సికింద్రాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వ జన్మదినం సందర్భంగా తెదేపా సీతాఫలమండి డివిజన్ అధ్యక్షుడు జి వి కృష్ణ ఆధ్వర్యంలో, నామాలగుండు కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధీగా తెలుగుదేశంపార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ కేక్ కట్ చేసి, పండ్లు పంచిపెట్టారు.
మధుర నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయంలో వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుట్టి వేలోడి ఆసుపత్రిలో రోగులకు సిబ్బందికి, మరియు స్థానిక అంగన్వాడీ సెంటర్ లో పండ్లు పంచి పెట్టారు.
ఈ సందర్బంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీనవర్గాల శ్రెయస్సు కోసం, అభివృధ్ధికోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సీతాఫలమండి డివిజన్ అధ్యక్షుడు జి వి కృష్ణ, ,సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, జగదీష్, రమాదేవి, పూజా, దీపు, పుప్పాల విజయ్ కుమార్, సాయి టైలర్ శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, వెంకటస్వామి, దేవేందర్, డెంటల్ ప్రవీణ్ ,చిరంజీవిరాజు, శేశిరేఖ, మురళీకృష్ణ, చందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు..