Suryaa.co.in

Telangana

లక్ష్మారెడ్డికి కేటీఆర్ పరామర్శ

ఆవంచ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి ని కేటీఆర్ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపేట మండలం, ఆవంచ గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. లక్ష్మారెడ్డి పిల్లలతో మాట్లాడుతూ.. తల్లి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ కష్ట సమయంలో మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని లక్ష్మారెడ్డి కి సూచించారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి ని పరామర్శించారు.

LEAVE A RESPONSE