-సీపీఎస్ రద్దు చేస్తే నా స్టూల్ కూడా ఇచ్చేస్తా
-ఏపీని గంజాయి కి హబ్ గా జగన్ రెడ్డి మార్చేశాడు
-జగన్ రెడ్డి పేరు నేటి నుండి గంజాయి మోహన్ రెడ్డి
-గంజాయిని ఎక్కువగా సరఫరా చేస్తున్నందుకు పెద్దిరెడ్డిని పెద్దాయన అనాలా?
-శివశక్తి సంస్థ రైతుల కష్టార్జితం 20 కోట్ల రూపాయలు దోచుకుంది
-ఇసుకపైన పెద్దిరెడ్డి 1000 కోట్ల రూపాయలు సంపాదించారు
-ప్రతి 33కిలోమీటర్లకు ఒక కేసు పెడుతున్నారు…అయినా సరే తగ్గేదే లే
-చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, కొత్తపేట బహిరంగసభలో యువనేత నారాలోకేష్
పుంగనూరు ప్రజలు, కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. మీ ఉత్సాహం…ఉత్తేజం చూస్తుంటే 2024లో ఈ నియోజకవర్గంలో పసుపుజెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది. ఇక్కడి ప్రజల దాహం తీర్చడానికి ఒక చెరువు ఉంది. ఆ చెరువుకు గండి పడితే పుంగమ్మ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలను కాపాడింది.ఇటువంటి గడ్డపై నేను పాదయాత్ర చేయడం నా అదృష్టం. యువగళం ప్రారంభమై 33రోజులే అయ్యింది…దీన్ని చూసి తాడేపల్లి పిల్లి ఇంట్లో టీవీలు పగులకొడుతున్నాడు.నా యాత్ర చుట్టూ 20మంది ఎస్సైలు, 10మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలు, ఇంటెలిజెన్స్ అధికారులు, వజ్ర వాహనం… ఇంతమంది ఎందుకయ్యా జగన్ రెడ్డీ? జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు చివరకు పోలీసులు కూడా బాధితులే.
నేను టెర్రరిస్టును కాదు..వారియర్ ని. గతంలో ఊరూరా తిరుగుతా నిరుద్యోగులకు 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేరిస్తే నా మైక్ వెహికల్ నీకు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేశారు..ఇప్పటికైనా ఇస్తే నా మైక్ ఇస్తా.ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి మాట తప్పావ్…అవి అమలు చేస్తే నా సౌండ్ వెహికల్ నీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా..ప్రతియేటా మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు…దాన్ని అమలు చేస్తే నా మైక్ ఇస్తా. 2024మే నెలలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.2025 జనవరి కి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యతను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇస్తున్నా. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మాట తప్పాడు. సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు.ఇవన్నీ అమలుచేస్తే జగన్ రెడ్డికి నా మైక్ ఇచ్చేస్తా.నిత్యావసరాల ధరలు పెరుగుదలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…ధరలు తగ్గిస్తే నా మైక్ ఇస్తా.
సీపీఎస్ రద్దు చేస్తే నా స్టూల్ కూడా ఇచ్చేస్తా. పోలీసులకు కూడా అనేక సమస్యలున్నాయి. వాటిని మేం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తాం. కొంత మంది పోలీసులు వైసీపీ నాయకులు మాట విని మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు.మేం అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేస్తాం..వాళ్లని సర్వీస్ నుండి తొలగించే బాధ్యతను నేను తీసుకుంటా. ఏపీని గంజాయి కి హబ్ గా జగన్ రెడ్డి మార్చేశాడు.మహిళలు, యువతులను కూడా గంజాయికి వైసీపీ నాయకులు బానిసలుగా చేస్తున్నారు. ప్రధాని, నార్కోటిక్ బ్యూరో అధికారులకు ఏపీలో పరిస్థితులపై లేఖ రాశాను. త్వరలోనే చర్యలు తీసుకుంటారు.చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి గంజాయిని అరికట్టేశామని వీరోచితంగా చెబుతున్నపుడే చంద్రగిరి పాఠశాలలో చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది.ఏం సమాధానం చెబుతావ్ మిస్టర్ ఎస్పీ?
ఏపీని గంజాయిగా మార్చిన సీఎం జగన్ రెడ్డి పేరు నేటి నుండి గంజాయి మోహన్ రెడ్డి.ఏపీలో ఉన్న పరిస్థితులను చూసి గతంలో మనం తెచ్చిన కంపెనీల్నీ రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయి. కొత్త కంపెనీలు పెట్టబడులు పెట్టడానికి రావడం లేదు. మేం తెచ్చిన ఫాక్స్ కాన్ కంపెనీ నిన్న తెలంగాణాకు వెళ్లిపోయింది. లక్షమందికి ఉద్యోగాలిచ్చే పరిశ్రమ తరలిపోయింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ అనే కల్తీ మద్యాన్ని తెచ్చాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేర్లతో రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు. వైసీపీ పాలనలో పుంగనూరులో మైనారిటీలపై 12మందిపై కేసులు పెట్టారు.రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అధికారంలోకి వచ్చాక 10మంది మైనారిటీలను హత్యచేశారు. అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బా, ఇబ్రహీం లను వైసీపీ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది.
దుల్హన్ పథకం, రంజాన్ తోఫా అన్నింటినీ జగన్ రెడ్డి రద్దు చేశాడు. చంద్రబాబు అధాకారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ను తెస్తాం.బీసీల రిజర్వేషన్లను జగన్ రెడ్డి తగ్గించాడు, ఆదరణ పథకాన్ని రద్దు చేశాడు. మీకు అండగా నిలబడింది ఏ ప్రభుత్వం…మోసం చేసింది ఏ ప్రభుత్వం అనే విషయాన్ని బీసీలంతా ఆలోచించాలి. దళితులను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి డోర్ డెలివరీ చేశాడు. అతనొక గంజాయి స్మగ్లర్. రాయలసీమకు పట్టిన శని ఈ గంజాయి మోహన్ రెడ్డి.ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా జగన్ రెడ్డి పూర్తిచేయలేదు..ఇతనొక దద్దమ్మ.అప్పర్ తుంగభద్ర పై కర్నాటకలో ప్రాజెక్టు కడుతున్నారు. అది పూర్తయితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు విప్పలేదు. పుంగనూరు లో పీ3 ఫార్ములా అమలవుతోంది. పుంగనూరు, పెద్దిరెడ్డి, పాపాలు…ఈ నియోజకవర్గంలో ఒక్క పనికూడా జరగలేదు.
పెద్దిరెడ్డిని ఎవరైనా పెద్దాయనా అనాలంట. భూములు దోచినందుకు, ఇసుక తిన్నందుకు, మట్టిమాఫియాను ప్రోత్సహించినందుకా?గంజాయిని ఎక్కువగా సరఫరా చేస్తున్నందుకు పెద్దిరెడ్డిని పెద్దాయన అనాలా? పిఎల్ఆర్ కాంట్రాక్టు ఎవరూ తీసుకోవడం లేదు. గతంలో ఒక వైసీపీ నాయకుడు తీసుకున్నాడు. పనులు చేశాడు. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ కోసం మిగతా డెయిరీలను నాశనం చేస్తున్నాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు…దీంతో రైతులు ఆవులను అమ్మేసుకున్నారు.రెండున్నర ఏళ్లలో శివశక్తి సంస్థ రైతుల కష్టార్జితం 20 కోట్ల రూపాయలు దోచుకుంది.రాష్ట్రమంతా అమూల్ కంపెనీలను పెట్టిన జగన్ రెడ్డి…పుంగనూరులో మాత్రం పెట్టలేదు. కేవలం పెద్దిరెడ్డి కోసమే.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారు…పుంగనూరును ప్రక్షాళన చేస్తాం…పాపాలన్నిటికీ చెక్ పెడతాం. పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు సుదీర్ రెడ్డి పల్ప్ కంపెనీ కోసం మామిడి రైతులు పంట తమకే అమ్మాలని బెదిరిస్తున్నారు. బయటివారికి మామిడి పంటను అమ్మకుండా పెద్దిరెడ్డి అడ్డుపడుతున్నాడు… బెదిరించి లాక్కున్నాడు. మామిడి రైతుల నుంచి మూడేళ్ల కాలంలో పెద్దిరెడ్డి సంస్థ 100 కోట్ల రూపాయల దోచుకుంది. కల్లూరులో 5ఎకరాల భూములను దేవుడి భూమిని పెద్దిరెడ్డి మనుషులు దోచేశారు. అడ్డుపడినందుకు ఈఓను బదిలీ చేశారు. వెంకటరెడ్డియాదవ్, నాగభూషణం, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు పుంగనూరు నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నారు.