ఒక్క యాత్ర..
బిజెపికి అది జైత్రయాత్ర..
నచ్చని జనాలకు చేదుమాత్ర…
ఉనికే నీరసమైన కమలాన్ని
కులికే స్దాయికి గొంపోయిన
అఖండ ప్రస్థానం..
లాల్ కిషన్ అద్వానీ
తెచ్చిపెట్టిన గౌరవస్థానం!
ఉక్కు సంకల్పం..
మొత్తం భారతావని చుట్టేసిన
ఉక్కు మనిషి ప్రయాణం..
లక్షలాది కరసేవకులతో
ఓ ప్రళయం..
ఆ రోజున అయోధ్యలో..
ఒకనాటి రామమందిరాన్ని
కప్పి కుప్పిగంతులేసిన
బాబ్రీ మసీదు శిధిలాలను
కుప్పకూల్చి నేటి రామమందిర
నిర్మాణానికి బీజాలు వేసిన
చారిత్రక ఘట్టం..
తదనంతర
కమలనాధుల పట్టం..
ఇప్పుడు రామమందిర నిర్మాణంతో
భువిలో మరోసారి
శ్రీరామ పట్టాభిషేకం!
ఇంతటి కీర్తికి..స్ఫూర్తికి
కారకుడైన పెద్దాయన..
ఆరెస్సెస్..జనసంఘ్..బిజెపి
తరతరాల వారధి..
కమల సారధి..
ఇప్పటికీ అలసిపోని దిగ్గజం
వాజ్ పేయి కుడిభుజం..
పోరాటమే ఇజం..!
టైర్ కాని సింహాన్ని
రిటైర్ చేసినా
మారుమాటాడని క్రమశిక్షణ..
కమలానికి ఆయనే సౌభాగ్యం..
ఆ వృద్ధసింహానికేమో
ఆరోగ్యమే మహాభాగ్యం..
తొమ్మిది పదులు దాటినా
అదే మనిషి..
అదే ఉరుకు..అదే చురుకు..
తప్పులపై అదే చురక!
పాపం..
ఈ మాట ఆయనకు నప్పదేమో..నచ్చదేమో..
ప్రధాని కావాలన్న కల…
ఉప ప్రధాని పాత్రతోనే సరి..
పార్టీకి ఆయనే సిరి..
మధ్యలో కాస్త కిరికిరి..
అత్యున్నత పదవులు రెండు..
ఒకటి మోడీ పరం…
మరి లాల్ జీకి ఎందుకో
ఈ కలవరం..
రాజకీయ కల్లవరం..
ఈ దళపతిని రాష్ట్రపతి
చేసి ఉంటే..
అది నిజమైన గౌరవం..
పెద్ద పదవి పులిని మిస్సయ్యింది…
జాతి మొత్తం సింహాన్ని మిస్సయ్యింది..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286