Suryaa.co.in

Andhra Pradesh

ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి కక్షపెంచుకున్నాడు

పీఆర్సీ పేరుతో తనప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించారన్న అక్కసు ఆయనలో ఉంది.
అందుకే అకడమిక్ ఇయర్ ను మేవరకు పొడిగించాడు. దాటవేత ధోరణితోనే జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుకి కమిటీలంటూ కాలయాపనచేస్తున్నాడు.
• సీపీఎస్ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ, కొన్ని ఉపాధ్యాయసంఘాలు ముఖ్యమంత్రికి వత్తాసుపలుకుతున్నాయి.
• నాడు-నేడు పేరుతో కరోనాసమయంలో ప్రధానోపాధ్యాయులను బలితీసుకున్నా ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయలేదు?
• మేనెలాఖరు వరకు పాఠశాలలు పొడిగించినా ఎందుకు ప్రశ్నించడంలేదు?
• పీఆర్సీసాధనకోసం రోడ్డెక్కినవారంతా ఇప్పుడేమయ్యారు?
• ఉపాధ్యాయసంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి, ఐక్యవేదికద్వారా పోరాడితేనే వారి డిమాండ్లు సఫలమవుతాయి.
• విద్యార్థులను విద్యకు, ఉపాధ్యాయులను బోధనకు దూరంచేయడమే జగన్మోహన్ రెడ్డి అంతిమలక్ష్యంలా ఉంది.
– మాజీమంత్రి కే.ఎస్.జవహర్

అధికారంలోకి రావడంకోసం ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, సీపీఎస్ రద్దు ఎంత పని…. వారంలో చేసేస్తాననిచెప్పాడని, ఆయన అధికారంలోకివచ్చి ప్రజలకు మూడేళ్లైనా, ఆయనకు ఇంకావారం అయినట్లులేదని, అందుకే ఇచ్చినహామీలన్నింటినీ నీటిమూటలు గా మార్చేసి, రాష్ట్రంలో ఏంజరిగినా తనకేమీసంబంధంలేదన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవరిస్తు న్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ స్పష్టంచేశారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

సీపీఎస్ విధానాన్ని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంలో, ఉమ్మడిరాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు దాన్నిఅమలుచేసే బాధ్యతను తనభుజానికి ఎత్తుకుంటే, ఆయనకొడుకు దాన్నిరద్దుచేస్తానంటూ నమ్మబలికి అధికారంలోకివచ్చాడు. తండ్రీకొడుకు లిద్దరూ సీపీఎస్ ను తమరాజకీయ అవసరాలకోసం వాడుకొని, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను వంచించారు అనడంలో ఎలాంటిసందేహంలేదు. చంద్రబాబునాయుడు గారు సీపీఎస్ రద్దుకి ఠక్కర్ కమిషన్ వేసి, దానిసాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఠక్కర్ కమిషన్ సిఫార్సులు రావడంఆలస్యమవుతుందని భావించిన చంద్రబాబుగారు, సీపీఎస్ పరిధిలోఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకుకూడా ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీని అమలుచేశారు. చంద్రబాబుగారి నైజానికి విరుద్ధంగా, జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వ్యవహరించారు.

ఉపాధ్యాయులపై జగన్మోహన్ రెడ్డి చాలాచాలాకోపంతో ఉన్నట్లు ఆయనచర్యలు చూస్తుంటే అర్థమవుతోంది. గతంలో ఉపాధ్యాయులు పీ ఆర్సీ సాధనకోసంమహాధర్నాచేయడం… ప్రభుత్వాన్నిరోడ్డుపైకి లాగడంతో వారిపై ఉన్నకోపాన్ని ఎలాతీర్చుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు. ఆక్రమంలోనే మేనెలాఖరు వరకు విద్యాసంవత్సరాన్ని (అకడమిక్ ఇయర్) కొనసాగించడం… వెకేషన్ డిపార్ట్ మెంట్ కి, నాన్ వెకేషన్ డిపార్ట్ మెంట్ కి తేడాలే కుండా ప్రవర్తించడం… చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతపరిపక్వతతో ఆలోచిస్తున్నాడో అర్థ మవుతోంది.

ఉపాధ్యాయులైనా..ఉద్యోగులైనా.. రాజకీయనేతలైనా, ప్రతిపక్షాలైనా తనకు ఎదురొచ్చినా, తననుప్రశ్నించినా ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నాడని ఆయనచర్యలు చూస్తుంటేనే స్పష్టమవుతోంది. అన్నింటికంటే దారుణంగా కరోనా విపత్కర సమయంలో నాడు-నేడు అమలుచేయడం మరీదారుణమైనవిషయం. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచన లకు ఫలితంగా నాడు-నేడు అమలుకోసం అనేకమంది ప్రధానోపాధ్యాయులు బలిదానం చేయాల్సివచ్చింది. అదలాఉంటే, ఇప్పుడు వేసవిసెలవుల్లో పాఠశాలలు తెరిచి, మరింత మందిని బలితీసుకోవాలని ముఖ్యమంత్రిచూడటం క్షమించరాని నేరం.

