Suryaa.co.in

Telangana

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా లేదు

– రేవంత్ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్ తల్లి విగ్రహమా?
– ఇంగిత సంస్కారం లేని కుసంస్కారి రేవంత్ రెడ్డి
– దళితులందరికీ సమాజంలోని ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి
– అంబేద్కర్ వారసత్వాన్ని లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతి నిర్వహించడం లేదు
కేవలం కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశాలతోనే అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేస్తున్నారా?
– ప్రకాష్ అంబేద్కర్ చేత ప్రారంభించబడిన మహా విగ్రహానికి ఎందుకు అవమానం చేస్తుంది?
– తాళాలు వేసి బంధించి కనీసం శుభ్రపరచకుండా ఎందుకు పెట్టింది?
– అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ పైన అక్కసు ఉంటే దానిని అంబేద్కర్ విగ్రహం పైన ఎందుకు చూపిస్తున్నారు. అంబేద్కర్ కు నివాళులు అర్పించకుండా అడ్డుకుంటుంది. మమ్మల్ని కాదు అంబేద్కర్ వారసులను అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అంబేద్కర్ కి నివాళులు కూడా అర్పించలేని ఇంగిత సంస్కారం లేని కుసంస్కారి రేవంత్ రెడ్డి.

ప్రపంచం అబ్బురపడిన మహా మేధావి అంబేద్కర్ ని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్న 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పైన ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తున్నది.

అంబేద్కర్ ఆలోచన విధానానికి అంబేద్కర్ విగ్రహానికే కాదు దళితుల అభివృద్ధికి సైతం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. దళిత బంధు పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది. దళిత బంధు చెక్కులను రద్దుచేసి వారి జీవితాలను మారకుండా చేస్తున్నది.

పేద దళిత గిరిజన బహుజన బిడ్డలను ఉన్నత చదువుల కోసం గత ప్రభుత్వం విదేశాలకు పంపిస్తే… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఓర్వలేక వారి ఓవర్సీస్ స్కాలర్షిప్పులను నిలిపివేశాడు. తెలంగాణ బిడ్డలు విదేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల విద్యార్థులు మేము ఎవరెస్ట్ ఎక్కిస్తే ఈ ప్రభుత్వం వారిని పాడే ఎక్కిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివక్షను చేతగానితనాన్ని దాచిపెట్టడం కోసమే భారత రాష్ట్ర సమితి చేపట్టిన గురుకుల బాటను అడ్డుకుంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నాయకుల పైన కేసులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుని మాదిరిగా ఫోజులు కొడుతూ దేశంలో తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో తమను అడ్డుకున్న పోలీసుల పైన ఉక్రోషం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ , అదే హోదాలో ఉన్న ఎమ్మెల్యేలను శాసనసభ పక్ష నేతలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తించాలి.

తమ సొంత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న తీరుని గుర్తించాలి. నిజంగానే రాహుల్ గాంధీకి రాజ్యాంగం పైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పైన సద్బుద్ధి ప్రసాదించాలని సూచించాలి.

రానున్న అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలి. 11 నెలల కాలంలో ఈ రాష్ట్రం సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తాము. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేపం బట్టి ప్రతి అంశం పైన ప్రజా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము.

మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రధాత కేసిఆర్ పైన కాకికూతలు కారుకూతలు మానకుంటే ముఖ్యమంత్రి కి , ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే ముఖ్యమంత్రి సోనియాగాంధీని అడ్డగోలుగా దూషించిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. రేవంత్ రెడ్డి నోటి తీరు మార్చుకుంటేనే ఆయన పదవికి గౌరవం దక్కుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

తమ ప్రవర్తనతో పదవులకు వ్యక్తులకు గౌరవం వస్తుంది. కానీ అడుక్కుంటే కాదని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా?. కాంగ్రెస్ తల్లి విగ్రహమా? … చెప్పాలి. ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాల రూపులు చరిత్రను మారుస్తామంటే ఎవరు ఒప్పుకోరు.

ఉద్యమకాలంలో సబ్బండ వర్గాలు, కవులు, కళాకారులు, మేధావులు అంతా కలిసి తెలంగాణ పరిస్థితిలకు అనుగుణంగా సంస్కృతికి అనుగుణంగా రూపం ఇచ్చిన తల్లి విగ్రహమే తెలంగాణ తల్లి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలను దాటుకొని ఒక దేవతను ఊరేగించిన మాదిరి తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన చేసినాము.

రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపు మారుస్తానని, తెలంగాణ చరిత్రను మారుస్తానని నీచమైన మనస్తత్వంతో ఈ కుటీల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తర్వాతి ప్రభుత్వాలు మార్చినాయా? అనే విషయం ప్రశ్నించిన కేటీఆర్. తెలుగు తల్లిని కన్నడ తల్లిని మార్చనప్పుడు తెలంగాణ తల్లిని మార్చే కుసంస్కారం భావజారిథ్యం రేవంత్ రెడ్డికి ఎందుకు?

కచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాగానే రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఏర్పాటు చేసిన చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తాం. అమరవీరుల స్తూపానికి అంబేద్కర్ సచివాలయానికి మధ్యన ఉండాల్సింది కచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం. అందుకే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పంపాల్సిన చోటికి పంపిస్తాం. తెలంగాణ చరిత్రను మారుస్తామంటే ఊరుకునేది లేదు.

LEAVE A RESPONSE