Suryaa.co.in

Telangana

ఇఫ్తార్ విందుకు హాజరైన కే టీ ఆర్, పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన లోని వారాసిగూడ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కే.టీ.ఆర్. మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభా తృత్వాన్ని చాటుతాయని అన్నారు. ఇఫ్తార్ విందుకు హాజరు కావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముస్లిం లు పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ,రాసూరి సునీత, యువ నేత రామేశ్వర్ గౌడ్, నిర్వాహకులు బషీర్, అబ్దుల్, మునావర్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE