– కేంద్ర నిధులు తీసుకకుంటూ లేదనడం తల్లిపాముతాగి రొమ్ము గుద్దడమే
అమలు పరచవలసిన నిబంధనలను తుంగలోకి తొక్కి, దేశంలోనే అత్యధిక రుణాలు సేకరించిన జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కోసం రాజ్యసభ సభ్యులు విజయసాయరెడ్డి నిబంధనలను పక్కన పెట్టి , రాష్ట్ర జీఏస్డీపీ పైన అదనంగా 0.5% రుణాలు సేకరించడానికి కేంద్రప్రభుత్వం అనుమతించాలని కోరడం అంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని మరింత దిగజార్చడమే.
కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయం సముపార్జించిన మూలధన వ్యయం పైన, రెండవ త్రైమాసికంలో 45% వరకు ఖర్చు చేయాలనే నిబంధనలు పక్కకు పెట్టి , అదనపు అప్పుకు అర్రులు చార్చడం అంటే ములిగే నక్క పైన తాటికాయ వేయడమే.
14వ ఆర్డిక సంఘం సమయం ముగిసి 15వ ఆర్ధిక సంఘం నిబంధనల అమలుపరిచే ప్రస్తుత తరుణంలో, ఇంకా రెవిన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్ధిక సంఘం పేరు విజయసాయరెడ్డి ఉటంకిస్తున్నరు. కానీ
14వ ఆర్ధిక సంఘం 2020-21 నాటికి, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ లోటు నుండి బయట పడుతుందని అంచనా వేస్తే, ఇంకా రాష్ట్రం రెవిన్యూ లోటు కొనసాగే పాలన ఉండడం దౌర్భాగ్యం.
కేంద్రప్రభుత్వం నుండి వచ్చే నిధులు పక్కదోవ పట్టిస్తు, కేంద్రం నుండి నిధులు సరిగ్గా రావడం లేదు అని విజయసాయరెడ్డి అనడం చూస్తుంటే, పాలు తాగే దొంగ పిల్లి సామెత గుర్తు వస్తుంది.
– లంకా దినకర్
బీజేపీ నేత, ఆర్ధిక నిపుణుడు