– ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే
-సర్కారుకు వ్యతిరేకంగా అందరూ కలవాల్సి ఉంది
– పొత్తులపై అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాకినాడ : సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పర్యటనలో ఉన్న బాబు.. శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ఈ సందర్భంగా బాబు తేల్చిచెప్పేశారు.