పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం
కులమతాలకు అతీతంగా అందరి పండుగ వినాయకచవితి
కోవిడ్ నిబంధనలు పాటించాలి
దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఏ శుభకార్యం చేసినా తొలి పూజ వినాయకుడికే చేస్తాం.. ఆరాధిస్తాం.. సిద్ధిని, బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటాం.. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తు ఎంతో వేడుకగా జరుపుకోవాలని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
గురువారం బ్రహ్మణవీధిలో జమ్మిదొడ్డి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి షేక్ రహమతున్నీసా తో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు…. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగిద్దాం, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుంద్దాం అని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో వైసీపి శ్రేణులు తదితరులు ఉన్నారు.