– ఇంటర్ చదివిన తమ్మినేనికి నివేదికలో ఏముందో ఎలాతెలుస్తుంది?
– ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ధర్మాన, తమ్మినేని, బొత్స, ఇతరమంత్రులు, వైసీపీనేతల అభివృద్ధికాదు
– శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లే చంద్రబాబు ఉత్తరాంధ్రను అన్నివిధాల అభివృద్ధిచేశారు
– ఉత్తరాంధ్రకేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందే బొత్స, ధర్మాన, తమ్మినేని సీతారామ్ లు
– ధర్మానప్రసాదరావు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువైన 2ఎకరాలప్రభుత్వభూమిని కాజేయలేదా?
– ఊసరవెల్లిలా రంగులుమార్చి, రాజకీయం చేయమని రాజ్యాంగం ధర్మానకు చెప్పిందా?
– 3 దశాబ్దాలనుంచి రాజకీయాల్లోఉన్న ధర్మాన, బొత్స ఉత్తరాంధ్రకు ఏం న్యాయంచేశారు?
– భూ బకాసురుడైన విజయసాయిరెడ్డితో పోటీపడటంపై చూపుతున్నఆసక్తిలో ఒకవంతైనా ధర్మాన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చూపాడా?
– శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్, కూన రవికుమార్
ఉత్తరాంధ్ర మంత్రులమని చెప్పుకుంటున్నవారంతా, ఆప్రాంతంలో విజయసాయిరెడ్డి చేస్తున్న భూకబ్జాలతో పోటీపడలేక, ప్రభుత్వంలోఉండికూడా తమకేమీదక్కడంలేదన్న నిరాశానిస్పృహలతో, టీడీపీపై, చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు కూనరవికుమర్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే.. ఉత్తరాంధ్రమంత్రులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు.ధర్మాన హావభావాలు, నిరాశానిస్పృహలు చూస్తుంటే తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నట్టుగా ఉంది. భూబకాసురుడైన విజయసాయిరెడ్డి అపరిమిత భూకబ్జాలతో తనకేమీ దక్కలేదన్న నిరాశాలో ధర్మాన ఉన్నారు. ఆ క్రమంలోనే మూడురాజధానుల పేరుతో తన నిస్సహాయతను మీడియాముందు వెళ్లగక్కుతున్నాడు.
ధర్మాన కుటుంబం 33ఏళ్లనుంచి ఉత్తరాంధ్రలో రాజకీయాలు వెలగబెడుతోంది.ఇన్నేళ్లలో ఆ కుటుంబం ఆప్రాంతానికి ఏంచేసిందయ్యా అంటే సమాధానంశూన్యం. తమ్మినేని సీతారాం టీడీపీ ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు రాజకీయాల్లో ఉన్నాడు.కోలగట్ల వీరభద్రస్వామి, కరణం ధర్మశ్రీలు 18ఏళ్లనుంచి ఉన్నారు. ఏళ్లతరబడి రాజకీయాల్లో ఉండికూడా ఉత్తరాంధ్ర అభివృద్ధిచెందలేదు అంటున్నారంటే ఇన్నేళ్లనుంచి వారంతా గడ్డిపీకారా?తమ్మినేని సీతారామ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో సాగునీటిప్రాజెక్ట్ లు గుర్తురాలేదా? శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కనిపించలేదా? ధర్మాన, బొత్స, తమ్మినేని, ఇతర వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు, వారికుటుంబాలు అభివృద్ధిచెందితే, ఆప్రాంతం మాత్రం ఎందుకు వెనుకబడింది?
5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేయలేనిదేంటి.. మూడేళ్లలో జగన్ రెడ్డి పొడిచిందేమిటి ధర్మాన? 5 ఏళ్లపాలనలో చంద్రబాబుగారు సాగునీటిప్రాజెక్ట్ లకోసం రూ.68,293కోట్లు ఖర్చుపెట్టారు.62 ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టి, వాటిలో 23 ప్రాజెక్ట్ ల్ని పూర్తిచేసి, 32లక్షల ఎకరాల ఆయకట్టుస్థిరీకరించారు. చంద్రబాబు 2014-19 మధ్యన రూ.1571కోట్లతో ఉత్తరాంధ్రలో 69వేల ఎకరాలకు సాగునీరు అందించారు.900కోట్లు ఖర్చుపెట్టి, వంశధార ప్రాజెక్ట్ ను చంద్రబాబు 92శాతం పూర్తిచేస్తే, జగన్ రెడ్డి తన మూడేళ్లపాలనలో మిగిలిన 8శాతం పూర్తిచేయలేకపోయాడు.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉత్తరాంధ్రసాగునీటి ప్రాజెక్ట్ లకోసం కేవలం తూతూమంత్రంగా రూ.100కోట్లుమాత్రమే ఖర్చుపెట్టాడు.
