దేశమంతా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని నినదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం ‘సేవ్ మై బ్రదర్’ అంటూ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు

– వివేకా హత్యకేసులో ప్రధానముద్దాయితో చెట్టపట్టాలేసుకొని ఢిల్లీ వీధుల్లో తిరిగిన ముఖ్యమంత్రి, తన పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటే ఎవరు నమ్ముతారు?
• అవినాశ్ సీబీఐ అరెస్ట్ నుంచి కాపాడటానికే జగన్ ఢిల్లీ బాటపట్టారు.
• వివేకాహత్యకేసులో ప్రధానముద్దాయిగా ఉన్న అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒకేఇంట్లో సమావేశమై ఏం మాట్లాడుకున్నారు?
• అవినాశ్ తో మాట్లాడిన అనంతరం జగన్ ప్రధానమంత్రితో భేటీఅయ్యి ఏం చర్చించారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధానముద్దాయిగా సీబీఐ వేటాడుతున్న ఎంపీ అవిశాన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీలో ఒకేఇంట్లో ఉన్నారని, జగన్ నేడు ప్రధానమం త్రి వద్దకు ఎందుకు వెళ్లారో, ఆయనతో అత్యవసరభేటీ కావాల్సిన అవసరం జగన్ కు ఏమొ చ్చిందో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…!

దేశమంతా జస్టిస్ ఫర్ వివేకా అంటుంటే, జగన్ మాత్రం సేవ్ మై బ్రదర్ అంటున్నారు
“రాష్ట్రంలో అసెంబ్లీసమావేశాలు జరుగుతున్నాయని, బడ్జెట్ పై సభలో వాడివేడిచర్చ నడు స్తోందని, రాష్ట్రప్రజలంతా బడ్జెట్ ను ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి హుటా హుటిన ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అంతటి అత్యవసరం ఏమొచ్చింది? మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అధికారపార్టీ, ముఖ్యమంత్రి ఘోర మైన ఓటమి చవిచూడబోతున్నారు. ఆఎన్నికద్వారా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వివేకాహత్యకేసులో ప్రధాననిందితుడైన అవినాశ్ రెడ్డితో జగన్ ఢిల్లీ వీధుల్లో చెట్టాపట్టలేసుకొని తిరగడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి అంతటితో ఆగితే పరవాలేదు.. అలాకాకుండా నేరుగా ప్రధానమంత్రి వద్దకు అవినాశ్ రెడ్డిని తీసుకెళ్లి.. వీడు నా తమ్ముడు.. వీడే వివేకానందరెడ్డిని చంపాడు అని పరిచయం చేస్తాడేమో అని అనుకున్నాం. సీబీఐ ఉక్కుసంకెళ్ల నుంచి అవినాశ్ రెడ్డిని రక్షించడానికే జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. చట్టంచేతులో నుంచి మీతమ్ముడు రక్షింపబడడు అనే చిన్నలాజిక్ ను ముఖ్యమంత్రి ఎందు కు మిస్సవుతున్నారు ఆయనే సమాధానంచెప్పాలి.

దేశమంతా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని నినదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం ‘సేవ్ మై బ్రదర్’ అంటున్నారు. అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముతో ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లారని తాము అంటాము.. కాదనిచెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? సీబీఐ అరెస్ట్ చేయకుండా చూడాలని, కోర్టుని ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి, నేడు ఢిల్లీలో ఎందుకున్నాడు? తీర్పువచ్చేవరకు ఆగకుండా, ముఖ్యమంత్రికంటే ముందే ఢిల్లీవెళ్లి, ఆయన రాకకోసం అవినాశ్ ఎందుకు ఎదురు చూశారు? సీబీఐ దర్యాప్తులో తాముజోక్యం చేసుకోమని సీబీఐ కోర్టు చెబుతుందని తెలిసి, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు ఆదేశిస్తుందని భావించే జగన్ ముందే ఢిల్లీవెళ్లారని స్పష్టమవుతోంది. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడటంకోసమే ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముతో ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లారని తాము అంటామ..కాదనే ధైర్యం ముఖ్యమంత్రి కి ఉందా? ఈకేసులో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీవెళ్లినా, ఎందరికి సాగిలబడినా అవినాశ్ రెడ్డిని కాపాడలేడు. వివేకాహత్యకేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే.. విచారిం చాల్సిందే. భారతదేశ న్యాయవ్యవస్థ ఇంకా చెక్కుచెదరలేదు అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. జగన్ ఢిల్లీపర్యటన 5కోట్లమంది ప్రజలకోసం కాదు.. తనతమ్ముడుని సీబీఐ అరె స్ట్ చేయకుండా చూడటానికేనని సుస్పష్టమైంది. అవినాశ్ రెడ్డిని రక్షించడానికే జగన్ ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటు పడింది. ఒకఎన్నిక కూడా పారదర్శకంగా జరగడంలేదు. పేదవాడిసంక్షేమం అటకెక్కింది. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం రాజ్యమేలుతోంది. ఇన్నిజరుగుతున్నా ముఖ్యమంత్రి తనకేమీపట్ట నట్టు తనతమ్ముడిని రక్షించుకోవ డమే తనధ్యేయమన్నట్లు ఢిల్లీ వెళ్లారు.

