కేటీఆర్ చదువుకున్న చదివేంత గతంలో ఏం చేశారు?
కేటీఆర్ కు తెలుగు మీడియా ఇచ్చిన విపరీత ప్రాధాన్యత వల్ల….. చాలామంది కేటీఆర్ గారు పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లేదా పెద్ద టెక్నోక్రాట్ అని అనుకుంటుంటారు.
అంతేగాక కేటీఆర్ గారు అమెరికాలో, సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు అని కూడా చాలామంది భ్రమపడుతుంటారు. అది తప్పు.
కానీ అసలు విషయాలు ఏమిటంటే…..
కేటీఆర్ గారు తన ఇంటర్మీడియట్ లో కనీసం ఎంపీసీ కూడా చదవలేదు.
తన తండ్రి కేసీఆర్ గారు సీమాంధ్రులకు, వారి కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటమే చేశారు అనుకుందాం.
కానీ తన కుమారుడిని తెలంగాణాలోని అనేక విద్యాసంస్థలను కాదని…. సీమాంధ్ర నడిబొడ్డున ఉన్న, గుంటూరులోని వికాస్ జూనియర్ కాలేజీలో తన కుమారుడిని బైపీసీలో చేర్పించారు.
అక్కడే మెడికల్ కోచింగ్ కూడా ఇప్పించారు.
కానీ మెడిసిన్ లో సీటు రాకపోవడం వల్ల , బీఎస్సీ మైక్రో బయాలజీలో కోర్సును స్థానిక నిజాం కాలేజిలో చదివారు . ఆ తర్వాత ఎమ్మెస్సీ మైక్రో బయాలజీని పూణే యూనివర్సిటీలో చదవడం జరిగింది. అమెరికాలో కూడా కేవలం మార్కెటింగ్ లోనే ఎంబీఏ చదవడం జరిగింది. తన జీవితంలో ఎన్నడూ కూడా సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఎలాంటి ఉద్యోగాన్ని/వ్యాపారాన్ని కేటీఆర్ గారు చేయలేదు.
కానీ తెలుగు మీడియా ఇచ్చిన విపరీత ప్రాచుర్యం వల్ల ….
చాలామంది కేటీఆర్ గారిని పెద్ద పెద్ద టెక్నాలజీ చదువులు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకుంటారు. అది అబద్ధం. ఇవ్వాళ తెలంగాణలో ప్రతి ఇంటిలో పీజీ పీహెచ్డీ ఎంఫిల్ చేసిన వారు చాలామంది ఉంటారు.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
( అఖిలభారత ఓసి సంఘం” మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)