జగన్ రెడ్డి ప్రభుత్వం, 3న్నరేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటిప్రాజెక్ట్ లకు ఎంత ఖర్చుపెట్టిందో ఏపీఇరిగేషన్ అధికారి నారాయణరెడ్డే చెప్పాడు కదా! మీ ప్రభుత్వంలోని అధికారే మీ డొల్లతనాన్ని, అసమర్థతను బయటపెటినా కూడా సిగ్గులేకండా మాట్లాడితే ఎలా?ఉత్తరాంధ్రకేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందే బొత్స, ధర్మాన, తమ్మినేని సీతారామ్ లు.
ధర్మానప్రసాదరావు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న రూ.100కోట్ల 2ఎకరాలప్రభుత్వభూమిని కాజేయలేదా?మాట్లాడితే రాజ్యాంగంలో అలాచెప్పారు.. ఇలాచెప్పారని ధర్మాన కబుర్లుచెబుతాడు. ఊసరవెల్లిలా రంగులుమార్చి, రాజకీయంచేయమని ధర్మానకు రాజ్యాంగం చెప్పిందా?ఎన్నికలముందుఒకలా… అయ్యాక మరోలా మాటమార్చమని జగన్ రెడ్డికి రాజ్యాంగం చెప్పిందా? విశాఖను రాజధాని చేస్తున్నామనిచెప్పి, ధర్మాన అతని కుటుంబం ఇప్పటికే రూ.2వేలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజంకాదా? ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరణ కోసమే బొత్స , ధర్మాన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.పదోతరగతి, ఇంటర్ చదివిన ధర్మాన, తమ్మినేనికి శ్రీకృష్ణకమిటీ నివేదిక అర్థమవుతుందా? శ్రీకృష్ణ కమిటీ ఏంచెప్పిందో ధర్మానకు తెలియదా?రోజుకోపార్టీ మార్చమని, ఊసరవెల్లిలా రంగులు మార్చమని అంబేద్కర్ రాజ్యాంగం ధర్మానకు చెప్పిందా?
పదోతరగతి చదివిన ధర్మానకు, ఇంటర్ చదివిన తమ్మినేనికి నివేదికలో ఏముందో ఎలాతెలుస్తుంది?వారు మరలా నిక్కర్ లు వేసుకొని స్కూల్ కు వెళ్లి, ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది. విశాఖసహా, ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధిచేయాలని శ్రీకృష్ణకమిటీ సూచించిందో అప్పుడైనా వారికి అర్థమవుతుంది. విశాఖనగరం చుట్టుపక్కల ప్రాంతాలు పరిశ్రమలు, పోర్టులఅభివృద్ధి, మత్స్యపరిశ్రమలకు అనుకూలమని శ్రీకృష్ణకమిటీ చెప్పలేదా? ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినంతమాత్రాన విశాఖప్రాంత ప్రజలకు ఉపాధికలగదని చెప్పలేదా?
సదరు కమిటీ సూచనలప్రకారమే శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ, భావనపాడు పోర్టు, వంశధార-బహుదా, వంశధార-నాగావళి నదులఅనుసంధానం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, సంగీతఅకాడమీ, హార్టికల్చర్ కళాశాల, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి 2,700ఎకరాల భూసేకరణచేస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఉత్తరాంధ్రఅభివృద్ధితో తనకేంపనిఅంటూ దానిలో 1800 ఎకరాలు జీఎంఆర్ సంస్థకు కట్టబెట్టి, మిగిలిన భూమిని తనకింద ఎందుకు ఉంచుకున్నాడో చెప్పాలి.
రైతుల దగ్గర కొన్న భూములు ఎవరికి దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి తనవద్దఉంచుకున్నాడు?ఎయిర్ పోర్ట్ భూములపై బొత్స, ధర్మాన, డమాబుస్సులసీతారామ్ ఏంసమాధానం చెబుతారు? మీ స్వార్థంకోసం ఉత్తరాంధ్ర యువత, రైతుల్ని ఎన్నాళ్లు మోసగిస్తారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్న ధర్మాన, బొత్సలు, వారి కుటుంబాలను బాగుచేసుకొని, ఆస్తులు పెంచుకున్నారు గానీ, ఏనాడైనా ఉత్తరాంధ్రకోసం ఏమైనా చేశారా?హై డెవపల్ మెంట్ లో కృష్ణాజిల్లాఉందని, మోర్ డెవలప్ మెంట్ లో గుంటూరుజిల్లాఉందని శ్రీకృష్ణ కమిటీచెప్పలేదా?భూముల లభ్యతతోపాటు, నీటివనరులు కృష్ణా, గుంటూరుజిల్లాల్లో పుష్కలంగా ఉన్నాయని కమిటీ నివేదికలో లేదా?
గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో భూకంపాల తీవ్రతచాలా తక్కువగా ఉందని, అలానే తుఫాన్లు, వరదలతాకిడికి ఆరెండుజిల్లాలు దూరమని చెప్పలేదా?శ్రీకృష్ణకమిటీ ఎక్కడాకూడా విశాఖలో రాజధాని పెట్టాలని చెప్పలేదు. ధర్మాన, బొత్స, డమాబుస్సుల సీతారామ్ కంటే ఉత్తరాంధ్రప్రజలు ఎంతో తెలివిగలవారు. ఢమాబుస్సుల సీతారామ్, సీదిరి అప్పలరాజు, బొత్సలకు నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమాభి మానాలు ఉంటే, జగన్ రెడ్డిని ఒప్పించి రాజధానిని విశాఖలో కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏర్పాటుచేయించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో ఐ.ఐ.ఎమ్, పెట్రోలియం ఎనర్జీ యూనివర్శిటీ, మెడ్ టెక్ జోన్, లులూగ్రూప్, అదానీ డేటాసెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మిలీనియం ఐటీటవర్స్ తో పాటు అనేక గొప్పపరిశ్రమలు, ఐటీసంస్థలు తీసుకొచ్చాం.
మూడుసార్లు సీఐఐసదస్సులు నిర్వహించాం. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే విశాఖలోని లులూగ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలను, ఫిన్ టెక్ వ్యాలీలోని కంపెనీలను ఎందుకు వెళ్లగొట్టాడు? శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం జగన్ రెడ్డి తనమూడేళ్లపాలనలో ఉత్తరాంధ్రకు ఒక్కపరిశ్రమైనా తెచ్చాడా?
సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధిచేయలేని సీదిరి అప్పలరాజుకి చంద్రబాబు పేరెత్తే అర్హతకూడా లేదు. చంద్రబాబునాయుడు కల్పించిన ఫీజు రీయింబర్స్ తోనే అప్పలరాజు తన చదువుపూర్తిచేసుకున్నాడు. ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇసుకబకాసురుడి అవతారమెత్తిన తమ్మినేని చంద్రబాబు పాలనను వేలెత్తిచూపుతాడా? విజయసాయిరెడ్డి భూకబ్జాలు, వైసీపీనేతలు సాగిస్తున్న గనులు, ఇసుకదోపిడీ గురించి మాట్లాడలేని ధర్మాన టీడీపీని, చంద్రబాబుని విమర్శిస్తాడా? తోటపల్లి బ్యారేజ్ కోసం 2019-20లో జగన్ రెడ్డి ప్రభుత్వం రూపాయిఖర్చు పెట్టలేదు.
టీడీపీప్రభుత్వం అదేబ్యారేజ్ శివారుభూములకోసం రూ.602కోట్లు ఖర్చుపెట్టింది.జంఝావతి రిజర్వాయర్ పూర్తిచేయడానికి రూ.83కోట్లు టీడీపీప్రభుత్వం ఖర్చుపెట్టింది. వట్టిగడ్డ రిజర్వాయర్, తారరామసాగర్ నిర్మాణంకోసం జగన్ ప్రభుత్వం రూపాయైనా ఖర్చుచేసిందా?ఉత్తరాంధ్ర సుజలస్రవంతి, నారాయణపురం రిజర్వాయర్ల సంగతేంటి? ఉద్దానంప్రాంతంలోని కిడ్నీవ్యాధిగ్రస్తులకోసం చంద్రబాబునాయుడు 60 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పారు. ఆనాడు పలాసకేంద్రంగా ఉద్దానంప్రాంతంలో రూ.100కోట్లతో టీడీపీప్రభుత్వం డయాలసిస్ రీసెర్చికేంద్రాన్ని ప్రారంభించింది. జగన్ రెడ్డి వచ్చాక ఆ రీసెర్చి కేంద్రం పనులుఏమయ్యాయి?మూడున్నరేళ్లైనా నేటికీ డయాలసిస్ రీసెర్చ్ పనులు మూడు అంగుళాలు కూడా పూర్తిచేయలేకపోయారు.
ఉత్తరాంధ్రలోని మూడుజిల్లాల్లో, ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్ట్ కైనా రూపాయి ఖర్చు పెట్టిందని ఆప్రాంతం గురించి చొక్కాలు చించుకుంటున్న వైసీపీనేతలు చెప్పగలరా?తమదోపిడీకి ఉత్తరాంధ్ర మహాగనిలా దొరికిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డి, ఆప్రాంత మంత్రులకు త్వరలో ప్రజలే కర్రుకాల్చివాతపెడతారు అని రవికుమార్ హెచ్చరించారు.