పరమేశ్వరరెడ్డి భార్య వివేకాహత్య ‘ఇంటి మనుషులపనే’ అంటే, ముఖ్యమంత్రి ఆమె వ్యాఖ్య ల్ని ఎందుకు ఖండించలేదు?
వివేకాహత్య ముమ్మాటికీ ఇంటిదొంగలపనే. 2019మార్చి15, తెల్లవారుజామున వివేకానం దరెడ్డి ఘోరంగా హత్యగావింపబడితే, తరువాతకొద్దిరోజులకి తిరుపతి ఆసుపత్రిలో చికిత్సి పొందుతున్నపరమేశ్వరరెడ్డి అనేవ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులువెళ్లారు. అప్పుడు అతనిభార్య పోలీసుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఎందుకయ్యా మా ఆయన చుట్టూ తిరుగు తారు, వివేకాహత్య ఇంటిమనుషుల పనే” అన్నది. ఆమెకు తెలిసింది ముఖ్యమంత్రి కి తెలియదా? ఆమెవ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి ఏనాడూ ఎందుకు ఖండిచంలేదు? అన్నీతెలిసే ముఖ్యమంత్రి గుంభనంగా ఉన్నారు. వివేకాహత్య ఎందుకు జరిగిందో, ఎలాజరిగిందో, ఎవరుచేశారో అన్నీ ముఖ్యమంత్రికి తెలుసు. ఎవరుచేయమంటారో వివేకాను హత్యచేశారో కూడా తెలుసు. అందుకే రాష్ట్రప్రజలతో పాటు, దేశమంతా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని నినదిస్తోంది. Everbody Should Shout For ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని గొంతెత్తి అరుస్తుంటే, ముఖ్యమంత్రి అతని కుటుంబసభ్యులు కొందరుమాత్రం ఎందుకు మిన్నకుండిపో యారు? వివేకాహత్యకేసుతో తమకేం సంబంధమని ముఖ్యమంత్రి ఇంకా బుకాయించాలని చూడటం ఏమాత్రం సరైంది కాదు. లక్ష్యం చిత్తశుద్ధితో కూడకున్నది కానప్పుడు, ముఖ్యమంత్రి ఎన్ని ఢిల్లీ పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. ‘జస్టిస్ ఫర్ వివేకా’ నినాదానికి న్యాయం చేయాల్సింది సీబీఐనే.

జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్,జగన్ సతీమణి భారతి పీఏ నవీన్ ఫోన్లు అర్థరాత్రి వారివద్ద ఎందుకున్నాయి? నవీన్, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ల ద్వారా అవినాశ్ రెడ్డి జగన్ దంపతులతో మాట్లాడాకకూడా ఇంకా ముఖ్యమంత్రి బుకాయించడం దేనికి సంకేతం? గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ, వివేకాహత్యజరిగిన రాత్రి నిందితులంతా అవినాశ్ రెడ్డి ఇంట్లోనే సమావేశమయ్యారని తేల్చింది. అదేరాత్రి అవినాశ్ రెడ్డి, నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల కు ఫోన్ చేసి, జగన్ దంపతులతో మాట్లాడారు. ఇంత స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా ముఖ్యమంత్రి ఇప్పటికీ తనతో, తనసతీమణితో అవినాశ్ రెడ్డి ఏంమాట్లాడారో చెప్పకపోవ డాన్ని ఏమనాలి. పరమేశ్వరరెడ్డి భార్య పోలీసులతో అన్నమాటలు ముఖ్యమంత్రికి గుచ్చు కోలేదా? ‘జస్టిస్ ఫర్ వివేకా’ నినాదానికి న్యాయంచేయాల్సింది సీబీఐనే. సీబీఐ ఆ పని చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీవెళ్లినా, లక్షం చిత్తశుద్ధితో కూడుకున్నది కానప్పుడు ఎలాంటిఉపయోగం ఉండదు. సీబీఐ ఏదోఒకనాడు ముఖ్యమంత్రి ఇంటితలుపు కూడా తడుతుంది. జగన్మోహన్ రెడ్డి దంపతుల్ని విచారిస్తుంది.” అని రామయ్య తేల్చి చెప్పా రు.

 

Leave a Reply