ముఖ్యమంత్రి చర్యలు ఇలా ఉంటే, కొన్ని ఉపాధ్యాయసంఘాల ఆలోచనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సీపీఎస్ రద్దుకోసం కొన్నిఉపాధ్యాయసంఘాలు ధర్నాలుచేస్తుంటే, అన్ని సంఘాలు ఐక్యఉద్యమాల నుంచి ఎందుకు వెనుదిరిగాయి? ఐక్యఉద్యమాలు చేయకుండా, సీపీఎస్ పైఏదో సమావేశంపెడదామనుకున్న ఉపాధ్యాయులనురెచ్చగొట్టి, కావాలని రోడ్లపైకి తీసుకొచ్చారు. సీపీఎస్ రద్దుచేయించాలన్న బలమైన కోరిక కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు లేకపోవడం విచారకరం. రాజకీయ ప్రయోజనాలకోసం తమపబ్బంగడుపుకోవాలన్న ఆలోచ నల్లో కొన్నిసంఘాలు ఉండటం చాలాచాలా బాధాకరమైనవిషయం.

ఉద్యోగసంఘాలనుంచి వచ్చిన నాయకుడిగా కొన్నిసంఘాల తీరుని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. తెలుగుదేశంపార్టీ రాజకీయాల్లో ఆవిర్భవించకముందు ఉపాధ్యాయులపరిస్థితి చాలాదుర్భరం గా ఉండేది. వారిపిల్లల పెళ్లిళ్లుచేసుకోవడానికి ఉపాధ్యాయులు భిక్షాటన చేసిన సందర్భాలు కోకొల్లలు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాకే తహసీల్దార్ల తో సమానంగా ఉపాధ్యాయులకు వేతనాలు పెంచారు. రీగ్రూపింగ్ స్కేల్స్ అమలుచేసి, కార్పొ రేట్ ఉద్యోగులకు ధీటుగా ఉపాధ్యాయులు వేతనాలు తీసుకునేలా చేసిన ఘనత రామారావు గారికే దక్కుతుంది.

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా మార్చారు. అంతకుముందు బదిలీలకోసం టీచర్లు గ్రామస్థాయినేతలు, కౌన్సిలర్లవద్ద చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి. ఉపాధ్యాయులు తమబదిలీలకోసం రాజకీయనేతల చుట్టూతిరిగే విధానానికి స్వస్తిపలుకుతూ, కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చారు. దానితో పాటు ప్రతిసంవత్సరం డీఎస్సీ నిర్వహించి, ఉద్యోగ, ఉపాధ్యాయఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూవచ్చారు.

ఎన్టీఆర్, చంద్రబాబులు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంతమేలుచేస్తే, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డేమో వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. విభజనానంతరం రాష్ర్ట్రం లోటుబడ్జెట్ లో ఉన్నాకూడా చంద్రబాబుగారు ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ అమలు చేశారు. తెలంగాణలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకంటే ఆంధ్రాలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల కు ఏదీ తక్కువకాకూడదని చంద్రబాబుగారు ఆనాడు భావించి, వారికి న్యాయంచేశారు. చంద్రబాబుగారు ఉద్యోగ, ఉపాధ్యాయులను తలెత్తుకునేలా చేశారు. ఎలాంటి ధర్నాలు,ఉద్యమాలు పోరాటం లేకుండానే చంద్రబాబుగారి హయాంలోఉద్యోగ, ఉపాధ్యాయు లు పీఆర్సీని సాధించుకున్నారు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి జమానాలో రోడ్లపైకి వచ్చినా, ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారంకాని దుస్థితి.

సీపీఎస్ రద్దుపై ఈప్రభుత్వంవేసిన కమిటీ ఏంచేసిందో , ఎలాంటి పరిశీలన చేస్తుందో ఇంతవర కు తెలియదు? సీపీఎస్ రద్దుచేయిస్తాము.. ప్రభుత్వంతో మాట్లాడుతున్న సంఘాలు, ఆయా సంఘాలనేతలంతా ఏమయ్యారో తెలియదు. ఐక్యఉద్యమాలను విచ్ఛిన్నంచేయడంద్వారా సదరునేతలు ఎవరికి మేలుచేస్తున్నారో, ఎవరిపక్షాన పోరాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ ఎందుకు రద్దుచేయలేదు? ఉపాధ్యాయులుచేస్తున్న ఉద్యమం జగన్మోహన్ రెడ్డికి వత్తాసుగా చేస్తున్నట్లుంది. ఉపాధ్యాయులపై కోపంతోనే జగన్ రెడ్డి… అకడమిక్ ఇయర్ ని మే నెలాఖరువరకు పొడిగించాడు.

మే నెలలో పాఠశాలలుపెట్టినా, నాడు-నేడు అమలుకోసం ప్రాణాలుపోయినా, కారుణ్యనియామకాలపై ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ప్రభుత్వాన్నినిలదీయలేదు? ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లోని నిధులు మాయమైనా ఎందుకు నోరెత్తలేకపోయారు? తండ్రి గెజిటెడ్ ఆఫీసర్ గా ఉండిచనిపోతే, కొడుక్కి నైట్ వాచ్ మెన్ ఉద్యోగం ఇవ్వడమేనా కారుణ్య నియామకం అంటే? డిగ్రీచదివిన కొడుకు కనీసం క్లర్క్ గా కూడా పనికి రాడని ఈప్రభుత్వం ఎలానిర్ణయిస్తుంది?

కొన్ని ఉపాధ్యాయసంఘాలు ముఖ్యమంత్రికి వత్తాసుపలుకుతూ, ఉపాధ్యాయులకు తీరనిఅన్యాయం చేస్తున్నాయని చెప్పకతప్పడం లేదు. ఠక్కర్ కమిషన్ నివేదిక లోని అంశాలు అమలుచేయకుండా….జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుపేరుతో ఎన్నాళ్లు ఉత్తుత్తి కమిటీలతో కాలయాపనచేస్తారు? సీపీఎస్ రద్దు రాజస్థాన్ లో ఎలా చేశారో ఈ ప్రభుత్వం వెళ్లి తెలుసుకోలేదా…? దానికి ఎంతసమయం పడుతుంది?

జగన్మోహన్ రెడ్డి పాలనంతా దాటవేత ధోరణితోనే సాగుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు, ప్రజలసమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశ ఎక్కడా కూడా ఈప్రభుత్వంలో కనిపించడంలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి పెనంపైనుంచి పొయ్యిలో పడినట్లు గా తయారైం దనే చెప్పాలి. 20వేల మంది ఉపాధ్యాయులకు ఈ ముఖ్యమంత్రి ప్రమోషన్లు ఇస్తున్నాడని వార్తలువచ్చాయి. జిల్లాలవిభజన చేశారు..ఏ జిల్లాలో ఎందరు ఉపాధ్యాయులుఉన్నారు… ఉన్నవారి సీనియారిటీ ఎంత.. ఏజిల్లానుంచి ఇప్పుడు వారు ఏజిల్లాకు వెళతారు… ప్రమోషన్లకు అర్హులైన వారుఎందరు అనే వివరాలేమీ లేకుండా ప్రమోషన్లపేరుతో ఉపాధ్యాయులను వంచించాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు.

నూతన విద్యా విధానం పేరుతో ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యారంగంతో ఆటలాడుతున్నాడు. మాఊరిలో మా బడి ఉంచండి అని మొత్తు కంటున్నాకూడా వినకుండా…తనకుతోచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించా డు. తాను అధికారంలోకివచ్చాకనే రాష్ట్రంలో ఓనమాలు నేర్చుకుంటు న్నారు..అంతకుముందు ఈ రాష్ట్రప్రజలకు, మరీముఖ్యంగా విద్యార్థులకు అ..ఆ….లుకూడా తెలియవన్నట్లుగా ముఖ్యమంత్రి తీరుఉంది. ముఖ్యమంత్రి చెబుతున్న నూతనవిద్యావిధానం ఢిల్లీలో తప్ప ఎక్కడాసాధ్యంకాదు. జగన్మోహన్ రెడ్డి, అమ్మఒడిపేరుతో విద్యార్థులజీవితాలను ఎలానాశనంచేశారో…. విద్యాదీవెనతో ఎలావంచించారో అందరం చూశాం. తన తుగ్లక్ చర్యలతో విద్యావిధానంపై జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నాడనే చెప్పాలి.

నూతన విద్యావిధానం ఏ రాష్ట్రాలు , దేనికోసం అమలుచేస్తున్నాయో ఎంతశాతం విజయవంతమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. కిలోమీటర్ కు ఒక పాఠశాలఉండాలని గతప్రభుత్వం ఆలోచిస్తే, ఈముఖ్యమంత్రి ఊరికొక పాఠశాల అంటున్నాడు. ముఖ్యమంత్రి అనాలోచితచర్యలతో విద్యార్థులు విద్యకు దూరమై తే, ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారు. ఉపాధ్యాయసంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి, ఐక్యవేదికను ఏర్పాటుచేసుకుంటేనేఈప్రభుత్వం మెడలు వంచడంసాధ్యమవుతుందని తేల్చిచెబుతున్నాం.

LEAVE A RESPONSE