Suryaa.co.in

Andhra Pradesh

కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది..న్యాయమే గెలుస్తుంది

అనస్థిషియా డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చిన హోంమంత్రి
– కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై భావోద్వేగానికి లోనైన తల్లి కావేరిబాయి
– కలవాలంటూ ఫోన్ చేయడంతో తనే స్వయంగా వెళ్లి పరామర్శించిన హోంమంత్రి
– ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని భరోసా
– వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారన్న హోంమంత్రి అనిత

విశాఖపట్నం: వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు బలైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ ఇంటికి హోంమంత్రి అనిత స్వయంగా వెళ్లారు. తనను కలవాలనుకుంటున్నట్లు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిబాయి ఫోన్ చేసి హోంమంత్రిని సమయం కోరారు. “నన్ను కలవడానికి మీరెందుకమ్మా నేనే వస్తా”నని చెప్పి హోంమంత్రి అనిత శుక్రవారం స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

తన బిడ్డను కోల్పోయిన నాటి పరిస్థితులను, నేటికీ సీబీఐ దర్యాప్తు పూర్తికాకపోవడం తలచుకుని కావేరిబాయి ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ధైర్యంగా ఉండాలని ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని హోంమంత్రి అనిత ఆమెకు ధైర్యాన్నిచ్చారు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులని ఆమె ఓదార్చారు. డాక్టర్ సుధాకర్ బాబు తల్లి కావేరిబాయి తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని విషయాలను ముఖ్యమంత్రిగారికి వివరించి తగు చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత భరోసానిచ్చారు.

కరోనా సమయంలో మాస్కుల వంటి కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సీబీఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సమీకరించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా అనిత రాసిన లేఖను సుమోటోగా తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఆ నాడు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

LEAVE A RESPONSE