విజయవాడలో అంకుర హాస్పిటల్ ను ప్రారంభించిన సోను సూద్

విజయవాడలో మహిళలు, పిల్లల కోసం అడ్వాన్స్ డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
తెలుగు రాష్ట్రాల్లో అంకుర హాస్పిటల్స్ 11వ కేంద్రం
110 బెడ్ మరియు 70000 చ.అ.ల హాస్పిటల్ అత్యుత్తమ వైద్య సదుపాయాలతో, అర్హత కలిగిన వైద్య వృత్తినిపుణులను కలిగిఉంది
విజయవాడ, 9 సెప్టెంబర్ 2021: విజయవాడలో అంకుర హాస్పిటల్ మొదటి సెంటర్ ను భారతీయ నటుడు, నిర్మాత, మానవతావాది, అంకుర హాస్పిటల్ ప్రచారకర్త సోను సూద్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు, పిల్లలకు ప్రత్యేకించబడిన అంకుర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్ యొక్క 11వ కేంద్రం.
హాస్పిటల్ ప్రారంభోతవ్సవ కార్యక్రమంలో విజయవాడ (తూర్పు) నియోజకవర్గం ఎమ్మెల్యే  గద్దె రాంమోహన్, విజయవాడ (సెంట్రల్) నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌరవనీయ ఎమ్మెల్సీ, బీసీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి, పెదకూర పాడు నియోజకవర్గం గౌరవనీయ ఎమ్మెల్యే  నంబూరి శంకరరావు, పెనమలూరు నియోజకవర్గం గౌరవ నీయ ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (స్పెషల్ యూనిట్) డైరెక్టర్, ఐపీఎస్ అధికారి  ఆవుల రమేశ్ రెడ్డి, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జ్ గౌరవ నీయ  దేవినేని అవినాష్, గౌరవనీయ విజయవాడ డివిజన్ -8 కార్పొరేటర్ చెన్నుపాటి ఉషా రాణి కూడా పాల్గొన్నారు.
అంకుర హాస్పిటల్స్ అనేది డజన్ల కొద్దీ అధునాత పిడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీస్ కు నిలయంగా ఉంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది రోగులు ఇక్కడికి వస్తుంటారు. విజయవాడలో 24/7 ఎమర్జెన్సీ కేర్, ఆన్ సైన్ అటెండింగ్ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, నియోనాటలజిస్ట్ లతో ఉన్న అతి కొద్ది పిడియాట్రిక్ అండ్ నియోనాటల్ ఐసీయూలలో ఒకటైన అంకుర చిన్నారులు, నవజాత శిశువుల క్రిటికల్ కేర్ కు ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. అంకుర ప్రసూతి సంబంధితాల్లో అత్యుత్తమ సంరక్షణను, ప్రీమియం డెలివరీ సూట్స్ ను అందిస్తుంది. పిల్లలకు జన్మనివ్వడానికి సంబంధించి ఇవి తల్లులకు అత్యుత్తమ అనుభూతులను అందిస్తాయి. మహిళల గైనకాలాజికల్ సమస్యలకు కూడా ఇది విస్తృత శ్రేణిలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. ఈ హై-టెక్ హాస్పిటల్ 110 బెడ్స్ కలిగిఉంది. 24 నియోనాటల్ ఐసీయూ, 18 పిడియాట్రిక్ ఐసీయూ బెడ్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఇది అతిపెద్ద పిడియాట్రిక్ మరియు అబ్ స్టెట్రిక్ ఇఆర్; అర్హులైన పిడియాట్రిషియన్స్ మరియు గైనకాలజిస్టులు ఇక్కడ ఉన్నారు; 24 గంటల పాటు ఉండే నర్సింగ్ స్టాఫ్ సగటున పదేళ్ళ అనుభవాన్ని కలిగిఉంటారు.
