Suryaa.co.in

Entertainment

స్వర్గపురికి పాటలపల్లకిలో!!!

ఆజారే పరదేశీ…
“ఇలా ఏ దివ్యలోకాల నుంచి వచ్చిందో పిలుపు…”

అచ్చా తో హమ్ చల్తీ హై…
“అంటూ తరలిపోయింది
గానకోకిల…”

ఫిర్ కబ్ మిలేంగే…
“అంటే బాధ ఏలా…
ఉందిగా యాభై వేల
పాటల మేళా…!”

ఎప్పుడు ఇచ్చిందో
చుప్కే సే దిల్ దేదే అంటూ
హో జాతా హై ప్యార్…!
పాటలతోనే మనువు…
ఆ పాటల్లోనే బ్రతుకుతెరువు…!

“మనసు వికలమై
బాధల్లో నువ్వున్నప్పుడు…”
“చుట్టూ కారుచీకట్లు కమ్మిన”…
భీగిభీగీ రాతోన్ మే…
లతాజీ పాట ఎంత స్వాంతన…
“ఆమె గళంలో లాలిత్యం…”
“అందులోని అమ్మతనం…”
ఆ పాటలు వింటుంటే
అమ్మ ఒడిలో తలపెట్టి
ఊరటనొందినట్టే…!

ఆమె పాట తోడుంటే
అబ్ తో హై హర్ ఖుషీ అప్నీ
సున్ సయిబా సున్…
మైనే తుజే సున్లియా
తూనే ముఝు సున్…
“ఆమె గళం
మనం లక్షసార్లు విన్నాం”
ఉండమ్మా ఇంకొన్నాళ్లని
మొరపెట్టుకున్నా
నా పాటలు వింటూ
నిదురపోరా తమ్ముడూ
ఆంటూ తానెళ్ళింది…
శాశ్వత నిద్రలోకి…
తన పాటను తానే వింటూ!

సత్యం శివం సుందరం…
షో మాన్ అభిరుచికి
ఆ సినిమాలోని కళాత్మకతకు
ప్రాణం పోస్తూ
లతమ్మ స్వరం…
హృదయాలలో
చీకట్లను పారద్రోలుతూ
ఆనంద జ్యోతులను
వెలిగించే భాస్వరం..

లతాజీ…అరలక్ష పాటలు
నీతో అనలేదా…
హమ్ బనే తుమ్ బనే
ఎక్ ధూజే కే లియే అని…
మరెలా వెళ్లిపోయావమ్మా…
స్వర్గపురి నుంచి
వచ్చిందా సందేశం…

సెహర్ మే చర్చా హై అని…
లక్ష్మీకాంత్ ప్యారేలాల్ జంటతో మ్యూజిక్ సిట్టింగా…
ఆనంద్ బక్షీ కూడా అక్కడేనా
రఫీ జీ,ముఖేష్ భయ్యా…
మా బాలూ…
అందరూ ఇప్పుడు అక్కడేగా ?
మరి మాకిచ్చిన మాట…
మైన్ తేరే ఇష్క్ మే…
మర్నా జావూన్ కహీన్ అని…
ఏ దిల్ తుమ్ బిన్ కహీన్…
నువ్వెళ్ళినా నీ పాటలతో
మేమున్నంత కాలం
తేరే బినా జిందగీసే కోయీ…!

అన్నట్టు మధురిమలొలికే నీ స్వరపేటిక…
యాభై వేల పాటల పీఠిక…
ఎవరో ఇన్సూర్ చేసుకున్నారని…

నీ గళంలో ఏ మూలన అమృతభాండం దాగుందో ఆ గుట్టు విప్పుదామని…
(చిన్నప్పుడు విన్నాం ఆ మాట మాకు తెలుసు)
ఎప్పుడో శివుని గళంలో గరళమెంతుందో…
నీ స్వరంలో అంత సుర ఉందని…
అది ఎప్పటికీ ఈ భువిపై నీ పాటల రూపంలో అలా ప్రవహిస్తూనే ఉంటుందని…!!!

అమరగాయని, అమృత వర్షిని పూజ్య “లతాజీ” కి అశ్రుతర్పణ…నివాళి అర్పిస్తూ…

-ఎలిశెట్టి సురేష్ కుమార్,
విజయనగరం,
9948546286

LEAVE A RESPONSE