Suryaa.co.in

Political News

ఇండియాలో ఏ రాష్ట్రం ఎంత పింఛన్ ఇస్తుందో చూద్దాం

ఏపీలో ఇస్తున్న పెన్షన్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు బహు తక్కువ. పెన్షన్లపై నిజానిజాలివి.
ఆంధ్రప్రదేశ్ – రూ.2,250 (జనవరి1, 2022 నుంచి రూ.2,500)
తెలంగాణ – రూ.2, 016
(మన రాష్ట్రం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. అయినా..మన కంటే తక్కువ పింఛన్ ఇస్తున్నారు)
తమిళనాడు – రూ.1000
(మన రాష్ట్రం కంటే ధనిక రాష్ట్రం, మన రాష్ట్రం కంటే ఎక్కువ అప్పులు తెచ్చుకున్న రాష్ట్రం. అంతేకాదు..సంక్షేమానికి పెద్ద పీట వేసే డీఎంకే అధికారంలో ఉన్న కూడా వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారు)
ఉత్తర ప్రదేశ్ – రూ.800
( మన రాష్ట్రం కంటే పెద్ద రాష్ట్రం. మన రాష్ట్రం కన్నా కూడా అప్పులు ఎక్కువ తెచ్చుకున్న రాష్ట్రం. పైగా బీజేపీ అధికారంలో ఉంది. మోదీ, యోగి తలచుకుంటే ఎంత పింఛన్ అయినా ఇవ్వగలరు. అక్కడ పింఛన్ రూ.800లే. ఎన్నికలు దగ్గర్లో ఉన్నా..పింఛన్ పెంచే అవకాశం లేదు.)
మహారాష్ట్ర – రూ.600
(మన రాష్ట్రం కంటే ధనిక రాష్ట్రం. వాణిజ్యంలో దేశంలోనే టాప్‌. దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఈ రాష్ట్రంలోనే ఉంది. అంతులేని ఆదాయం. అయినా..పింఛన్ రూ.600లే)
బిహార్‌ – రూ.400
(మన కంటే బీద రాష్ట్రం. కానీ..మరీ రూ.600 పింఛన్ అంటే దారుణం. ఈ రాష్ట్రంలో నితీష్‌తో బీజేపీ అధికారం పంచుకుంటుంది. అయినా…పింఛన్ రూ400.)
కర్ణాటక – రూ.400
(మన రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం. మన కంటే ధనిక రాష్ట్రం. మన కంటే అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. బీజేపీ అధికారంలో ఉంది. వారు అనుకోవాలి కానీ..2 వేలు కాదు 3 వేలు కూడా పింఛన్ ఇవ్వగలరు. కానీ..కర్ణాటకలో రూ.400లే పింఛన్).
చూశారుగా వాస్తవాలు ఇలా ఉంటే.. ఎల్లోమీడియా, ఎల్లోస్‌ కావాలని అబద్దాలు చెబుతూ, అబద్దాలు ప్రచారం, ప్రసారం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు అవ్వాతాతల మీద ప్రేమ ఉంది కాబట్టి పింఛన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచారు. మన కంటే ధనిక రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి?

– బాల్షాహిద్

LEAVE A RESPONSE