Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్ వేసి పంపిణి

– పెట్రో ధరలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించటంలేదు
– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

లక్ష్మీపురం లోని బిజెపి కార్యాలయంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ…
భారత ప్రధాని నరేంద్రమోదీ జీ పరిపాలన ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన నేపధ్యంలో ఈ ఎనిమిది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో కేంద్రం తన వాత్సల్యాన్ని చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్దిలో భారత ప్రధాని పాత్ర ఆంధ్రప్రజలు మరువలేనిది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు కావడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేవలం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలోనే జరగడం ఒక విశేషం.

భారతదేశం రెండు దశల కరోనాను విజయవంతం ఎదుర్కొనడమే కాదు కరోనా సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతుంది పెట్రో ధరలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించటంలేదు? రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికి నిధులు కేంద్రం నుంచి వచ్చేవే కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్ వేసి పంపిణి చేస్తున్నారు శ్రీలంకకి, ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితిలో తేడా లేదని, తిరిగి చెల్లించే పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ కు లేనందున ఎక్కడా అప్పు పుట్టటం లేదని అన్నారు.

టిడిపి హయాంలో చంద్రన్న పేరుతో ఉన్న కేంద్రం అందిస్తున్న పధకాలకు, ఇప్పుడు జగనన్న పేరు పెట్టి ప్రజలను మాయ చేస్తున్నారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయిప్రజలపై మోయలేని పన్నుల భారం మోపి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు నరేంద్ర మోదీ 130 సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని నవరత్నాలుగా మార్చి అమలు చేస్తున్నారు.

ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు 7,937 మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం జరిగింది.జన ఆరోగ్యయోజన కింద ఎంపానల్డ్ ఆసుపత్రులు 53 గుర్తించడం జరిగింది. ఆసుపత్రుల పరిధిలో ఉచిత వైద్యం 24.56 లక్షల మంది వైద్యం నిమిత్తం కేటాయింపులు 6,765 కోట్లు. జాతీయ రహదారులు పొడవు మన రాష్ట్రంలో 7,784 కిలో మీటర్లు ఈశ్రమ్ కార్డ్స్ 53.61 లక్షలు ప్రధానమంత్రి జనధన్ యోజన కింద లబ్ధిదారులు 1,17,21,777 వారి ఖాతాల్లో బ్యాలెన్స్ లో 3,590.81 కోట్లు.* పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు 55,62,000 వారికి కేటాయించిన నిధులు 9,712 కోట్లు.

ఆత్మనిర్భర్ నిధి కింద కేటాయించిన రుణాలు చిరు వ్యాపారుల కోసం మన రాష్ట్రంలో 1,96,323 రుణాలు మంజూరు చేయగా దాని మొత్తం 209.47 కోట్లు. ప్రధాన మంత్రి మాతృవందన యోజన కింద నమోదైన లబ్ధిదారులు 13,30,776. ప్రధాన మంత్రి శ్రమయోగి, మాన్ ధన్ పధకాల కింద్ర నమోదైన వారు సంఖ్య 1,52,333వీరికి 27,397.26 కోట్లు ఉజాల యోజన కింద పంపిణీ చేసిన led బల్బులు 2,20,40,170 కోట్లు ఈ కారణంగా విద్యుత్ ఆదా 1,145 కోట్లు జరిగింది, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన మరియు ఉజ్వల 2.0 కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు 4,24,148. కరోనా వ్యాక్సినేషన్ మనరాష్ట్రంలో వేసిన డోసుల సంఖ్య 9,48,15,672.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో కేటాయించిన ఇళ్ల సంఖ్య 67,567 అందులో పూర్తి అయినవి 46,707. పట్టణాల్లో కేటాయించిన ఇళ్ళు 20,71,776 పూర్తిఅయినవి 5,00,960 ఇందులో కేంద్ర వాటా కింద కేటాయించిన నిధులు 31,555.35 కోట్లు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో నిర్మిచింన మరుగుదొడ్లు 42,70,362. సుకన్య సమ్రుద్ది యోజన కింద నమోదైన ఖాతాలు 13,21,235 ఈ ఖాతాల్లో పొదుపు చేసిన మొత్తం 8,052 కోట్లు. ఈనామ్ కవరేజ్ కింద రాష్ట్రంలో 33 మార్కెట్లు గుర్తించడం జరిగింది

జల్ జీవన్ మిషన్ కింద గ్రుహాలకు కుళాయి కనెక్షన్లు సుమారు 25 లక్షలకు పైగా ఇళ్లకు మంజూరు చేయడం జరిగింది.పిఎం కేర్స్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ లో 351 మంది కోవిడ్ భాదిత అనాథ చిన్నారులకి చేయూత. సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కంతేటి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి రాచుమల్లు భాస్కర్, రాజేష్ నాయుడు, ఆవుల రామకోటేశ్వరరావు వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE