Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పరిపాలనకు ఆఖరి రోజులు

– ఆంధ్రప్రదేశ్ లో సోలార్ పవర్ కు భూములు లేవా?
– అరబిందో కంపెనీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ
– అఖిలపక్షం తో 50 లక్షల రూపాయల ఎమ్మెల్యే తీసుకున్నారు
– సీఎం జగన్ పరిపాలన పై మండిపడ్డ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి

ఖాజీపేట : జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు అయినది. ఆయన ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. టెండర్ వేసిన వారికి డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని కోర్టుకు వెళ్ల వద్దని. దీన్ని బట్టి ఆయన పరిపాలనకు ఆఖరి రోజులు గా అనుకోవచ్చు. సామాజిక న్యాయ యాత్ర మంత్రులకు కాదు ప్రజలకు చేయాలి.

17 మందికి సామాజిక న్యాయం చేసి అందరికీ చేశానని చెప్పడం సబబేనా? అమరావతి ని కోర్టు ఉత్తర్వులు ప్రకారం ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిందే. దావోస్ కు పోయి పవర్ ప్రాజెక్ట్ గతంలో ఇచ్చినది రద్దు చేసి, మళ్ళీ దాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టారు.అదానీ డీల్స్ అన్ని కుదుర్చుకొని 7000 కోట్ల సోలార్ పవర్ యూనిట్ 2.40 పైసలకు ఇచ్చారు 1.90 పైసలకు ఇచ్చే కంపెనీ లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2.40 పైసలకు పవర్ కొని ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సోలార్ పవర్ కు భూములు లేవా ఇతర రాష్ట్రాల్లో తయారుచేయడానికి? అరబిందో కంపెనీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ. సీఎం ఆలోచనలు ఆయనకే తెలియాలి..దావోస్ లో చేసుకున్న ఒప్పందాలు అన్ని ఫేక్. వివేకానంద రెడ్డి కేసు కూడా రివర్స్ లో చేస్తున్నాడు. ఉదయ్ అనే వ్యక్తి సీసీ కెమెరాల లో రికార్డ్ అయితే, ఆ వ్యక్తి తో పిర్యాదు చేపించి కేసు కాలయాపన చేస్తున్నారు. వివేకానంద రెడ్డి ని ఎవరు హత్య చేసింది సీఎం కు తెలుసు…

ఫీస్ రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదు, యాజమాన్యం ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలు రాయలేక పోతున్నారు. రాజశేఖర్ రెడ్డి పథకాలకు సీఎం తూట్లు పొడుస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తుంది. రైతు భరోసా లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది తక్కువ. 70 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉన్నారు.విద్యా దీవెన పథకం నీరు గారిపోతుంది.

ఆరోగ్య శ్రీ కి డబ్బులు ఇవ్వడం లేదు. రాజశేఖర్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అవ్వడాని కారణం అయిన పథకాలు నీరుగారుస్తున్నారు.108,104 లు సరిగా పనిచేయడం లేదు. నవరత్నాలు ఏమో గాని ప్రజల కు ముప్పు తెస్తున్నారు.మైదుకూరు మున్సిపాలిటీ లో అవినీతి పై 32 కోట్ల రూపాయల నిధులు మింగేశారు. సుధాకర్ యాదవ్ అవినీతి పరుడు కాదు. కాని ఆయన ఇప్పుడు అయినా పట్టించుకోవాలి.

వైసీపీ ప్రభుత్వం లో ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేపట్టలేదు. అఖిలపక్షం భూములను అమ్మి ఎమ్మెల్యే కు ముడుపులు ముట్టచెబుతున్నారు.మునిసిపల్ ఛైర్మెన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి, ఒక్క రూపాయి ఆదాయం లేక నష్టపోతున్నాడు.మాచునూరు చంద్ర దురదృష్ట వంతుడు.అఖిలపక్షం తో 50 లక్షల రూపాయల ఎమ్మెల్యే తీసుకున్నారు. చాపాడు మండలంలో MRO అవినీతికి పాల్పడితే చర్యలు లేవు. ఇసుక మాఫియా, విచ్చల విడిగా అవినీతి ఉంది.ప్రజలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే లను నిలదీసే పరిస్థితి నెలకొంది.

LEAVE A RESPONSE