– బీజేపీ ఫీడ్బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్
కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో పొద్దుగడుపుతున్న సీఎం జగన్ ప్రభుత్వం, చివరకు ఆ పథకాలకు తన స్టిక్కర్లు వేసుకోవడం సిగ్గుచేటని ఏపీ బీజేపీ ఫీడ్బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ ధ్వజమెత్తారు. లంకా దినకర్ ఇంకా ఏమన్నారంటే..
చిరువ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం పీఏం స్వనిధికి జగనన్నతోడు స్టిక్కర్ తో బుకాయిస్తున్నారు.15 లక్షల మందికి పైగా చిరు వ్యాపారులకు 2,011 కోట్ల రూపాయల రుణాలపైన 7% సబ్సిడీ మరియ సంవత్సరానికి ప్రతి లబ్ధిదారునికి 1,200 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే జగనన్న డ్రామాలు పేట్రేగిపోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగనన్న స్టిక్కర్లు వేసుకుంటూ, మరోవంక విజయసాయి రెడ్డి తో కేంద్రం పైన విషం చిమ్మిస్తున్నారు. చిరువ్యాపారులకు ” తోడు మోడీ ది “, మరి ” పేరు జగనన్న దా”?చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల ఆత్మనిర్భరనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు కేంద్రం ఇస్తుంది.కేంద్రం స్వనిధి పథకాన్ని జగనన్న తోడు అంటున్న రాష్ట్ర ప్రభుత్వ దుర్భర ఆలోచన ధోరణి బయట పడింది.
పీఎం స్వనిధి పైన స్టిక్కర్ జగనన్న తోడు పైన వడ్డీ సబ్సిడీ ని చిరు వ్యాపారులకు కేంద్రం ఇస్తుంటే బిల్డప్ మాత్రం జగన్ ఇస్తున్నారు.పీఏం స్వనిధి పథకానికి నిధులు ప్రధాని మోడీ ఇస్తుంటే, సీఎం జగన్ మందపాటి స్టిక్కర్ జగనన్న తోడు వేసి పత్రిక ప్రకటనలు ఇస్తున్నారు.