Suryaa.co.in

Telangana

డబ్బుల కోసం గంజాయి సాగును చట్టబద్దం చేస్తారేమో?

– హిమాచల్ మోడల్‌ను తెస్తారా?
– ఉద్యోగులకు పీఆర్సీ లేదు, డీఏ లేదు
– మీరు వేసిన ఒక్క కొత్త రోడ్డు చూపెట్టూ.
– ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మరి అప్పు దేనికోసం తెచ్చారు?
– బీఆర్ ఎస్ నేత డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి

హైదరాబాద్: హిమాచల్ లో కాంగ్రెస్ అధికారం లో ఉంది. అక్కడ నిధుల కోసం గంజాయి సాగును చట్టబద్దం చేసే చట్టం తెచ్చారు. తెలంగాణ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల కోసం హిమాచల్ మోడల్ ను అమలు చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఒక్క కొత్త స్కీమ్ పెట్టలేదు.9 నెలల కాలంలో 75 వేల కోట్ల అప్పు తెచ్చారు.తెచ్చిన అప్పును ఏ స్కీంకు పెట్టారు? ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మరి అప్పు దేనికోసం తెచ్చారు? బీఆర్ఎస్ పార్టీ ముందు నుండే చెప్తోంది .కాంగ్రెస్ వి .అలవి కానీ హామీలు అని నిజంగానే వాళ్లు ఇచ్చిన హామీలు చేస్తే అమలు చేస్తే ఇంకా ఎన్ని అప్పులు తేవాల్సి ఉంటుంది? కేసీఆర్ హయం లో ఓ సెక్రటేరియట్ ,కమాండ్ కంట్రోల్ సెంటర్ ,యాదాద్రి పునర్నిర్మాణం లాంటివి కండ్ల ముందు కనిపిస్తున్నాయి కేసీఆర్ తెచ్చిన అప్పులను ఆస్తులను పెంపొందించేందుకు వాడారు.

మీరు తెచ్చిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. గత ప్రభుత్వం అప్పులు అప్పులు అంటున్నారు. మరి మా ప్రభుత్వం అప్పులు తెచ్చి ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఆనాడు ఆస్తులు పెంచి అందరికి పంచాం. మీరు ఒక్క స్కీం లేదు కానీ, పదుల సంఖ్యలో స్కామ్ లు అయ్యాయి. రుణమాఫీ కోసం అప్పు చేశాం అంటున్నారు రుణమాఫీ ఎవరికి అయింది? ఎంతమందికి అయింది? శ్వేతపత్రం విడుదల చేయాలి.

రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ తూ.. తూ.. మంత్రంగా చేశారు. దానికి సవాలక్ష కొర్రీలు పెట్టారు. రైతులు అరిగోస పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ లేదు, డీఏ లేదు.మరి అప్పులు ఎవరి కోసం చేశారు.? మీరు కట్టిన ఒక్క బిల్డింగ్ చూపెట్టండి. మీరు వేసిన ఒక్క కొత్త రోడ్డు చూపెట్టూ.

బిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి ఆస్తులు సృష్టించింది. తెచ్చిన అప్పులు మూలధన పెట్టుబడిగా పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ లో అప్పుల పై శ్వేత పత్రం విడుదలలో 4 రకాల అప్పులను చూపించారు. అందులో రెండు రకాల అప్పులను, ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేతపత్రంలో స్పష్టం చేశారు.

ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పులు రు.1,54,876. వారస్వంతంగా వచ్చిన అప్పులు రు.72,658. తెలంగాణ ఏర్పడ్డాక ముందు spv (స్పెషల్ పర్పస్ వెహికల్స్) ద్వారా చేసిన అప్పులు 11,609 కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల అప్పును కూడా శ్వేత పత్రంలో జమ చేశారు. అది రు.6115 కోట్లు.

తొమ్మిదిన్నర ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 4,26,499 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చి డిస్క్మ్ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడం వలన. రు.41,159 కోట్లు.మొత్తం రు.3,85,340 కోట్లు.

బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి .మూలధన పెట్టుబడి సంక్షేమం కోసం చేసిన అప్పు. ఇందులో అప్పు చేసి పప్పు అన్నం తినలే . చేసిన ప్రతి రూపాయికి వెయ్యి రూపాయలని కూడబెట్టినము. అవి మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. పాలన చేత కాక అప్పుల పేరు చెప్పి తెలంగాణ సమాజాన్ని ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు.

అప్పుల పై ఆర్ బి ఐ విడుదల చేసిన రిపోర్టులో తెలంగాణ కింది నుండి ఆరవ స్థానం లో ఉంది. మన కన్నా 22 రాష్ట్రాలు అప్పుల లో ముందు ఉన్నాయి. అప్పుల లలో మొదటి రాష్ట్రం తమిళనాడు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, మహారాష్ట్ర కూడా అప్పుల్లో ఉన్నాయి .

LEAVE A RESPONSE