-ఎవరి చర్చలు వారు చేస్తున్నారు పవన్ మాతోనే ఉన్నారని చెప్పారు కదా
-ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు చెప్పి ప్యాకేజ్ కి ఒప్పుకున్నారు
-అమరావతే రాజధాని
-వైసీపీపై చార్జిషీట్ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
గుంటూరు : బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద వైసీపీ ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల, అవినీతి అక్రమాలపై అభియోగాల స్వీకరణ, ప్రజా చార్జిషీట్ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు ఏమన్నారంటే.. గ్రామ స్థాయి నుండి ప్రభుత్వంపై ఛార్జ్ షీట్స్ వేస్తున్నాం.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
ఛార్జీ షీట్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ముఖ్య మంత్రి కాన్వాయ్ ని అడ్డు కున్న బిజెపి నేతలు పై, పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఈవిధంగా వ్యవహరిస్తే ప్రతి ప్రాంతం లో అడ్డుకుంటాం.ఈ ప్రభుత్వం లో సహజవనరుల దోపిడీ జరుగుతోంది. కేంద్రం నిధులు ఇచ్చి నా ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు.
గుంటూరు కార్పొరేషన్ కు ఇచ్చిన నిధులు ఏం చేశారు?ఆయుర్వేద కళాశాల ఏర్పాటు కు ముఖ్య మంత్రి కనీసం సమీక్ష చేయడం లేదు.సంప్రదాయ వైద్య విధానం పై ముఖ్యమంత్రి వైఖరి ఏంటని ప్రశ్నించారు.అన్ని అంశాలు పై ఛార్జిషీట్ వేస్తాం.19న గన్నవరం సమావేశంలో రాష్ట్ర స్థాయి ఛార్జ్ షీట్ ప్రకటిస్తాం.ప్రభుత్వ అవినీతి, అసమర్థ కార్యక్రమాలను ఎండగడతాం.
నెల్లూరులో మా నేతను పోలీసులు తీవ్రంగా హింసించారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం. టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వకపోవటం అనేది పెద్ద అవినీతి కార్యక్రమం.రైతులను రోడ్డు పై నిలబెట్టారు.ఆయుష్ ఆసుపత్రిని కట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం స్థలం ఇవ్వటానికి సిద్దంగా లేదు.నేచురల్ క్యూర్ విధానాలను పూర్తిగా పక్కన పెట్టారు.ఎయిమ్స్ కూడా నీరు ఇవ్వటం లేదు.
పవన్ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని పెద్దలకు తెలియజేస్తాం.బిజెపితో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఎవరి చర్చలను వారు చేస్తున్నారు. మాది కేంద్ర పార్టీ. కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.ప్రభుత్వ అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నాం.
అమరావతే రాజధాని. రాజధానిలో 50000 కోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నాం. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు చెప్పి ప్యాకేజ్ కి ఒప్పుకున్నారు.
జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ప్రజా చార్జిషీట్ కార్యక్రమంలో వెస్ట్ అసెంబ్లీ కన్వీనర్ తోట రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపరాణి, మకుటం శివ, ధారా సాంబయ్య, టీవీ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు అప్పిశెట్టి రంగారావు, ఆర్ భాస్కర్, కుమార్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఈమని మాధవరెడ్డి, మంత్రి సుగుణ, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, వనమా నరేంద్ర, పోతురాజు వెంకట్, ఈదర శ్రీనివాసరెడ్డి, కొక్కెర శ్రీనివాస్, కత్తి సరోజిని, రమాదేవి, దర్శనపు శ్రీనివాస్, దారా అంబేద్కర్, పెద్దఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.