Suryaa.co.in

Telangana

పేపర్‌ లీకేజీ కేసులో కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాల్సిందే

– బ్రోకర్లు పేపర్లు అమ్ముకునే దుస్థితి వస్తె కేసీఆర్ ఏం చేస్తున్నారు?
– బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌
– టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ను నిరసిస్తూ గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన బీజేపీ
– సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్థూపం వద్ద నిరసన దీక్ష చేస్తున్న బండి సంజయ్ కి మద్దతుగా దీక్షలో పాల్గొన్న ఈటల రాజేందర్

ఈటల రాజేందర్ మాట్లాడుతూ :ప్రభుత్వ దౌర్జన్యాలకు, డబ్బుకు మేము తలోగ్గమని టీచర్లు తేల్చి చెప్పారు. అధికార పార్టీని బొందపెట్టారు. కౌన్సిల్ లో కూడా మా తరపున మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి ఉండాలి అని AVN రెడ్డి గారిని గెలిపించి పంపిన టీచర్లు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన తీర్పుతో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి తీరుతాం.

ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలారా ఆత్మహత్యలు చేసుకోవద్దని మీకు అండగా ఉంటామని సుష్మా స్వరాజ్ తెలంగాణకి పూర్తి మద్దతు పలికారు. కెసిఆర్ పాలన వచ్చి ఎనిమిది ఏళ్లు దాటినా నియామకాలు లేవు. నియమాలకు నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇస్తారు.. కోర్టు ఆదేశాలతో ఎగ్జాం పెట్టినా అవి పూర్తి కావడం లేదు. కూరగాయలు అమ్మి తల్లులు పిల్లల్ని చదివించి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కంట్లో మట్టి కొడుతున్నారు.

గ్రూప్ 1 ఎగ్జామ్ పడ్నాలుగున్నర సంవత్సరాల తరువాత నిర్వహిస్తే.. బ్రోకర్లు పేపర్లు అమ్ముకునే దుస్థితి వస్తె కెసిఆర్ ఏం చేస్తున్నారు. నీ ప్రయారిటీ ఫాం హౌస్ లో పడుకొని మీ కుటుంబ సంపాదన పెంచుకోవడం తప్ప ప్రజల గురించి లేదు. TSPSC పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అరెస్టులతో మమ్ముల్ని అడ్డుకోలేరు.

LEAVE A RESPONSE