Suryaa.co.in

Andhra Pradesh

ఆర్ధిక వివేకం లోపించింది…లోటు చుక్కలనంటుతోంది

– పడకేసిన పారిశ్రామికాభివృద్ధి- పెరిగిపోతున్న నిరుద్యోగం
– వైసిపి బెదిరింపులతో పెట్టుబడిదారుల పరార్‌
– జె గ్యాంగ్‌ అరాచకాలతోనే ఆంధ్రప్రదేశ్‌ అధోగతి
– రెండున్నరేళ్ల జగన్‌ పరిపాలనా నిర్వాకాలు
శాసనమండలి ప్రతిపక్ష నేత,యనమల రామకృష్ణుడు
ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక రంగంలో తిరోగమనం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు వ్యతిరేక సంకేతాలను పంపుతోంది. జగన్‌ ప్రభుత్వ విధ్వంసక పాలన చూసి దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు భయపడి పరార్‌ అవుతున్నారు.
ఏపిలో నిరుద్యోగ రేటు 6.5% ఉంటే తెలంగాణలో 4.7% మాత్రమే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలే పేర్కొన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఏపిలో నిరుద్యోగ రేటు దాదాపు 15% ఉంది.
మట్టి,ఇసుక, గ్రానైట్‌,లేటరైట్‌, బాక్సైట్‌,లైమ్‌ స్టోన్‌,బెరైటీస్‌ తదితర సహజ సంపద అంతటినీ ‘‘జె(జగన్‌) గ్యాంగ్‌’’ నిలువుదోపిడీకి పాల్పడటంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడిరది. జగన్‌ అనుచరులంతా నడమంత్రపు సిరిగాళ్లు అయ్యారు, రాష్ట్రాభివృద్దికి చిల్లిగవ్వ లేకుండా పోయింది.
రాష్ట్రాభివృద్ది కోసం తెచ్చిన అప్పులను కూడా రెవిన్యూ వ్యయం కిందకే జమ చేయడం ద్వారా పేదల స్కీముల్లోనూ అనేక స్కామ్‌ లకు పాల్పడి వైకాపా నేతలు జేబులు నింపుకోవడం వల్ల పబ్లిక్‌ రంగంలో పెట్టుబడులకు ఎటువంటి ఆదాయాలు లేకుండా పోయాయి.
పేదల సంక్షేమంపై పెద్దఎత్తున నిధులు వ్యయం చేస్తున్నట్లు మీడియా ప్రకటనల్లో కోట్లు వెదజల్లి వైకాపా డప్పుకొట్టడమే తప్ప రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు దారుణంగా పెరిగి పేదరికం ప్రబలిపోయింది.
మూలధన వ్యయం అడుగంటి, పారిశ్రామిక పెట్టుబడులు క్షీణించి, ఆర్ధిక రంగం స్థంభించిపోయి, రాష్ట్రంలో తిరోగమనం నెలకొంది, తత్ఫలితమే నిరుద్యోగం ప్రబలిపోవడం..
2020 ఏప్రిల్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు ఏపిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌ డిఐ) రూ.638.72 కోట్లు మాత్రమే.. అదే తెలంగాణలో రూ.8,617.71కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణకు వచ్చిన ఎఫ్‌ డిఐలో చూస్తే ఏపికి కేవలం 7%మాత్రమే ఉండటం, జాతీయ స్థాయిలో(రూ4,42,568.84కోట్లలో) 1%కూడా లేకపోవడం జగన్‌ ప్రభుత్వ విధ్వంసానికి ప్రత్యక్ష ఆనవాళ్లు..దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి దిగజారింది (అడుగునుంచి చూస్తే 4వ స్థానం). ఏపిలోకి ఈక్విటి ప్రవాహం కూడా ఆశాజనకంగా లేదు. మౌలిక వసతుల కల్పనలో ఏపి పూర్తిగా వెనుకబడిపోయింది. ప్రైవేటు రంగంలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు అసలే లేవు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగుకు ఏపి చేరింది, జాతీయ స్థాయిలో 15వ స్థానానికి పతనమైంది.
ఏపి ఆర్ధిక పతనానికి కోవిడ్‌ను సాకుగా చూపడం అవాస్తవం. కోవిడ్‌ తీవ్ర ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఢల్లీి మరియు తమిళనాడుకు భారీఎత్తున ఎఫ్‌డిఐలు వచ్చాయి. జగన్‌ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో యువతరం అందులోనూ విద్యాధికులు, బలహీన వర్గాలే ప్రధాన బాధితులు.
ప్రభుత్వ రాబడుల దుర్వినియోగంతో పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా సకాలంలో ఇవ్వడంలేదు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో, నూతన ఆవిష్కరణలు, ప్రోత్సాహకాల్లో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉంది. జగన్‌ ప్రభుత్వ రివైజ్డ్‌ పారిశ్రామిక విధానం అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. టిడిపి తెచ్చిన బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీని అటకెక్కించారు, ఏ విధానం లేకుండా 14నెలలు టైంపాస్‌ చేసి తెచ్చిన 2020-23పాలసీ వికటించింది. గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ కేపిటల్‌ ఫార్మేషన్‌(జిఎఫ్‌ సిఎఫ్‌)పై జగన్‌ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అన్ని రంగాల్లోనూ కేపిటల్‌ ఫార్మేషన్‌ లేకుండా పోయింది.
