఏజెన్సీస్ అధినేత తాళ్ల వెంకట కోటిరెడ్డి విజయవాడకు చెందిన సికో బయోటెక్ చెందిన శీలం కోటిరెడ్డి మరియు నరసరావుపేట చెందిన శివశక్తి పోల్స్ ఇండస్ట్రీస్ అల్లు రమేష్ ల సహాయ సహకారంతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కావున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పదవ తేదీ ఉదయము శ్రీ స్వామివారికి అభిషేకములు నిర్వహించబడవు అని తెలిపారు.

LEAVE A RESPONSE