వారికి భయపడి రైతులు రాత్రివేళ టార్చి లైట్లు వేసుకుని తమ భూములకు కాపలా కాసుకుంటున్నారు.300ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా పెద్దిరెడ్డి దోచేశాడు… ఈ భూమి విలువ రూ.500 కోట్లు.పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు క్వారీ నిర్వహించుకోవాలన్న మంత్రి పెద్దిరెడ్డికి 50 శాతం కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. ఈ కమీషన్ల రూపేణా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు సంపాదించారు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు దోచుకున్నారు.పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి ఇసుక అక్రమంగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నారు.ఇసుకపైన పెద్దిరెడ్డి 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. మొత్తంగా గత నాలుగేళ్లలో పెద్దిరెడ్డి దోచుకున్న పాపపు సొమ్ము విలువ రూ.10వేలకోట్లు.పెద్దిరెడ్డి చేసిన పాపాలన్నీ బయటకు తీస్తాం…పెద్దిరెడ్డి దోచుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టి వాటిని పుంగనూరు ప్రజల కోసం ఖర్చు చేస్తాం. పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి అడుగడుగునా ఇబ్బందిపెడుతున్నారు. వారందరి పేర్లు నేను రాసుకుంటున్నా.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..చివరకు పెద్దిరెడ్డిని కూడా వదిలిపెట్టం. భయం మా బయోడేటాలో లేదు పెద్దిరెడ్డి….నువ్వు ఏం చేస్తావో చేస్కో…ఈ లోకేష్ తగ్గే ప్రసక్తే లేదు.పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. పాడి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించే బాద్యతను మేం తీసుకుంటాం. నెట్టిగుంటపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న రిజర్వాయర్ కోసం 100మంది రైతుల భూములు లాక్కున్నారు. చీనీ చెట్లను కూడా కొట్టేశారు.భూములు కోల్పోయిన వారందరికీ మేం అధికారంలోకి వచ్చాక పరిహారం చెల్లిస్తాం.పుంగనూరులో రోడ్లు, తాగునీటి సదుపాయాలు మేం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తాం.నేను మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఏనాడూ నన్ను ఏమీ అడగలేదు.అయినా నేను ఈ పుంగనూరుకు రూ.100కోట్లు కేటాయించాను. వాటికి కూడా పెద్దిరెడ్డి అడ్డుపడ్డాడు.
పుంగనూరులో తెలుగుదేశం జెండా ఎగరేయండి…మీకు అభివృద్ధి అంటే ఏంటో మేం చూపిస్తాం. గత 30ఏళ్లలో పెద్దిరెడ్డి వల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? ఈ నియోజకవర్గానికి పెద్దిరెడ్డి చేసింది సున్నా.2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించి..చల్లా బాబుకు మీరు అండగా నిలబడడండి. నేను జిల్లా దాటాక మీ గడపలకు చల్లా బాబు వస్తాడు..ఆశీర్వదించండి..దీవించండి.మీ జీవితాల్లో మార్పులు రావాలంటే అది పసుపుజెండాతోనే సాధ్యం..పసుపు జెండాను ఎగరేయండి…ఇక్కడి పాపాలను మేం అరికడతాం. కార్యకర్తలెవరూ కేసులకు భయపడొద్దు…నాపైనా 20కేసులున్నాయి. అయినా నేను ఏమీ భయపడేది లేదు….అన్నీ తప్పుడు కేసులే. నేను పాదయాత్ర చేస్తున్నా..కానీ పరదాలు కట్టడం లేదు.వైసిపి పాలనలో వేధింపులకు గురై కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు, నాయకులకు అధికారంలోకి వచ్చాక గుర్తించి గౌరవిస్తాం. నా పాదయాత్రలో ప్రతి 33కిలోమీటర్లకు ఒక కేసు పెడుతున్నారు…అయినా సరే తగ్గేదే లే. మై డియర్ జగన్ సహకరిస్తే నాది పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్రే. పుంగనూరు పెద్దిరెడ్డిని…తాడేపల్లి పిల్లిని శాశ్వతంగా ఇంటికే పరిమితం చేయండి.