సిఎం జగన్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్రదిష్ట పాలైంది. తెలుగుదేశం ప్రభుత్వం 3 పారిశ్రామిక సదస్సులలో ఆకర్షించిన రూ 16లక్షల కోట్ల పెట్టుబడులు, 30లక్షల మంది యువతకు ఉద్యోగాల ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు.
వైసిపి నాయకుల పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పరార్‌ అయ్యే దుస్థితి తెచ్చారు. అనంతపురంలో కియాకు వైసిపి ఎంపి బెదిరింపులు, కడపలో సోలార్‌ ప్యానళ్ల ధ్వంసం, గుంటూరులో సిమెంట్‌ ఫ్యాక్టరీలకు వేధింపులు, చివరికి రోడ్డు వర్కుల కాంట్రాక్టర్లను కూడా వదలిపెట్టడం లేదు. సెజ్‌ లు, పోర్టులు ప్రభుత్వ ప్రైవేటు భూములన్నీ జగన్‌ బినామీల పరం అయ్యాయి.
GSDP, INDUSTRY,SERVICES AND THEIR GROWTH IN % (CURRENT PRICES)
TDP 2ఏళ్ల వార్షిక సగటు YCP 2ఏళ్ల వార్షిక సగటు గత 2ఏళ్లలో వైసిపి ప్రభుత్వం సాధించింది
GSDP 12.8 6.6 -6.3
INDUSTRY SECTOR 9.8 4.6 -5.2
I)MANUFACTURING 9.3 6.4 -3.2
II)CONSTRUCTION 8.8 2.4 -6.4
iii)REAL ESTATE ETC. 11.8 8.7 -3.1
iv)TRADE,ETC. 12.2 1.1 -11.1
SERVICES SECTOR 12.5 5.5 -7.04
PCI 12.4 5.8 -6.6
CAPITAL EXPENDITURE
పూర్తిగా అడుగంటింది
TOTAL EXPENDITURE బిఈ తో పోలిస్తే అతి తక్కువ
REVENUE DEFICIT% TO GSDP RAISING
FISCAL DEFICIT % TO GSDP RAISING
DEBT % TO GSDP UNCONTROLABLE
@ % in total expenditure
Source:-all Budget books placed on the table of the Houses/legislature
పారిశ్రామిక రంగం, సేవారంగం రెండిరటిలో కూడా ఘోరంగా విఫలం చెందారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ది ఎలా సాధ్యం..? యువతకు ఉపాధి కల్పన ఎలా సాధ్యం..?
వైసిపి ప్రభుత్వం 2ఏళ్లలో చేసిన మొత్తం వ్యయం:-
2019-20 అకౌంట్స్‌(కాగ్‌ నివేదిక ప్రకారం)………..రూ 1,55,070.00 కోట్లు.
2020-21 రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌( బడ్జెట్‌ బుక్‌ ప్రకారం)….రూ 1,85,467.59 కోట్లు
మొత్తం…రూ 3,40,537.50 కోట్లు
(ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌, వేజ్‌ అండ్‌ మీన్స్‌, స్పెషల్‌ డ్రాయింగ్‌ అలవెన్స్‌ తదితరాలన్నీ మినహాయించి)
గత 2ఏళ్ల ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ : రూ 1,68,000 కోట్లు(దాదాపుగా)
ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ కూడా కలిపి మెత్తం అప్పు – రూ 5,08,000 కోట్లు(సుమారుగా)
అనుమతులు ఇచ్చిన దానికన్నా గ్యారంటీలు అవధులు దాటాయి. రుణాల చెల్లింపులో అస్థిరత్వం..లోటు చుక్కలనంటుతోంది..బడ్జెట్‌ గురించి రాజ్యాంగం పేర్కొన్న అంశాలు, బడ్జెట్‌ మాన్యువల్‌, ఎఫ్‌ ఆర్‌ బిఎం చట్ట నిబంధనలు అన్నింటినీ తుంగలో తొక్కారు. చట్టసభలు ఆమోదించిన బడ్జెట్‌ పవిత్రతనే జగన్‌ ప్రభుత్వం దెబ్బతీసింది. ఆర్ధిక వివేకం పూర్తిగా లోపించింది. తత్ఫలితమే అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళడానికి కారణమైంది.
2020-21 మొత్తం బడ్జెట్‌ లో రుణాల రీపేమెంట్‌ వడ్డీతో కలిపి 23%కు చేరుకుంది. మూలధన వ్యయం కేవలం 8%మాత్రమే ఉండటం ఆందోళనకరం. మళ్లీ బాగు చేయడానికి కూడా వీల్లేనంత అధోగతికి రాష్ట్రాన్ని దిగజార్చారు. ఇంత చేసినా ఏమాత్రం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కల్పించిన దాఖలాలు లేవు, రోడ్లు, భవనాలు,పేదల ఇళ్లు,వాటర్‌ స్కీములు తదితర సామాజిక మౌలిక వసతుల కల్పనలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక స్థిరత్వాన్ని అతలాకుతలం చేశారు. రాష్ట్ర పరపతిని చావుదెబ్బ తీశారు.

LEAVE A RESPONSE