– మాజీ మంత్రి కెఎస్ జవహర్
ఎక్సైజ్ అధికారుల ఆయాసం చూస్తుంటే ప్రభుత్వం పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ లను అధికారులతో అనుకూలంగా వుండేవిధంగా మాట్లాడిస్తున్నారు.
అమ్మాకాలు తగ్గాయని రజిత్ బార్గవ చెప్పటం సరి అయినది కాదు. ఆదాయం 200% పైగా ఎలా పెరిగిందో చెప్పాలి. అధికారుల వాలకం చూస్తుంటే అన్ని కల్తీలే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ కాగితాల గురించి మాట్లాడకుండా ఫోన్ సంభాషణ గురించి మాట్లాడుతున్న తీరే, నిజం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారనటానికి నిదర్శనం.
నిజాలు బయటపడుతున్న కొద్ది నారాయణ స్వామి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు.పెద్దిరెడ్డి కట్టు బానిస నారాయణ స్వామి దళితుల గురించి మాట్లాడటం , ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతుంటే వింతగా వుంది.అసెంబ్లీ వేదికగా తిట్ల దండకం ఎవరి మెప్పుకోసమో చెప్పాలి. దళితులు గౌరవంగా ఆత్మాభిమానంతో బ్రతుకుతారు నారాయణ స్వామి అవి తాకట్టు పెట్టి బ్రతుకుతున్నారు.