విజయవాడలో ప్రత్యేక అవసరాలు ఉండే చిన్నారుల కోసం తన సిడిసి (చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్) ద్వారా సమగ్ర ఇంటర్ వెన్షన్స్ మరియు థెరపీలను అందించే ఏకైక హాస్పిటల్ ఇదే. లాప్రోస్కోపిక్, తొరాకొస్కోపీ స్పెషలిస్టులతో పిడియాట్రిక్ సర్జరీ, యూరాలజీలో అంకుర ఒక అగ్రగామిగా ఉంది. వీరు ప్రొసీజర్స్ కు సంబంధించి రిస్క్ ను మరియు కోలుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించగలుగు తారు. విజయవాడలోని అంకుర సరికొత్త, టైలర్ మేడ్ సదుపాయ కేంద్రం. మహిళలు, చిన్నారుల సంరక్షణకు సంబంధించి అధునాతన చికిత్సలతో కూడుకొని ఉంది. సమగ్ర శ్రేణికి చెందిన పిడియాట్రిక్ స్పెషాలిటీలను ఇది అందిస్తుంది. పిడియాట్రిక్ న్యూరాలజీ, ఈఎన్ టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రినాల జీ, యూరాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, డెర్మటాలజీ, కార్డియోలజీ, పల్మనాలజీ, డెవలప్ మెంటల్ పిడియాట్రిక్స్, నియోనాటల్ ఐసీయూ, సర్జరీ వీటిలో ఉన్నాయి. 24 గంటల ల్యాబ్, 24 గంటల ఫా ర్మసీ, 24 గంటల క్రిటికల్ కేర్ అంబ్యులేటరీ సర్వీస్ లతో పాటుగా ఏ వయస్సులో ఉన్న మహిళలకై నా, ఏ దశలో ఉన్నవారికైనా హై రిస్క్ గర్భధారణలు, నొప్పి లేని ప్రసవాలు, ఫిటల్ మెడిసిన్, పోస్ట్ – నాటల్ కేర్, న్యూట్రిషన్, కంప్లీట్ గైనకాలాజికల్ కేర్ లను ఇది అందిస్తుంది. 50 కి.మీ. పరిధిలో చిన్న పిల్లల, గర్భవతుల అత్యవసర పరిస్థితులు వేటికైనా అంకుర వేగంగా స్పందిస్తుంది. అంకుర యొక్క ‘కనెక్ట్’ (Child or Neonate Needing Emergency Critical Care Transport) పిడియాట్రిక్ మరియు నియోనాటల్ బృందాలు, అంబులెన్స్ సిబ్బంది ని పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు అనుసం ధానం చేస్తుంది.
అంకుర హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, విద్య రాజధాని, దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో ఒకటైన చోట దుర్గా మాత ఆశీస్సులతో అంకుర 11వ బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నందుకు మా కెంతో ఆనందంగా ఉంది. దేశానికి ఆరోగ్యసంరక్షణ నాయకత్వం, వైద్య వినూత్నత అవసరమైన సమ యంలో మనం జీవిస్తున్నాం, పని చేస్తున్నాం. అది సాధించేందుకు మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణ ఒక ప్రాథమిక అవసరం. ప్రపంచంలో యువ జనాభా మన వద్దనే అధికంగా ఉంది. మన జనాభాలో స గం మంది మహిళలు. అందుకే ఈ నిర్దిష్ట విభాగం మన దేశపు సామాజిక, ఆర్థిక వృద్ధిని తీర్చిదిద్దగ లుగుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అందుకే దేశంలో అతిపెద్దది అని మాత్రమే గాకుండా అత్యంత అధునాతన ఆరోగ్యసంరక్షణను అందించే సంస్థగా ఉండాలనే ఆశయంతో నేను అంకుర హాస్పి టల్ బాధ్యతలు స్వీకరించాను. ఈ గొప్ప ఆశయంలో భాగంగా, అంకుర తన కార్యకలాపాలను విజయ వాడకు విస్తరించింది. ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు అంకురను విస్తరింపజేయాలన్నది మా ప్రణాళిక లో భాగంగా ఉంది.
