తిరగబడకపోతే ప్రభుత్వానికి తెలివిరాదు.. తెలిసిరాదు!

కీలక పదవుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం చిన్న, పెద్ద స్థాయిల్లో ఉన్నవారంతా తిరగపడ వలసిందే లేకుంటే రాష్ట్ర మనుగడే ప్రశ్నార్థకం. .ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వి సి గారి మనోవేదన, పడిన బాధ, నరకయాతన మనమందరం పేపర్లలో, టీవీల్లో ,సోషల్ మీడియాలో చూసే ఉంటాం.
ఎటు పోతుంది ఈ రాష్ట్రం? ఏమైపోవాలి ఈ వ్యవస్థ? ఈ యంత్రాంగాన్ని ఎలా కాపాడాలి? చిన్నా,పెద్ద ఉద్యోగస్తులు తిరగబడండి. లేకపోతే ఈ ప్రభుత్వానికి కి తెలివి రాదు. తెలిసి రాదు.మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. మీ జీతాలు ఎక్కడికి పోవు. కానీ మీరు చట్టప్రకారం ధైర్యంగా నిలవకపోతే ,ధర్మం అమలు చేయకపోతే మొత్తం రాష్ట్రమే దెబ్బతింటుంది .చివరకు కోర్టులకు మీరే సమాధానం చెప్పాలి . దోషులు మీరే అవుతారు జరిగిన ప్రతి పరిణామానికి మీరే బాధ్యులు అవుతారు .
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి గారు చెప్పిన దాని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి తీసుకున్న, నాలుగు వందల కోట్లు రాష్ట్రానికి కాదు. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కొంత ఫండింగ్, విద్యార్థులు సంవత్సరాల నుండి వివిధ రకాల పేర్లతో యూనివర్సిటీకి చెల్లించినది.
ఆ డబ్బును నెల రోజుల పాటు రకరకాలుగా హింసించి, వేధించి అవమానపరిచి తీసుకోకపోతే ఏమి ? వైస్ చాన్సలరు గారు రూపాయి డబ్బులు లేకుండా యూనివర్సిటీని ఏ విధంగా నడపాలి? యూనివర్సిటీ కి సంబంధించిన ఖర్చులు ఆయన వివరంగా తెలియజేశారు. మీరు కనీసం యూనివర్సిటీ ఖర్చుల కైనా అడిగిన 175 కోట్ల రూపాయలు అయినా ఇచ్హి ఉండొచ్చు కదా ? వారికి ఖర్చు వచ్చినప్పుడు ఏమి చేయాలి? మీ చుట్టూ తిర గాలా? మీ సజ్జల చుట్టూ, సీఎం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలా ? ఆయన పడే నరకయాతన మీకు అర్థం కాలేదా ?
ఒకవైపు వర్సిటీ ఉద్యోగస్తులకు ఎనిమిదో తారీకు స్నాతకోత్సవం ఉంది. దానికి సన్నద్ధం కండి అని చెప్పి .. వి సి గారు తాకీదు పంపిస్తే,ఒట్టి చేతులతో ఏం చేస్తాం మీరు ప్రభుత్వానికి ఇచ్హిన 400 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత, మేము స్నాతకోత్సవం పనిలోకి వస్తామని తెగేసి చెప్పారు. పైపెచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ బయట ఆందోళన చేపట్టారు.
వారి ఆందోళనకు మద్దతుగా ఎన్జీవో జేఏసీ నాయకులు వర్సిటీ విసి గారి దగ్గరికి వెళ్లి వివరం కనుక్కుంటే.. ఆయన నేను మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అక్కడే కూర్చుని, నేను పడ్డ బాధ మీకు ఎవరికీ తెలియదని తన బాధను వెళ్లగక్కిన పరిస్థితి. ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదని వారి నిరసన కూడా తెలియజేశారు. వర్సిటీ ఉద్యోగస్తులు ఆందోళనకు మద్దతుగా నిలిచారు.
గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా నియమించిన వైస్ చాన్సలరు నే వీరు వారి అజమాయిషీలో పెట్టుకొని, 400 కోట్లు బలవంతంగా తీసుకున్నారంటే ఇక రాజ్యాంగానికి విలువ ఎక్కడుంది?ఈ విషయం అంతా వీడియో లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది. మీరు ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాకపోతే రిజైన్ చేసి పక్కకు తప్పుకుంటే, మీకు చెడ్డ పేరు తగ్గుతుంది. రాష్ట్రం, ప్రభుత్వం బాగుపడుతుంది. ఉద్యోగస్తులు , ప్రజలు బాగుపడతారు.

– కరణం భాస్కర్
బిజెపి
నెల్లూరు
మొబైల్ నెంబర్ 7386128877.

Leave a Reply