Suryaa.co.in

Telangana

సందర్శనకు లేక్ ఫ్రంట్ పార్క్

ఆదివారం నుంచి అందుబాటులోకి
ఉదయం వాకర్స్, ఆ తర్వాత ఇతరులకు అనుమతి సాగర్ సరసన రూ.26.65 కోట్లతో తీర్చిదిద్దిన హెచ్ఎండిఏ

హైదరాబాద్ : చారిత్రాత్మక జలాశయం హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ ఆదివారం (అక్టోబర్ ఒకటో తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నది.

దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ను గత మంగళవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండనున్నది. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు వాకర్స్ టైమింగ్స్ నిర్ణయించారు. నెలకు రూ.100/- ల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. లేక్ ఫ్రెండ్ పార్కులో రూ.11,000/- లు చెల్లించి ప్రత్యేకంగా బర్త్ డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండిఏ ఈ పార్కులో కల్పిస్తుంది.

లేక్ ఫ్రంట్ పార్క్ లో కరాచీ బేకరీ అవుట్ లెట్ తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ సందర్శకుల కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

LEAVE A RESPONSE