విజయవాడలో మా కేంద్రం 70000 చ.అ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అధునాతన సాంకేతికత, శి క్షణ పొందిన వైద్య నిపుణులు, మౌలిక వసతులతో కూడి ఉంది. రోగులకు ప్రత్యేక సంరక్షణ అందిం చాలన్నది మా లక్ష్యం. ప్రత్యేక వైద్య సదుపాయాలను కోరుకునే పరిసర పట్టణాల ప్రజలకు సైతం అం తర్జాతీయ స్థాయి ఆరోగ్యసంరక్షణను అందించే ఆశయంతో అంకుర హాస్పిటల్స్ ముందుకెళ్తోంది. ఈ హాస్పిటల్ నవజాత శిశువులకు, 18 ఏళ్ల లోపు పిల్లలకు, పుట్టుక నుంచి యుక్తవయస్సు, మా తృత్వం, మోనోపాజ్, ఆ తరువాది దశలతో సహా ఏ వయస్సులో ఉన్న మహిళలకైనా ఇక్కడ వైద్య సంరక్షణ లభిస్తుంది. పుట్టుక అనేది ఒక మధురమైన అనుభూతి అనిపించేలా చేయాలని అంకురలో మేం కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
ఈ వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యఅతిథి, అంకుర హాస్పిటల్ ప్రచారకర్త సోను సూ ద్ మాట్లాడుతూ, ‘‘అంకుర హాస్పిటల్ 11వ కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం, అంకుర దీర్ఘకా లిక భాగస్వామి కావడం నాకెంతో ఆనందదాయకం. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో నిపుణులై న వీరితో నాకు స్వయంగా అనుబంధం ఉంది. గతంలో కూడా నేను అంకుర హాస్పిటల్ తో కలసి పని చేశాను. మహహ్మారి సమయంలో గైనకాలజీ, పిడియాట్రిక్స్ కు సంబంధించి నేను కొన్ని కేసులను వారికి రెఫర్ చేశాను. వారు చక్కటి ఫలితాలను అందించారు. ఇక్కడ చికిత్స పొందిన వారంతా ఆరోగ్య వంతులై ఇళ్లకు చేరుకున్నారు. అది నా విశ్వాసాన్ని పెంచింది. తాను చెప్పేదే ఆచరించే ఇలాంటి ఆ రోగ్య సంరక్షణ బ్రాండ్ తో నా అనుబంధాన్ని మరింత పెంచింది’’ అని అన్నారు.
‘‘మెట్రోనగరాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అధునాతన వైద్య సంరక్షణ, మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది డాక్టర్ కృష్ణప్రసాద్ ఆశయం. దాన్ని నెరవేర్చేందుకు అంకుర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది. అంకురను మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా చేస్తోంది. అంకుర లో ఉన్న వారంతా కూడా నిజమైన మార్పు కోరుకునే వారు. దేశాన్ని ఆరోగ్యవంతమైన మహిళలు, పిల్లలతో కూడుకున్నదిగా చేసేందుకు తమ ప్రయాణంలో నన్ను భాగస్వామిగా చేసుకున్నందుకు వారికి నా ధన్యవాదాలు’’ అని అన్నారు.
అంకుర హాస్పిటల్స్ గురించి:
అంకుర హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ లోని సైబర్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న, మహి ళలు, పిల్లల సూపర్ – స్పెషాలిటీ చెయిన్. 2011లో ఇది ప్రారంభించబడింది. నేడు ఇది తెలుగు రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాలకు తన కార్యకలాపాలు విస్తరించింది. అంకుర హాస్పిటల్ ఎన్ఏబీహెచ్ అక్రెడిటెడ్ విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రం. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలకు ఇది టెరిటరీ, క్వాటెరినరీ సేవల ను అందిస్తోంది. హా స్పిటల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 11 ప్రాంతాల్లో మొత్తం 1000 ఆపరేష నల్ బెడ్స్ సామర్థ్యాన్ని కలి గి ఉంది. ఈ హాస్పిటల్ గ్రీన్ ఓటీ, లెవెల్ 3 ఎన్ఐసీయూ, పీఐసీయూలను కలిగిఉంది. ఇది తన క్రిటికల్ కేర్ టీమ్ కు ఎంతో పేరొందింది. ఈ హాస్పిటల్ అత్యంత అధునాతన సదు పాయాలను, ఉపకరణాలను, ఆధునిక క మ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కలిగి ఉంది.

Leave a Reply