Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దా‘రుణ’ పాలన పాపం,తర్వాత పాలకులు మోయాల్సిందే

– బీజేపీ నేత లంకా దినకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2021-22 ఆర్ధిక సంవత్సరానికి అంచనా రుణపరిమితి 42,472 కోట్లు. రాష్ట్ర అంచన జీఏస్డీపీ లో 4% కాగా, అందులో 0.5% మూలధనవ్యయం ఆధారితమైనది, ఇక ఈ నెల అంతానికి మూడవ త్రైమాసికం పూర్తి కాబోతున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 కి అంచనా మూలధన వ్యయం 31,198 కోట్ల రూపాయలు కాగా, అక్టోబర్ నెల పూర్తి అయ్యేసరికి చేసిన వాస్తవ వ్యయం, కేవలం 8,739 కోట్ల రూపాయలు మాత్రమే.

అంటే వాస్తవ మూలధన వ్యయం దాదాపు 55% వరకు చేయవలసి ఉండగా, కేవలం 28% మాత్రమే ఖర్చు చేయడం దేనికి సంకేతం? ప్రస్తుత తరుణంలో అదనపు ప్రోత్సాహక రుణాలు సాధించేందుకు, మూడవ త్రైమాసికంలో బడ్జెట్ లోని 75% మూలధన వ్యయం లక్ష్యాన్ని సాధించే నమ్మకం లేదు.

అంటే ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 100% లక్ష్యం సాధించడం దుర్లభం, అంటే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి అంచన రుణ పరిమితి 42,472 కోట్లులో దాదాపు 10,500 కోట్ల రూపాయల కోత సహజంగానే రద్దు అవుతుంది, దీనికి అధనంగా నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన అదనపు అప్పులు 17,924 కోట్ల రూపాయలలో 1/3 వ వంతు, అంటే దదాపు 6,000 కోట్ల రుపాయిలు కు కత్తెర పడితే – ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తానికి రాష్ట్రప్రభుత్వం చేయదగిన నికర రుణం 26,000 కోట్ల రుపాయిలలోపు మాత్రమే.

అయితే మొదటి 7 నెలల కాలానికి జగనన్న నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే చేసిన అప్పు 39,914 కోట్లు అయినప్పుడు, ఆర్డిక సంవత్సరాంతానికి ఇంకెంత అప్పు చేస్తారు? ఆ అప్పుని భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలకు సర్దుబాటు చేసి భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వం నడిపే వారి నెత్తిన వేస్తారు?

మౌలికమైన ప్రశ్నలు :
జగన్ ఏఫ్.ఆర్.బీ.ఏం పరిమితి దాటి 17 వేల 924 కోట్ల రూపాయలను అదనంగా నిబంధనలకు విరుద్ధంగా రుణాలను చేయడం పార్లమెంటు సాక్షిగా బహిర్గతం అయ్యింది.
రాబోయే 3 సంవత్సరాలలో భవిష్యత్తు రుణపరిమితి నుంచి, కేంద్రం కత్తెర వేయడం నేటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలకు దర్పణం.

అదనపు రుణం 17,924 కోట్ల రూపాయలు ఒకే ఆర్ధిక సంవత్సరం కేంద్రం కత్తెర వేయబోగా, ఆ కత్తెర మూడు సంవత్సరాలకు వేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరడం అంటే ఇది తెలిసి చేసిన తప్పు.
గరిష్టంగా మరో రెండు ఆర్థిక సంవత్సరాలు మాత్రమే, జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను పెట్టే అవకాశం ఉంది.

మరి ఈ ఆర్ధిక సంవత్సరానికి చేసే అదనపు అప్పులను, ఇంకెన్ని భవిష్యత్ సంవత్సరాలకు సర్దుబాటు చేయాలి? ఇది భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే వారికి శాపం కాదా?
జగన్ పాలన వైఫల్య పాపాల ప్రభావం ఆయన పాలన అనంతరం, మరో సంవత్సరం కొత్త ప్రభుత్వం మోయాలి.

LEAVE A RESPONSE