Suryaa.co.in

Telangana

టి ఆర్ ఎస్ కి గుణపాఠం: కిషన్ రెడ్డి

హుజురాబాద్ ఎన్నికల్లో బి జె పి అత్యధిక మెజారిటీ తో విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ……హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ 21865 ఓట్ల ఆధిక్యం తో టి ఆర్ ఎస్ పై విజయం సాధించారు . ఈ ఎన్నికలు ముఖ్యమైనవి, విలువైనవి. ఈ ఎన్నికల గెలుపు హుజురాబాద్ ప్రజాలందరింది, వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ విజయం హుజురాబాద్ ప్రజలకు చెందుతుంది.
అన్ని రకాల ప్రలోభాలకు గురిచేసిన టి ఆర్ ఎస్ కి గుణపాఠం ఈటల రాజేందర్ ని గెలిపించి హుజురాబాద్ ప్రజలు బి జె పి యొక్క సత్తా ను నిరూపించి, తెలంగాణ రాష్ట్రం లో హుజురాబాద్ ఎన్నికల పై సరికొత్త చరిత్ర సృష్టించారు.గత 40 ఏళ్ళ రాజకీయాల్లో ఇటువంటి ఎన్నికలు ఎక్కడ చూడలేదు.
హుజురాబాద్ ప్రజలకు డబ్బులు ఎరగా వేసినా , బెదిరింపులకు గురి చేసినా, ఈటల రాజేందర్ ని గెలిపించుకుంటాం అని ప్రజలు అన్నారని, ఒక సర్వే ప్రకారం 60 శాతం మహిళలు బి జె పి కె తమ ఓటు ను వేస్తామని, వారి అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు.
టి ఆర్ ఎస్ పార్టీ రైతులు, బడుగు బలహీన వర్గాలు, వివిధ సామాజిక వర్గాలకు వివిధ పధకాలు ప్రకటించి వారిని ప్రలోభాలకు గురి చేసిన, హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎపుడు లెన్నన్ని ప్రాజెక్టులను ఎన్నికల సమయం లో ప్రవేశపెట్టారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు కి సరైన నిర్వచనం, సరైన నాయకుడిని ఎన్నుకొని హుజురాబాద్ ప్రజలు ఓటు యొక్క విలువని నిరూపించారు.హుజురాబాద్ ఎన్నికలలో ప్రజలు మంచి నాయకుడిని , నైతిక విలువలు కలిగిన బి జె పి ని ఎన్నుకొని కుటుంబ పాలన కు చరమగీతం పలికారు. చివరిగా భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE