– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్ లు – హక్కులు అడిగితే వేటేయ్యడాలు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు – ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్. 165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం. బిఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం – కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి,రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.