-ఆయన లోటు పూడ్చలేనిది
-రాష్ట్రం ఓ బీసీ ఉద్యమ నేత ను కోల్పోయింది
-టీడీపీ ఆఫీసులో బచ్చులకు నేతల నివాళి
మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి సంతాపం తెలియజేసే కార్యక్రమం జరిగింది. అనంతరం తెలుగు దేశంనాయకులు,దళిత ముద్దు బిడ్డ, ప్రజల మనిషి దివంగత జి.యం.సి బాలయోగి వర్ధంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి వర్యులు నక్కా ఆనంద బాబు , మాజీ శాసన మండలి సభ్యులు TD జనార్ధన్ ,టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిలు మద్దిరాల జోసెఫ్ ఇమ్మనియేలు(మాని), బుచ్చి రామ్ ప్రసాద్ , రాష్ట్ర పార్టీ కార్యదర్శి AV రమణ, తెలుగుదేశం పార్టీ వాణిజ్య భాగం అధ్యక్షుడు నుండి రాకేష్, ఆహ్వాన కమిటీ సభ్యులు హాసన్ బాషా, పరుచూరి కృష్ణా,NRI కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని శంకర్ నాయుడు, వల్లభనేని ప్రసాద్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది