– కాపు మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలి
– రాష్ట్ర కాపు జె ఏ సి అధ్యక్షుడు చందు జనార్దన్
విజయవాడ: కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డి మాండ్ చేశారు. మంగళవారం విజయవాడ లో గాంధీనగర్ లో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాకు వంగవీటి నామకరణం డిమాండ్ తో జరిగిన సమావేశానికి చందు జనార్దన్ అధ్యక్షత వహించారు. పేద బడుగు వర్గాల పెన్నిధి ఎస్ సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా నామ కరణం కృష్ణా జిల్లాకు చేయాలని చందు జనార్దన్ తీర్మానం ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.