– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు.
నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు